సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
చండీగఢ్: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ హరియాణా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు అమలు కాలేదని ఆమె ట్వీట్ చేశారు. ప్రకటనలు మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయని ఆమె ఆరోపించారు.
సాక్షి మాలిక్ ట్వీట్‌పై హరియాణా మంత‍్రి అనిల్ విజ్ వెంటనే స్పందించారు. ప్రభుత్వం నుంచి ఆమె రూ. 2.5 కోట్ల చెక్ తీసుకున్నారని అనిల్ విజ్ వెల్లడించారు. సాక్షి మాలిక్ కోరిక మేరకు ఎండీ యూనివర్సిటీలో ఒక పోస్ట్‌ను కూడా క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన సాక్షి మాలిక్ తండ్రి సుదేశ్ మాలిక్.. ప్రభుత్వం 2.5 కోట్ల చెక్ ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన మిగతా హామీల సంగతేంటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు.