చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ అన్నారు. అయితే ఇప్పటికే హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంబాల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న అనిల్ విజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
‘‘ నేను ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏం ఆశించలేదు. కానీ ఈసారి మాత్రం నా సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నేను హర్యానాకు సీఎం కావాలనుకుంటున్నా. రాష్ట్రంలోని నలుమూలల నుంచి నన్ను కలవడానికి వస్తున్నారు. అంబాల ప్రజలు కూడా నేను చాలా సీనియర్ నేతను అని.. నేను ఎందుకు ముఖ్యమంత్రి కావొద్దని అడుగుతున్నారు. ప్రజల డిమాండ్, నా సీనియార్టి ఆధారంగా ఈసారి కచ్చితంగా నేను హర్యానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. నాకు పార్టీ అధిష్టానం ఈసారి సీఎంగా అవకాశం కల్పిస్తే.. హర్యానా ముఖచిత్రాన్ని మార్చివేస్తాను’’ అన్నారు.
హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక.. సీఎం నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫోకస్ పెట్టింది.
#WATCH | BJP candidate from Ambala Cantt Assembly constituency Anil Vij says, "I am the senior most MLA of BJP in Haryana. I have contested elections for 6 times. On the demand of people, I will claim for the designation of CM on the basis of my seniority this time. However, it… pic.twitter.com/jdwQt9nKSS
— ANI (@ANI) September 15, 2024
Comments
Please login to add a commentAdd a comment