సీఎం రేసులో నేను లేను: గడ్కరీ | I am not in the race of CM post of Maharastra, Nitin Gadkari | Sakshi
Sakshi News home page

సీఎం రేసులో నేను లేను: గడ్కరీ

Published Thu, Oct 16 2014 6:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

సీఎం రేసులో నేను లేను: గడ్కరీ - Sakshi

సీఎం రేసులో నేను లేను: గడ్కరీ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో తాను లేనని కేంద్ర రవాణా, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం లేదని మీడియాతో గడ్కరీ అన్నారు. 
 
గత 15 ఏళ్లలో కాంగ్రెస్, ఎన్సీపీల పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఈసారి ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని గడ్కరీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement