రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ.. | Covid 19 Haryana Announces 9 pm To 5 am Night Curfew Today | Sakshi
Sakshi News home page

రాత్రి కర్ఫ్యూ .. నేటి నుంచే అమలు: మంత్రి

Published Mon, Apr 12 2021 8:48 PM | Last Updated on Tue, Apr 13 2021 10:28 AM

Covid 19 Haryana Announces 9 pm To 5 am Night Curfew Today - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీఘఢ్‌: దేశంలో మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా ప్రాణాంతక​ వైరస్‌ సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై, ఐటీ రాజధాని బెంగళూరులో రాత్రివేళ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా సైతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించారు. కాగా హర్యానాలో ఆదివారం కొత్తగా 16 కరోనా మరణాలు సంభవించాయి. 3440 కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 3268కి చేరగా, కేసుల సంఖ్య 316881గా ఉంది.

చదవండి: ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ.. 9 గంటలకే బంద్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement