హర్యానా మంత్రి అనిల్ విజ్
హర్యానా: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీపై హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. 2011లో సామాజికవేత్త అన్నా హజారే చేపట్టిన అవినీతికి వ్యతిరేక ఉద్యమాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అన్నా హజారే ఉద్యమన్ని మోసం చేయడం వల్లనే ఆప్ పుట్టిందని అన్నారు. ‘ఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఆందోళనను మోసం చేయడం వల్లే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. పంజాబ్ ప్రజలు అటువంటి వారిని(ఆప్) ఎన్నుకున్నారు, భవిష్యత్తులో వారు తమ వాగ్దానాలను నెరవేర్చగలరో? లేదా విఫలమవుతారో? చూద్దాం’ అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి అనిల్ విజ్.. ఆప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఢిల్లీ వీధుల్లో మద్యం అమ్మడంలో ప్రావీణ్యం సంపాదించిందని దుయ్యబట్టారు. అటువంటి పార్టీ పంజాబ్‌లో గెలవడం వల్ల ఆ రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. భగత్ సింగ్ స్వస్థలం ఖతర్ కలన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment