anil vij
-
ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్!
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ విజ్ అన్నారు. అయితే ఇప్పటికే హర్యానాలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీని బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ విజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అంబాల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న అనిల్ విజ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘ నేను ఇప్పటి వరకు పార్టీ నుంచి ఏం ఆశించలేదు. కానీ ఈసారి మాత్రం నా సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నేను హర్యానాకు సీఎం కావాలనుకుంటున్నా. రాష్ట్రంలోని నలుమూలల నుంచి నన్ను కలవడానికి వస్తున్నారు. అంబాల ప్రజలు కూడా నేను చాలా సీనియర్ నేతను అని.. నేను ఎందుకు ముఖ్యమంత్రి కావొద్దని అడుగుతున్నారు. ప్రజల డిమాండ్, నా సీనియార్టి ఆధారంగా ఈసారి కచ్చితంగా నేను హర్యానా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా. నాకు పార్టీ అధిష్టానం ఈసారి సీఎంగా అవకాశం కల్పిస్తే.. హర్యానా ముఖచిత్రాన్ని మార్చివేస్తాను’’ అన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక.. సీఎం నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలో హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఫోకస్ పెట్టింది.#WATCH | BJP candidate from Ambala Cantt Assembly constituency Anil Vij says, "I am the senior most MLA of BJP in Haryana. I have contested elections for 6 times. On the demand of people, I will claim for the designation of CM on the basis of my seniority this time. However, it… pic.twitter.com/jdwQt9nKSS— ANI (@ANI) September 15, 2024చదవండి: తమిళ ప్రజలకు రాముడు తెలియకుండా చేశారు: గవర్నర్ రవి -
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్‌ఎస్‌వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
అన్నా ఉద్యమాన్ని మోసం చేసి ‘ఆప్’ పుట్టింది: హర్యానా మంత్రి
హర్యానా: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 2011లో సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అన్నా హజారే ఉద్యమన్ని మోసం చేయడం వల్లనే ఆప్ పుట్టిందని అన్నారు. ‘ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఆందోళనను మోసం చేయడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. పంజాబ్ ప్రజలు అటువంటి వారిని(ఆప్) ఎన్నుకున్నారు, భవిష్యత్తులో వారు తమ వాగ్దానాలను నెరవేర్చగలరో? లేదా విఫలమవుతారో? చూద్దాం’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి అనిల్ విజ్.. ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఢిల్లీ వీధుల్లో మద్యం అమ్మడంలో ప్రావీణ్యం సంపాదించిందని దుయ్యబట్టారు. అటువంటి పార్టీ పంజాబ్‌లో గెలవడం వల్ల ఆ రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే. -
‘‘ఆమె డీఎన్ఏ తేడా.. భారత్ ఓడిపోతే.. టపాసులు కాల్చింది’’
చండీగఢ్: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ ఓటమిని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ ఓటమి తర్వాత దేశంలో రాజకీయ విమర్శలు పెరిగిపోయాయి. టీమిండియా ఓటమితో బాధలో ఉన్న క్రీడాభిమానులు మన రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు చూసి.. తలలు పట్టుకుంటున్నారు. టీమిండియా ఓటమి అనంతరం పలువురు రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా వారి జాబితాలోకి హరియాణా హెల్త్ మినిస్టర్ అనిల్ వీజ్ చేరారు. పాకిస్తాన్ విజయంపై స్పందించిన అనిల్ విజ్.. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె డీఎన్ఏలోనే ఏదో లోపం ఉందన్నారు. ముఫ్తీలో భారతీయత ఏ మేరకు ఉందో నిరూపించుకోవాలని సవాల్ చేశారు. సోమవారం మెహబూబా ముఫ్తీ చేసిన ట్వీట్‌ని ఉద్దేశించి అనిల్ విజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: టీమిండియాతో మ్యాచ్: పాక్ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు) ‘‘టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ సాధించిన గెలుపును కొందరు కశ్మీరీలు సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు మిఠాయిలు పంచుకున్నారు కొందరు. వారు గుర్తులేరా’’ అంటూ ముఫ్తీ ట్వీట్ చేశారు. దీనిపై అనిల్ విజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: Ind Vs Pak: భారత్ ఓటమి... గుండెపోటుతో అభిమాని మృతి ) ‘‘మెహబూబా ముఫ్తీ డీఎన్ఏలోనే ఏదో తేడా ఉంది. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఆమె మాత్రమే కాదు పాకిస్తాన్ విజయం సాధించిన సందర్భంగా కొందరు టపాసులు కాల్చారు. వారి డీఎన్ఏ కూడా తేడానే. మన చుట్టూ దాక్కున్న దేశ ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అంటూ అనిల్ విజ్ ట్వీట్ చేశారు. पाकिस्तान के क्रिकेट मैच जीतने पर भारत में पटाखे फोड़ने वालों का डीएनए भारतीय नहीं हो सकता । संभल के रहना अपने घर में छुपे हुए गद्दारों से । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) October 26, 2021 చదవండి: Mohammad Shami: పాక్ అభిమానికి స్ట్రాంగ్ వార్నింగ్..! -
రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ..
చండీఘఢ్: దేశంలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా ప్రాణాంతక వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, ఐటీ రాజధాని బెంగళూరులో రాత్రివేళ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా సైతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. కాగా హర్యానాలో ఆదివారం కొత్తగా 16 కరోనా మరణాలు సంభవించాయి. 3440 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3268కి చేరగా, కేసుల సంఖ్య 316881గా ఉంది. చదవండి: ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ.. 9 గంటలకే బంద్! -
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను ఒక వలంటీర్‌గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్‌కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు. -
వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడ్డ మంత్రి!
చండీగఢ్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా 'కోవాక్సీన్' ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్ 20న తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా అనిల్ టీకాను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అంబాలా కాంట్ లోని సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు అనిల్ విజ్ తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 20న ఇదే ఆసుపత్రిలో విజ్‌కు కోవిడ్-19 టీకా ‘‘కోవాక్సిన్’’ ఇచ్చారు. (చదవండి: దేశంలో కొత్తగా 36,652 కరోనా కేసులు) మూడోదశ మొదటి వాలంటీర్‌గా విజ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడోదశ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా విజ్ ముందుకొచ్చారు. -
బీజేపీ నేత మృతి; మహిళా ఐపీఎస్‌పై కేసు
చండీఘడ్: హరియాణా బీజేపీ నేత హరీశ్ శర్మ మృతి నేపథ్యంలో పానిపట్ ఎస్పీ మనీషా చౌదరిపై కేసు నమోదైంది. హరీశ్‌ను ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ మేరకు ఆమెపై చర్య తీసుకున్నారు. మనీషాతో పాటు మరో ఇద్దరు పోలీసులపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోం మంత్రి అనిల్ విజ్ ఆదేశాల మేరకు మనీషాపై కేసు నమోదు చేయగా, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘‘ఒకవేళ ఎస్పీపై ఈ విధంగా కేసు నమోదు చేసినట్లయితే, రాష్టంలో ఏదో ఒకచోట నేరం జరిగితే అందుకు డీజీపీపై కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా’’ అంటూ చౌతాలా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు రాష్ట వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులపై నిషేధం గురించి బీజేపీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ హరీశ్ శర్మ(52) కుమార్తె అంజలి శర్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. (చదవండి: కశ్మీర్ భూ స్కామ్‌లో మాజీ మంత్రులు!) ఈ క్రమంలో హరీశ్‌తో పాటు ఆయన కూతురు సహా మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్ శర్మ నవంబరు 19న కెనాల్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, తనను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు కూడా చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి అంజలి శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్నను ఓ ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వారు వ్యవహరించిన తీరుతో ఆయన కుంగిపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: అమానుషం: పసిపాపను వదిలించుకునేందుకు..) ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ విజ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ చీఫ్ మనోజ్ యాదవ్‌ను సోమవారం ఆదేశించారు. సత్వరమే స్పందించకపోవడంతో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పానిపట్ ఎస్పీ మనీషా చౌదరిపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా మనీషా చౌదరి 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. త్వరలోనే ఆమె చండీఘర్ ఎస్ఎస్పీ(ట్రాఫిక్)గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా, ఈ మేరకు కేసు నమోదు కావడంతో జాప్యం నెలకొంది. -
వాళ్లకు పాసులు జారీ చేయకండి..
చండీగఢ్: లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దేశ రాజధానిలో పనిచేస్తున్న హర్యానా ప్రజలు అక్కడే ఉండేలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏర్పాట్లు చేయాలని హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరాల నిమిత్తం జారీ చేసిన పాసులను ఉపయోగించి కొంతమంది ప్రజలు తరచూ ప్రయాణాలు చేస్తూ కరోనా కారియర్స్‌గా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం అనిల్ విజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరై రాష్ట్రానికి వచ్చిన వారిలో 120 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారి చికిత్స ఖర్చులను హర్యానా సర్కారే భరించింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో పనిచేసే చాలా మంది వ్యక్తులు పాసులు ఉపయోగించి రోజూ అటూ ఇటూ తిరుగుతున్నారు. వారి కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.(అమెరికా, చైనా, భారత్ ఎంత ఖర్చు చేశాయంటే..) ఇక హర్యానా పోలీసు అధికారి సోదరి ఒకరు ఢిల్లీలో పనిచేస్తున్నారని.. ఆమె కారణంగా కుటుంబం మొత్తం కోవిడ్-19 బారిన పడిందని అనిల్ విజ్ పేర్కొన్నారు. అదే విధంగా ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా సోనిపట్‌లో 9 మందికి కరోనా వైరస్ సోకిందని తెలిపారు. కాబట్టి ఢిల్లీలో ఉన్న వాళ్లకు పాసులు ఇచ్చి హర్యానాకు పంపవద్దని... వారికి అక్కడే క్వారంటైన్ చేయాలని కేజ్రీవాల్‌ను కోరారు. ఇతర రాష్ట్రాలు తమ ప్రజలను సొంత స్థలాలకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటే అనిల్ విజ్ ఈ విధంగా మాట్లాడటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా హర్యానా వ్యాప్తంగా ఇప్పటివరకు 280 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మూడు మరణాలు సంభవించాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 800 దాటగా.. 27 వేల మందికి పైగా మహమ్మారి సోకింది. (జూలై 25 నాటికి కరోనా నుంచి భారత్‌కు విముక్తి!) -
నా భర్తను చంపేశాను.. ఉరి తీయండి!
చండీగఢ్: హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ వద్దకు ఒక మహిళ ఏడుస్తూ వచ్చి.. 'నా భర్తను రెండు సంత్సరాల కింద హత్య చేశాను. నాకు ఉరిశిక్ష విధించండి' అని విన్నవించుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన అంబాలలో అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రజలు తమ సమస్యలను నివేదించేందుకు ఏర్పాటు చేసిన జంతర్ మంతర్ కార్యక్రమానికి వచ్చిన సునీల్ కుమారీ, తన భర్తను హత్య చేశానని పశ్చాత్తాపడుతూ.. తాను చేసిన తప్పునకు శిక్ష విధించమని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్‌ను లేఖలో వేడుకొన్నారు. సునీల్ కుమారీ కథనం మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. Ambala: A woman confessed to killing her husband 2 years ago, in a letter she handed to Haryana Home Minister Anil Vij during a 'janta darbar'. He says, "She confessed & said she wants to be punished for it. I handed her over to police & she was taken to a police station" (24.12) pic.twitter.com/kLZpX2TUGj — ANI (@ANI) December 24, 2019 కాగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రోహ్తాష్ సింగ్, మద్యానికి బానిసై తరచూ తాగివచ్చి భార్య సునిల్ కుమారీని వేధింపులకు గురిచేసేవాడు. ఎప్పటిలానే జూలై15, 2017న కూడా అతిగా మద్యం సేవించి, దుర్భాషలాడుతూ.. మత్తులో తూలుతూ కింద పడిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుమారీ.. భర్తకు వాంతులు అవడం గమనించి.. అతడి నోటికి తన దుపట్టాను అదిమిపెట్టగా.. అతడు చనిపోయాడు. ఇక పోస్టుమార్టం నివేదికలోనూ రోహ్తాష్ వాంతి కారణంగానే ప్రాణాలు విడిచాడని వెల్లడవడంతో.. ఆమె శిక్ష నుంచి తప్పించుకున్నారు. అయితే సునీల్ కుమారీ మాత్రం తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. అతడిని హత్య చేశాననే అపరాధ భావాన్ని తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తానే హత్య చేశానంటూ హోంమంత్రి వద్ద మొరపెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. -
‘వివాదాలు కాదు.. ముందు ఆటపై దృష్టి పెట్టు’
కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల పంట పండించిన హర్యానా యువ షూటర్ మను బాకర్ తీరును ఆ రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి అనిల్ విజు విమర్శించారు. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న మనుకు ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా తనకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని పేర్కొంటూ... ‘ మీరు ప్రకటించిన నజరానా నిజమా లేదా అంతా ఉత్తిదేనా’ అంటూ ఆమె ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మను బాకర్ ట్వీట్‌కు స్పందించిన అనిల్ విజు.. ‘ ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రస్తావించే ముందు.. మను బాకర్ మొదట క్రీడా శాఖను సంప్రదించాల్సింది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే క్రీడాకారులకు అత్యధిక అవార్డులు అందిస్తున్న రాష్ట్రం మనదే. నేను ట్వీట్ చేసినట్లుగానే.. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆమెకు రూ. 2 కోట్లు అందజేస్తాం. ఆటగాళ్లకు కాస్త క్రమశిక్షణ అవసరం. ఇలా వివాదం సృష్టించినందుకు ఆమె చింతించాలి. తనకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇవన్నీ మాని ఆటపై దృష్టిపెడితే బాగుంటుంది’ అని హితవు పలికారు. Sir Please confirm if it is correct... Or just Jumla... @anilvijminister pic.twitter.com/AtxpLKBSYV — Manu Bhaker (@realmanubhaker) January 4, 2019 Manu Bhaker should have first confirmed it from the Sports Deptt. before going to public domain. It is disgusting to denounce a State Govt which is giving highest awards in the Country. Bhaker will will will get 2 crores as tweated by me and as per notification at that time. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) January 5, 2019 There should be some sense of decipline in players. Bhaker should feel sorry for creating this controversy. She has a long way to go. She should focus on her game only. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) January 5, 2019 -
క్యాష్ ప్రైజ్ అంతా ఉత్తిదేనా?: అథ్లెట్ ఆవేదన
చంఢీగడ్: క్రీడాకారులు పథకాలు సాధిస్తే వారిపై వరాల జల్లులు కురిపించడం ప్రభుత్వ పెద్దలకు చాలా సాధారణ విషయం. ఇక గెలిచిన హడావుడి అయిపోయిన తర్వాత ఆ క్రీడాకారులను పట్టించుకోని సందర్భాలు చాలానే ఉంటాయి. ఇలాంటి అనుభవమే భారత యువ షూటర్ మను బాకర్‌కు ఎదుర్కొంటోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడితో పాటు యూత్ ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించినప్పుడు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అక్టోబర్‌లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో మను బాకర్ స్వర్ణ పతాకం గెలిచారు. దీంతో హర్యానా క్రీడా శాఖ మంత్రి అనిల్ విజ్ మను బాకర్‌కు రెండు కోట్ల నజరానాను ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు క్రీడాకారులను పట్టించుకోలేదని.. పతకాలు సాధిస్తే కేవలం పది లక్షలు మాత్రమే ఇచ్చి సంతృప్తి పరిచేవారని కానీ తమ ప్రభుత్వం క్రీడాకారులను ప్రొత్సహించే ఉద్దేశంతో మను బాకర్‌కు రెండు కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకూ తనకు ఎలాంటి అర్థిక సహాయం అందలేదని.. ‘మంత్రి గారు మీరు ప్రకటించిన నజరానా నిజమా.. లేక ఉత్తిదేనా’ అంటూ శుక్రవారం మనుబాకర్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతంలో మంత్రి చేసిన ట్వీట్‌కు సంబంధించన స్క్రీన్ షాట్లు కూడా పోస్ట్ చేశారు. ఇక ఈ యువ షూటర్ చేసిన పోస్ట్ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారాయి. ప్రభుత్వ తీరుపై క్రీడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Sir Please confirm if it is correct... Or just Jumla... @anilvijminister pic.twitter.com/AtxpLKBSYV — Manu Bhaker (@realmanubhaker) January 4, 2019 -
రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి
చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్ లాంటి వ్యక్తి అంటూ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరికి వచ్చిన వారినందరినీ రాహుల్ నాశనం చేస్తాడని అనిల్ అన్నారు. ‘రాహుల్ నిపా వైరస్ లాంటి మనిషి. పార్టీని సర్వనాశనం చేస్తాడు. దగ్గరైన వారికీ పతనం తప్పదు’ అని అనిల్ అన్న మాటలను ఓ ప్రకటన రూపంలో హరియాణా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. కాగా, అనిల్ విజ్ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ తాజ్ మహల్ ఓ అందమైన సమాధి అనీ, మహాత్మాగాంధీ ప్రభావం వల్ల ఖాదీకి విలువ పెరగకపోగా, రూపాయి విలువ తగ్గిపోయిందని అనిల్ వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీ ఓ నిపా వైరస్
చండీగఢ్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానమని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం ఆయన చేసిన ఈ ట్వీట్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడుతున్నారు. ‘రాహుల్ గాంధీ నిపా వైరస్‌తో సమానం. ఏ రాజకీయ పార్టీ అతనితో కలసినా నాశనం కావల్సిందే.’ అని అనిల్ విజ్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ఈ బీజేపీ మంత్రి ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. భగత్ సింగ్, లాలా లజపతిరాయ్‌లు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని, కానీ నెహ్రు, మహాత్మ గాంధీలు కనీసం ఓ లాఠి దెబ్బకూడ తినలేదని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టినప్పుడు సైతం అనిల్ విజ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపా వైరస్‌తో కేరళలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పక్షులు తిని పడేసే పండ్లు వల్ల వచ్చే ఈ వైరస్ తొలిసారి 1998 మలేషియాలో గుర్తించారు. राहुल गांधी #निपाह वायरस के समान है । जो भी राजनीतिक पार्टी इसके सम्पर्क में आएगी वह फना हो जाएगी । — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) May 27, 2018 -
తాజ్‌మహల్ ఓ అందమైన శ్మశానం
చండీగఢ్: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై రోజుకో వివాదం పుట్టుకొస్తోంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఆ ప్రేమ చిహ్నం ఓ అందమైన శ్మశాన వాటిక అని హరియాణా క్రీడల మంత్రి అనిల్ విజ్ శుక్రవారం ట్వీట్ చేశారు. గతంలోనూ విజ్ తన వ్యాఖ్యల ద్వారా వివాదాల్లో చిక్కుకున్నారు. భారత వారసత్వం, చరిత్రలో తాజ్‌మహల్ స్థానం ఏంటంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇటీవల వ్యాఖ్యానించడంతో దుమారం మొదలైన సంగతి తెలిసిందే. -
ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య
-
ముస్లింలే టెర్రరిస్టులు.. హిందూ ఉగ్రవాదం మిథ్య
- హరియాణ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఛండీగఢ్: ఉగ్రవాదం నేపథ్యంలో మతాలను వర్గీకరిస్తూ బీజేపీకి చెందిన హరియాణ మంత్రి అనిల్ విజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన ఉగ్రదాడుల్లో దోషులంతా ముస్లింలేనని, హిందూ అనేవాడు ఉగ్రవాది కాబోడని వ్యాఖ్యానించారు. బుధవారం ఛండీగఢ్‌లో ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. హిందూ ఉగ్రవాదం అనేది ఓ మిథ్య అన్నారు. ‘ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ వైఖరి. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు కోసమే వాళ్లు(కాంగ్రెస్) హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించారు. నిజానికి ఏ హిందువు ఉగ్రవాది కాడు.. కాబోడు. భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు జరిగిన దాడుల్లో దోషులు, నిందితులు అందరూ ముస్లింలేకదా?’ అని అనిల్ విజ్ అన్నారు. ఇండియాపై దాడులు చేసిన ఎంతోమంది టెర్రరిస్టులను కాంగ్రెస్ హయాంలో విడిచిపెట్టారని, ఇప్పుడు వాళ్లంతా సమన్లను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్‌లో ఎంజాయ్ చేస్తున్నారని అనిల్ విజ్ మండిపడ్డారు. హిందూ ఉగ్రవాదంటూ ఉండిఉంటే దేశం ఏనాడో నాశనమై ఉండేదని విజ్ అభిప్రాయపడ్డారు. -
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
-
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
చండీగఢ్: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ హరియాణా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు అమలు కాలేదని ఆమె ట్వీట్ చేశారు. ప్రకటనలు మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయని ఆమె ఆరోపించారు. సాక్షి మాలిక్ ట్వీట్‌పై హరియాణా మంత్రి అనిల్ విజ్ వెంటనే స్పందించారు. ప్రభుత్వం నుంచి ఆమె రూ. 2.5 కోట్ల చెక్ తీసుకున్నారని అనిల్ విజ్ వెల్లడించారు. సాక్షి మాలిక్ కోరిక మేరకు ఎండీ యూనివర్సిటీలో ఒక పోస్ట్‌ను కూడా క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన సాక్షి మాలిక్ తండ్రి సుదేశ్ మాలిక్.. ప్రభుత్వం 2.5 కోట్ల చెక్ ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన మిగతా హామీల సంగతేంటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. -
‘ఆమెను సమర్థించేవారిని వెళ్లగొట్టండి’
న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్ అమరుడి కుమార్తె గుర్మెహర్ కౌర్ ప్రకటించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. ఆమెపై బీజేపీ నాయకుల మాటల దాడి కొనసాగుతోంది. గుర్మెహర్ కౌర్ ను సమర్థించేవారు పాకిస్థాన్ అనుకూలురని, ఇటువంటి వారిని దేశం నుంచి వెళ్లగొట్టాలని హర్యానా మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. ఎవరు భారతీయులో, ఎవరు దేశ వ్యతిరేకులో నిర్ణయించే అధికారం ఏబీవీపీకి ఎక్కడదని... ఆ హక్కు ఎవరు ఇచ్చారని ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ప్రశ్నించారు. -
'కరెన్సీ నోట్లపై ఇక గాంధీ ఉండకపోవచ్చు'
-
'కరెన్సీ నోట్లపై ఇక గాంధీ ఉండకపోవచ్చు'
కరెన్సీ నోట్ల మీద ఉండే గాంధీ బొమ్మ క్రమంగా పోతుందని హరియాణాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగడం, సొంత పార్టీ నుంచి కూడా చీవాట్లు రావడంతో ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. గాంధీ కంటే మోదీ పెద్ద బ్రాండ్ నేమ్ అని.. అందువల్ల గాంధీ బొమ్మ ఇక నోట్లపై ఎన్నాళ్లో ఉండకపోవచ్చని విజ్ తెలిపారు. రూపాయి మీద గాంధీ బొమ్మ వచ్చినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోవడం మొదలైందని, క్రమంగా నోట్ల మీద కూడా ఆ బొమ్మ తీసేస్తారని వ్యాఖ్యానించారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేలండర్, డైరీల మీద చరఖాతో నూలు వడుకుతున్న గాంధీ బొమ్మకు బదులు అలా నూలు వడుకుతున్న మోదీ ఫొటో రావడంతో అసలు వివాదం మొదలైంది. అంబాలాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే అనిల్ విజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాదీ దుస్తులకు మోదీ బ్రాండింగ్ ఇచ్చిన తర్వాత వాటి అమ్మకాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని.. అందువల్ల ఖాదీకి మహాత్మాగాంధీ కంటే మోదీయే పెద్ద బ్రాండ్ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు బీజేపీ కూడా మండిపడింది. అవి ఆయన సొంత అభిప్రాయాలే తప్ప పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. స్వయంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా విజ్ వ్యాఖ్యలను ఖండించారు. దాంతో తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసిన తర్వాత ఆయన నాలుక కరుచుకుని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. -
మంత్రిగారి సరదా ఖరీదు.. కోటి రూపాయలు!
ఒలింపిక్స్‌కు వెళ్లిన తమ సొంత రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఓ మంత్రిగారు తన వంది మాగధులతో కలిసి బ్రెజిల్ వెళ్లాలని తలపెట్టారు. అందుకు అవుతున్న ఖర్చు అక్షరాలా కోటి రూపాయలు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడించారు. హర్యానా క్రీడాశాఖ మంత్రి అనిల్ విజ్ మొత్తం 9 మంది సభ్యులతో కలిసి రియో ఒలింపిక్స్ చూసేందుకు వెళ్తున్నారు. తన ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, అదనపు ప్రధాన కార్యదర్శి (క్రీడలు), ఆయన ప్రైవేటు కార్యదర్శి, క్రీడాశాఖ సంయుక్త డైరెక్టర్.. వీళ్లంతా మంత్రిగారితో పాటు బ్రెజిల్ వెళ్తున్నారు. వీళ్లలో ఒక్కరు మాత్రం గతంలో హాకీ జాతీయ క్రీడాకారుడు. మిగిలిన ఎవ్వరికీ క్రీడల్లో ఏమాత్రం అనుభవం లేదు. ఇప్పటికే కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ వెంట వెళ్లినవాళ్లు అక్కడ సిబ్బంది పట్ల అమర్యాదగా ప్రవర్తించారంటూ ఏకంగా గోయల్ అక్రిడేషన్ రద్దుచేస్తామని ఐఓసీ బెదిరించింది. ఇలాంటి తరుణంలో ఇలా జనాన్ని వెంటేసుకుని ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లడం ఏంటని విమర్శలు తలెత్తుతున్నాయి. హర్యానాలో క్రీడాకారులకు ఏడు నెలలుగా స్టైపండ్ చెల్లించలేదు. ఓపక్క డబ్బు లేదని ఇలా చెల్లింపులు ఆపేసి, మరోపక్క మంత్రిగారి సరదాలు తీర్చుకోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తం తొమ్మిది మంది బృందంలో నలుగురు బిజినెస్ క్లాస్‌లోను, మిగిలిన ఐదుగురు ఎకానమీ క్లాస్‌లోను ప్రయాణం చేయనున్నారు. భారతదేశం నుంచి మొత్తం 119 మంది ఒలింపిక్స్‌కు వెళ్లగా, వారిలో అత్యధికంగా 20 మంది హర్యానావాళ్లే ఉన్నారు. -
'అలాంటి వాళ్లు మా రాష్ట్రానికి రావొద్దు'
చండీగఢ్: హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ తినేవారు తమ రాష్ట్రానికి రావొద్దని హుకుం జారీ చేశారు. తమ రాష్ట్రంలో గోపరిరక్షణ చట్టం కట్టుదిట్టంగా అమలవుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 'ఆహారం, పానీయపు అలవాట్లు సరిపడవని కొన్ని దేశాలకు మనం వెళ్లం. అలాగే బీఫ్ తినకుండా ఉండలేమని భావించేవారు హర్యానాకు రాకుండా ఉంటే మంచిద'ని అనిల్ విజ్ అన్నారు. బీఫ్ తినే విదేశీయులకు ప్రత్యేక అనుమతి ఇస్తారా అని విలేకరులు ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. అయితే బీఫ్ తినే విదేశీయులకు మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అంతకుముందు ప్రకటించారు. వివాదస్పద ప్రకటనలు చేయడం అనిల్ విజ్ కు కొత్తకాదు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, దీనిపై ఆన్ లైన్ పోల్ నిర్వహించాలని గతేడాది ఆయన డిమాండ్ చేశారు. గోసంరక్షణ, గోవధ నిషేధం బిల్లును గతేడాది మార్చిలో గోవా అసెంబ్లీ ఆమోదించింది. గత నవంబర్ నుంచి ఈ బిల్లు అమల్లోకి రావడంతో ఆవుల అక్రమ రవాణా, గోవధ, బీఫ్ తినడంపై నిషేధం కొనసాగుతోంది. గోవధకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని ఈ బిల్లులో ఉంది. -
ఎదురు చెప్పిందని వేటేశారు
మంత్రితో వాదించారని హరియాణా మహిళా ఐపీఎస్ బదిలీ చండీగఢ్: హరియాణాలో ఓ మంత్రి మాటకు ఎదురు చెప్పిందన్న కారణంపై మహిళా ఐపీఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. ఫతేహబాద్ జిల్లా ఎస్పీ సంగీతా రాణి కాలియాతోపాటు మరో ఇద్దరు అధికారులను బదిలీ చేస్తున్నట్టు శనివారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. గురువారం ప్రజా ఫిర్యాదులు, సమస్యల పరిష్కార కమిటీ సమావేశం జరిగింది. ఓ ఎన్జీవో, రతియా అనే ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మంత్రి, ఎస్పీ కాలియా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి చివరకు ఎస్పీని గెటౌట్ అనేవరకు వ్యవహారం వెళ్లింది. మంత్రి మాటకు ఎదురు చెప్పిందన్న కారణంపై కాలియాపై ప్రభుత్వం వేటు వేసింది. మనేసర్‌లోని రిజర్వ్ పోలీసు బెటాలియన్‌కు బదిలీ చేసింది. మంత్రి అనిల్ విజ్ ఎస్పీని గద్దించిన సంఘటన వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో విపక్ష నేతలు, నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు. రెండు నెలల కిందట కూడా పై అధికారి మాట వినలేదని ఇలాగే ఓ మహిళా ఐపీఎస్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. అనిల్ విజ్‌కు నోటి దురుసు ఎక్కువని పేరుంది. మద్యం మాఫియా, డ్రగ్ మాఫియా కార్యకలాపాలపై ఓ ఎన్జీవో సంస్థ ఫిర్యాదు చేస్తే మంత్రికి ఎందుకు ఫిర్యాదు చేశారంటూ కాలియా ఎన్జీవో ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారని అనిల్ విజ్ మీడియాతో అన్నారు. మీడియా ముందే ఆ ఎస్పీ ప్రభుత్వాన్ని విమర్శించారని, ప్రభుత్వమే అక్రమ మద్యాన్ని విక్రయిస్తోందంటూ ఆరోపణలు చేశారని తెలిపారు. దీనిపై సీఎం ఖట్టర్ మాట్లాడుతూ.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, మంత్రి ప్రవర్తనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా తప్పుపట్టారు. ఆయనను మంత్రి పదవినుంచి తప్పించాలన్నారు.