haryana government
-
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్‌సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్‌కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్‌పై ఆరోపణలు గుప్పించారు. -
జైల్లో లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్యూ: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయడంపై పంజాబ్ పోలీసులపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లారెన్స్ బిష్ణోయ్ భటిండా జైల్లో పోలీసు కస్టడీలో ఉండగా.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చారు. దీని రెండు విడుతల్లో మార్చి 2023లో ఒక జాతీయ ఛానెల్లో ప్రసారం చేశారు.కాగా జైలు ప్రాంగణంలో ఖైదీలు మొబైల్ ఫోన్లను వినియోగించడంపై దాఖలైన వ్యాజ్యంపై న్యాయమూర్తులు అనుపిందర్ సింగ్ గ్రేవాల్, జస్టిస్ లపితా బెనర్జీలతో కూడిన ధర్మాసనం బుధవారం తాజాగా విచారణ చేపట్టింది. బిష్ణోయ్ ఇంటర్వ్యూ కేసులో సిట్ దాఖలు చేసిన రద్దు నివేదిక పోలీసు అధికారులకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్యం సంబంధం ఉందనే అనుమానాలను లేవనెత్తుతందని హైకోర్టు పేర్కొంది. ‘పోలీసు అధికారులు నేరస్థుడిని ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. ఇంటర్వ్యూను నిర్వహించడానికి స్టూడియో లాంటి సదుపాయాన్ని కల్పించారు. ఇవన్నీ నేరస్థుడికి అందించడం ద్వారా మీరు నేరాన్ని ప్రోత్సహించారు. కావున ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం’ అని కోర్టు పేర్కొంది.బిష్ణోయ్ ఇంటర్వ్యూకు అనుమతించిన సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశిస్తూ 2024 ఆగస్టు నాటి ఉత్తర్వును పాటించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు మందలించింది. అంతేగాక సస్పెండ్ చేసిన ఏడుగురు అధికారులలో ఐదుగురు జూనియర్ ర్యాంక్‌కు చెందినవారేననిని, కేవలం ఇద్దరే డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారులని తెలిపింది. ఈ మేరకు మానవ హక్కుల కమిషన్ చీఫ్ ప్రబోధ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందంతో తాజా దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది.ఇదిలా ఉండగా జైల్లో బిష్ణోయ్ ఇంటర్వ్యూకి సహకారం పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసు అధికారులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2022 సెప్టెంబరు 3, 4 తేదీల్లో పోలీస్ కస్టడీలో ఉండగా లారెన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు, ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా గత ఏడాది మార్చిలో ప్రసారమైనట్లు సిట్ ధ్రువీకరించింది. దీంతో పంజాబ్ హోం శాఖ కార్యదర్శి గుర్కిరత్ కిర్పాల్ సింగ్ ఈ నెల 25న ఈ అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. -
చట్టాల కోరలు తీశారు
న్యూఢిల్లీ: దేశంలో పర్యావరణ చట్టాల్లో సవరణలు చేసి, చివరకు వాటిని కోరల్లేనివిగా మార్చేశారని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనాన్ని నియంత్రించడానికి తీసుకొచి్చన ‘దేశ రాజధాని, పరిసర ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) చట్టం–2021’ను ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని ప్రశ్నించింది. సీఏక్యూఎం చట్టం విషయంలో కేంద్రం తీరును న్యాయస్థానం తప్పుపట్టింది. చట్టం అమలుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. ఢిల్లీలో కాలుష్యం తీవ్రత, పంట వ్యర్థాల దహనం సమస్యపై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపించారు. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15కు సంబంధించి మరికొన్ని నియంత్రణలను మరో 10 రోజుల్లో జారీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని ప్రభావవంతంగా అమలు చేయడానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించడంతోపాటు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు. పంజాబ్, హరియాణా అధికారులకు, కాలుష్య నియంత్రణ మండళ్లకు సీఏక్యూఎం ఇప్పటికే లేఖలు రాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంట వ్యర్థాలను దహనం చేస్తూ కాలుష్యానికి కారణమవుతునవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఆదేశించిందని అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తమకు తెలుసని పేర్కొంది. కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. చటాన్ని ఉల్లంఘించే వారిపై పర్యావరణ పరిహార పన్నును మరింత పెంచేలా చట్టంలో సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పంజాబ్, హరియాణా ప్రభుత్వాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాల దహనాన్ని ఎందుకు అరికట్టడం లేదని నిలదీసింది. సీఏక్యూఎం ఆదేశాలను ఆయా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని మండిపడింది. కాలుష్య నియంత్రణ విషయంలో పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు కేవలం కంటితుడుపు తప్ప అందులో కార్యశీలత లేదని ఆక్షేపించింది. పంట వ్యర్థాలను దహనం చేసేవారికి కేవలం రూ.2,500 చొప్పున జరిమానా విధించడం ఏమిటని ప్రశ్నించింది. కేవలం నామమాత్రంగా జరిమానా విధించి, కాలుష్యానికి లైసెన్స్ ఇస్తున్నారా అని న్యాయస్థానం మండిపడింది. -
అగ్నివీర్లకు పోలీస్, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పదవికాలం ముగిసిన అగ్నివీర్లకు (హర్యానాకు చెందిన వారు) పోలీసు, మైనింగ్ గార్డు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తన్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ప్రకటించారు. అగ్నివీర్ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. నైపుణ్యం కలిగిన యువతకు ఇది మంచి అవకాశమని ప్రధాని నరేంద్ర మోదీనే పేర్కొన్నారని చెప్పారు. కాగా హర్యానాలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కాగా అగ్నిపథ్ పథకంపై కేంద్రం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే.అగ్నిపథ్ పథకాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ 2022 సెప్టెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్ల కంటే దిగువ స్థాయి సైనికుల నియామకాలు జరుపుతారు. సైనిక బలగాల్లోకి నియమాకాలు జరిపే ఏకైక పద్ధతి ఇదే. ఈ పథకం ద్వారా నియమితులైనవారిని అగ్నివీరులు అంటారు. వీరి ఉద్యోగ కాలం 4 సంవత్సరాలు. ఈ పథకంలో పాత విధానంలో ఉన్న దీర్ఘకాలిక పదవీకాలం, పెన్షన్ వంటి ఇతర ప్రయోజనాలు ఉండవు.ఈ పథకంపై దేశంలో నిరసనలూ చెలరేగాయి. దేశం లోని పలు ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. కొత్త పథకంతో కోపంగా ఉన్న ఆర్మీ ఆశావహులు దీనిని వెనక్కి తీసుకోవాలని పిలుపునిచ్చారు. బస్సులు, రైళ్లతో సహా ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు ఈ పథకాన్ని విమర్శిస్తూ దానిలోని లోపాలను ఎత్తిచూపాయి. ఈ పథకాన్ని ప్రస్తుతానికి నిలిపివేసి, పార్లమెంటులో చర్చించేవరకు ఈ పథకాన్ని నిలిపివేయాలని కోరాయి. -
నూహ్‌లో ప్రశాంతంగా పూజలు
నూహ్(హరియాణా): సర్వజాతీయ హిందూ మహాపంచాయత్ సంస్థ సోమవారం నూహ్‌లో తలపెట్టిన శోభాయాత్రను అధికారులు అడ్డుకున్నారు. జూలై 31న నూహ్‌లో మత కలహాలు చెలరేగిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం తాజాగా శోభాయాత్రకు అనుమతి నిరాకరించింది. మల్హర్, ఝిర్, శింగార్ శివాలయాల్లో పూజలు మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో, అధికారులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దుల నుంచి నూహ్ వరకు అయిదు ప్రధాన చెక్ పాయింట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు అయోధ్య నుంచి బయలుదేరిన జగద్గురు పరమహంస ఆచార్య తదితరుల బృందాన్ని సోహ్నా వద్ద ఘమోర్జ్ టోల్ ప్లాజా వద్ద నిలిపివేశారు. అనంతరం అధికారులు నూహ్ జిల్లాలోకి అనుమతించిన 15 మంది సాధువులు, ఇతర హిందూ నేతలు సుమారు 100 మంది నల్హర్‌లోని శివాలయంలో జలాభిక పూజలు చేశారు. అక్కడ్నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ఫిరోజ్‌పూర్‌లోని ఝిర్కా ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. శింగార్ ఆలయానికి కూడా వెళ్లారని అధికారులు తెలిపారు. ఎటువంటి అవాంఛ నీయ ఘటనలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఇలా ఉండగా, సోమవారం సోహ్నా నుంచి నూహ్ వరకు పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలేవీ తెరుచుకోలేదు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. -
నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
చండీగఢ్: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్ ఇంటర్నెట్తోపాటు ఎస్ఎంఎస్ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్ కపూర్ చెప్పారు. -
ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం
పనాజి: సంచలనం సృష్టించిన హర్యానా నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు. ‘‘మా పోలీసుల(గోవా పోలీసులు) మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని గోవా సీఎం సావంత్ ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి లేఖ రాసినట్లు సావంత్ వెల్లడించారు. అంతకు ముందు.. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా గోవా పోలీసుల దర్యాప్తుపై సోనాలీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకుంటే సీబీఐ విచారణకే అప్పగిస్తామంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే గోవా ప్రభుత్వం సీబీఐకు కేసును అప్పగించడం గమనార్హం. గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్ సాంగ్వాన్, సుధీర్ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: తల నరికేసే ఊరిలో.. సరిహద్దు! -
డైరెక్టర్ కాళ్లు పట్టుకుని ఏడ్చేసిన మహిళ.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
A Women Cried After Watching The Kashmir Files Movie: సామాజిక అంశాలను తన సినిమాలతో వేలెత్తి చూపే బాలీవుడ్ దర్శకులలో వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి కీలక పాత్రల్లో నటించారు. 1990లో కశ్మీర్ పండిట్లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో రూపొందింది ఈ సినిమా. ఈ సినిమా మార్చి 11న విడుదలై ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఇటీవల ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చింది హర్యానా ప్రభుత్వం. హర్యానా ప్రభుత్వపు అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 'ది కశ్మీర్ ఫైల్స్ అనే సినిమాకు హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తుంది' అని ట్వీట్ చేసింది. हरियाणा सरकार ने फिल्म #TheKashmirFiles को राज्य में टैक्स फ्री कर दिया है। #Haryana #DIPRHaryana pic.twitter.com/Zg8XWC8OoV — DPR Haryana (@DiprHaryana) March 11, 2022 बहुत आभार माननीय @mlkhattar जी। corona काल की आर्थिक समस्याओं के बाद सामान्य परिवारों को यह फ़िल्म देखने में आपका यह निर्णय काफ़ी मदद करेगा। साथ ही सिनेमा हॉल का व्यवसाय भी मज़बूती पकड़ेगा। 🙏🙏🙏 https://t.co/VNZNqcai9U — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 11, 2022 ఈ విషయంపై మూవీ డైరెక్టర్ వివేక్ అగ్ని హోత్రి స్పందించారు. తన సినిమాకు పన్ను మినహాయింపు చేసినందుకు హర్యానా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా చూసిన అనేక మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయి కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెటర్ సురేష్ రైనా తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక మహిళ వివేక్ పాదాలు తాకడం, సినిమా గురించి తన భావాన్ని వ్యక్తపరుస్తూ బిగ్గరగా ఏడవడం మనం చూడొచ్చు. అనంతరం డైరెక్టర్ వివేక్, నటుడు దర్శన్ కుమార్ ఆ మహిళను ఓదార్చారు. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి డైరెక్టర్, దర్శన్ కుమార్ సైతం కంటతడి పెట్టుకున్నారు. Presenting #TheKashmirFiles It’s your film now. If the film touches your heart, I’d request you to raise your voice for the #RightToJustice and heal the victims of Kashmir Genocide.@vivekagnihotri @AnupamPKher @AdityaRajKaul pic.twitter.com/Gnwg0wlPKU — Suresh Raina🇮🇳 (@ImRaina) March 11, 2022 -
52వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి
చండీగఢ్ : హర్యానా ప్రభుత్వం తొమ్మిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. అందులో 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి అశోక్ ఖేమ్కా ఒకరు. 2012లో కాంగ్రెస్ నాయకురాలు సోనియ గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు, డీఎల్ఎఫ్కు మధ్య కుదిరిన భూ ఒప్పందాన్ని ఆయన రద్దు చేశారు. దీంతో అప్పట్లో అశోక్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు పలువురు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులకు దిగిన కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. అంకిత భావంతో ఆయన చేసిన సర్వీస్‌కు ట్రాన్స్ఫర్లు బహుమానాలుగా నిలిచాయి. అయితే తాజాగా అశోక్ ఆరావళీ పర్వత శ్రేణుల్లో భూ ఏకీకరణ గురించి ఆయన మాట్లాడిన మాటలు ఓ జాతీయ పత్రికలో ప్రచురితమైన కొన్ని గంటల్లోనే ఈ బదిలీ జరిగింది. అయితే బదిలీ అనేది అశోక్‌కు పరిపాటిగా మారిందనే చెప్పవచ్చు.. తన 27 ఏళ్ల సర్వీస్‌లో ఆయన 50 సార్లకు పైగా బదిలీ అయ్యారు. నీతిగా, నిజాయితీగా పనిచేసే అధికారులపై ఇలాంటి బదిలీలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. 15 నెలలుగా హర్యానా క్రీడా, యువజన విభాగంలో సేవలు అందించిన అశోక్‌ను ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ దేశీ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయనతో పాటు బదిలీ అయినవారిలో సిద్ధినాథ్ రాయ్, రాజీవ్ అరోరా, అపూర్వ కుమార్ సింగ్, అమిత్ కుమార్ అగర్వాల్, వాజీర్ సింగ్ గోయత్, చందర్ శేఖర్ విజయ్‌కుమార్ సిద్దప్పలు ఉన్నారు. -
ఆటగాళ్ల ఫైర్ : పునరాలోచనలో హర్యానా ప్రభుత్వం
చండీగఢ్ : క్రీడాకారుల సంపాదనలో మూడోవంతును ప్రభుత్వానికి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ నోటీఫికేషన్ జారీచేయవద్దని సంబంధిత క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశించినట్లు సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మీడియాకు తెలిపారు. తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాము గర్వంగా ఫీలవుతున్నామని, వారి సమస్యలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో ఉన్న అథ్లెట్లు వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని ఏప్రిల్ 30 న హర్యానా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఈ నిర్ణయాన్ని ఒలింపిక్ పతాక విజేత సుశీల్ కుమార్, ఫోగట్ సిస్టర్స్ తప్పుబట్టారు. ఆటగాళ్లపై ప్రభుత్వం మరో భారాన్ని మోపడం సరికాదన్నారు. ఈ నోటీఫికేషన్ విడుదల చేసేముందు ప్రభుత్వం తమతో చర్చించాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నోటిఫికేషన్‌ను ఆ రాష్ట్ర బీజేపీ నేత జవహార్ యాదవ్ వెనకేసుకొచ్చారు. అథ్లెట్లు క్రీడల్లో గెలిచిన ప్రైజ్ మనీని ఇవ్వమనడం లేదని, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాణిజ్య ప్రకటనల ద్వారా ఆర్జిస్తున్నారో వారినే ఇవ్వమంటున్నామని తెలిపారు. -
అథ్లెట్లకు హర్యానా షాక్
చండీగఢ్: హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయంతో క్రీడాకారులు షాక్‌కు గురయ్యారు. రాష్ట్రంలోని క్రీడాకారులు సంపాదించిన మొత్తంలో మూడో వంతును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. వృత్తిపరమైన క్రీడలతో పాటు వాణిజ్యపరమైన ఆదాయంతో సహా లెక్కగట్టి.. మొత్తం సంపాదనలో మూడవ వంతు సొమ్మును క్రీడా మండలికి చెల్లించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న అథ్లెట్లు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, కమర్షియల్ ఎండార్స్‌మెంట్స్‌లలో పాల్గొనే సమయంలో సదరు నిబంధనలను అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో క్రీడాకారులకు అసాధారణ సెలవును (వేతనం ఇవ్వరు) ఇస్తారు. పోటీల ద్వారా సంపాదించిన మొత్తంలో మూడో వంతును హర్యానా రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి వినియోగిస్తాం అని ఏప్రిల్ 30 న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవుపై వెళ్లి ఈవెంట్ లేదా వాణిజ్య ప్రకటనల షూటింగ్లో పాల్గొంటే.. వాటి ద్వారా వచ్చే సంపాదన మొత్తాన్నీ క్రీడా మండలి దగ్గర డిపాజిట్ చేయాల్సిందేనని కొత్త నిబంధన కూడా విధించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. హర్యానా క్రీడాకారులు రెజ్లింగ్, బాక్సింగ్‌లలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
వామ్మో : డేరా సచ్చ సౌదా ఆస్తులు అన్ని కోట్లా?
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు చెందిన డేరా సచ్చ సౌదా గురించి సంచలన విషయాన్ని హర్యానా ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. ఆయన కేవలం డేరా బాబా మాత్రమే కాదని, కోట్ల ఆస్తులను గుర్మీత్ కలిగిఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. నేడు పంజాబ్, హర్యానా హైకోర్టుకు కట్టర్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో, డేరా సచ్చ సౌదా ఆస్తుల విలువ రూ.1,453 కోట్లుగా తెలిపింది. ఇవి కేవలం డేరా ప్రధాన కార్యాలయం సిర్సాలోనివేనని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్మీత్ రామ్ రహీమ్ ఆర్గనైజేషన్‌కు సుమారు రూ.1600 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్టు కూడా వెల్లడించింది. హర్యానా వెలుపల డేరా కలిగి ఉన్న ఆస్తుల వివరాలను ప్రభుత్వం లెక్కకట్టలేదు. ప్రభుత్వం అంచనావేసిన దానికంటే అధికంగానే గుర్మీత్ డేరాకు ఆస్తులున్నట్టు కూడా వెల్లడవుతోంది. సాధ్వీలపై అత్యాచార కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు విధించిన సమయంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున్న అల్లర్లు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో వచ్చిన నష్ట్రాన్ని పూరించడానికి డేడేరా సచ్చ సౌదా ఆస్తుల వివరాలను లెక్క కట్టాలని పంజాబ్, హర్యానా హైకోర్టులు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం వెల్లడించిన రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -
తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
-
తప్పంతా హర్యానా ప్రభుత్వానిదే: పంజాబ్ సీఎం
ఛండీగఢ్; డేరా అనుచరుల హింసను ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్రంలో ఉపేక్షించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు వెల్లడించినట్లు సమాచారం. ఇక భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంజాబ్‌లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. లాఠీఛార్జీ, కాల్పులు లాంటివి చోటు చేసుకోలేదు. ఎవరూ చనిపోలేదు కూడా. అని అమరీందర్ తెలిపారు. పంజాబ్‌లో హింసకు తావు ఇవ్వబోమని ఆయన ప్రకటించారు. తీర్పు నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేయకుండా పంచకులలోకి గుర్మీత్ అనుచరులను అనుమతించటం హర్యానా ప్రభుత్వం చేసిన తప్పుగా ఆయన పేర్కొన్నారు. కర్ఫ్యూను నిన్న రాత్రికే పాక్షికంగా సడలించామని తెలిపిన ఆయన ఈరోజు మరోసారి సమీక్షించిన అనంతరం పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు. డేరా ప్రధానకార్యాలయంలోకి వెళ్లం: ఆర్మీ డేరా సచ్ఛా సౌదా ఆశ్రమం ప్రధాన కార్యాలయంలోకి సైన్యం ప్రవేశించబోతుందన్న వార్తలపై ఆర్మీ వర్గాలు స్పందించాయి. అలా ప్రయత్నమేం చేయబోవట్లేదని హిసర్ 33వ విభాగం జీవోసీ అధికారి రాజ్‌పాల్ పునియా స్ఫష్టం చేశారు. హర్యానాలోని సిస్రా లో సుమారు 700 ఎకరాల్లో డేరా ప్రధాన కార్యాలయం విస్తరించి ఉంది. కురుక్షేత్ర, మన్సా డేరా ఆశ్రమంలో సుమారు 12 మందికి పైగా డేరా అనుచరులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
గో రక్షణకు హర్యానా సీఎం ముందడుగు
చండీగఢ్: బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. యూపీ సీఎం యోగి కబేళాలు మూయించడం, గోవధను నిషేధించడంతో మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానా ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. ఆవులను రక్షించకుండా బయట వదిలేస్తే ఆ మూగజీవుల యజమానులు జరిమానా కట్టాల్సి ఉంటుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిని ఇవ్వని ఆవుల విషయంలోనూ తాను కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. సోమవారం అన్ని జిల్లాల ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం ఖట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆవులను గోశాలలు, పాకలలో కట్టివేయకుండా వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా నడుచుకునే వాటి యజమానులు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆవులను గోశాలలో ఉంచి వాటి ద్వారా ఎన్నో ఉత్పత్తి చేయవచ్చునని, ఉత్పత్పి ఆగిపోయినా తదితర మార్గాలు ఆన్వేషించాలని అధికారులకు సూచించారు. సహకార సంఘాల సహకారంతో గో ఉత్పత్తులు విక్రయించాలని చెప్పారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఆవుల రక్షణకు పటిష్ట రక్షణకు చర్యలు చేపట్టాలని హర్యానా సీఎం ఆదేశించారు. -
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
-
సాక్షి మాలిక్ సంచలన ఆరోపణలు
చండీగఢ్: ఒలింపిక్ పతక విజేత, రెజ్లర్ సాక్షి మాలిక్ హరియాణా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తరువాత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు అమలు కాలేదని ఆమె ట్వీట్ చేశారు. ప్రకటనలు మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయని ఆమె ఆరోపించారు. సాక్షి మాలిక్ ట్వీట్‌పై హరియాణా మంత్రి అనిల్ విజ్ వెంటనే స్పందించారు. ప్రభుత్వం నుంచి ఆమె రూ. 2.5 కోట్ల చెక్ తీసుకున్నారని అనిల్ విజ్ వెల్లడించారు. సాక్షి మాలిక్ కోరిక మేరకు ఎండీ యూనివర్సిటీలో ఒక పోస్ట్‌ను కూడా క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై మాట్లాడిన సాక్షి మాలిక్ తండ్రి సుదేశ్ మాలిక్.. ప్రభుత్వం 2.5 కోట్ల చెక్ ఇచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన మిగతా హామీల సంగతేంటని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. -
‘దంగల్’ కు పన్ను మినహాయింపు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్న చిత్రం ‘దంగల్’ . విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి యూపీలో వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ట్యాక్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినియా ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి మరింత శక్తిని ఇచ్చిందని, అందుకే వినోదపు పన్నును మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హర్యనా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. కాగా హర్యానాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా దంగల్ తెరకెక్కింది. ఈ చిత్రంలో సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, అపర్శక్తి ఖుర్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. -
అసలు చెక్ ఇంకా అందనే లేదు
సాక్షి మలిక్ కోచ్ పరిస్థితి కోల్‌కతా: రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్‌కు అభినందనలతో పాటు కనకవర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మలిక్ పరిస్థితి మాత్రం కాస్త విచిత్రంగా మారింది. సాక్షికి నజరానా అందించినట్టే హరియాణా ప్రభుత్వం కుల్దీప్కు కూడా రూ.10 లక్షలను ప్రకటించింది. రియో నుంచి రాగానే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభలోనే ఆయనకు ఫొటోకాపీ చెక్‌ను ప్రభుత్వం అందించింది. అయితే ఇది జరిగి నెల రోజులకు పైగానే గడిచినా ఇప్పటికీ అసలు చెక్ మాత్రం ఆయనకు అందలేదు. అంతేకాకుండా రైల్వే శాఖలో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తనకు ప్రమోషన్ కల్పిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హామీ ఇచ్చారు. అది కూడా నోటిమాటగానే మిగిలిపోయింది. ఈ విషయంపై నెల రోజులుగా హరియాణా ప్రభుత్వం, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు చుట్టూ కుల్దీప్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు. -
అశోక్ ఖేమ్కాపై మరో చార్జిషీట్
చండీగఢ్: ఖజానాకు నష్టం చేకూర్చారన్న అభియోగంతో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేసింది. 2012-13 మధ్య రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఎండీగా ఉన్న ఖేమ్కా.. గోధుమ గింజలను పూర్తిగా అమ్మకపోవడంతో రూ. 3.41 కోట్ల నష్టం వచ్చిందంటూ ఈ నెల 1న చార్జిషీట్ నమోదు చేసిన ప్రభుత్వం 8న ఆయనకు పంపింది. ఖేమ్కా నిర్లక్ష్యంతో 87 వేల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు వృధాగా పోయాయని ఆరోపణలు వచ్చాయి. యూపీఏ ప్రభుత్వ హయాం(2012 అక్టోబర్)లో కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ల మధ్య జరిగిన భూఒప్పందాన్ని ఖేమ్కా రద్దు చేశారు. పరిధులు దాటి ప్రవర్తించారంటూ ఆయన్ను బదిలీ చేశారు. -
'గోమాతా కీ జై’ అంటే డబ్బులే డబ్బులు
చండీగఢ్: ‘గో రక్షితే రక్షితహ:’ నినాదం కాస్త హర్యానాలో ‘గో దక్షితే భక్షితహ:’గా మారిపోయింది. హర్యానాలో భారతీయ జనతా పార్టీ పాలకపక్షం తీసుకొచ్చిన గోవధ నిషేధ చట్టం ఆ పార్టీ గూండాలకు కల్పతరువుగా మారింది. రాష్ట్రంలోని బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, రోడ్డు పక్కల డాబాలలో, దుకాణాల్లో ‘గో రక్షణ నిధి’ పేరిట వేలాది విరాళాల డబ్బాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క డాబాలలో ఆరేడు డబ్బాలు కూడా కనిపిస్తున్నాయి. వీటిల్లో దాతలు వేసిన విరాళాలు నెలకు లక్షల్లోని ఉంటున్నాయని డాబాల యజమానులు తెలియజేస్తున్నారు. ఈ విరాళాల సొమ్ములో నయాపైసా కూడా గో సంరక్షణ శాలలకు వెళ్లడం లేదని, గో సంరక్షణ శాలల నిర్వాహకులే తెలియజేస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పి కొంత మంది గూండాలు ఇలాంటి దందాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలోని బేజీపీ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి బడుగు రైతుల బక్కచిక్కిన ఆవులు అమ్ముడు పోవడం లేదు. నేటి కరువు పరిస్థితుల్లో వాటిని పోషించలేక గో సంరక్షణ శాలలకు వాటిని తరలిస్తున్నారు. అక్కడి నిర్వాహకులకు కూడా గోవుల సంరక్షణ భారం కావడంతో రైతుల ఆవులు స్వీకరించేందుకు వారూ నిరాకరిస్తున్నారు. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి గో సంరక్షణ శాలలను నిర్వహించడం తమకు తలకుమించిన భారం అవుతోందని మహేంద్ర గఢ్ జిల్లా, కనీనాలోని శ్రీకష్ణ గోశాల మేనేజర్ యద్విందర్ సింగ్ మీడియాకు తెలిపారు. గూండాలు, దందాకోరుల పోటీ వల్ల తమకు విరాళాలు కూడా బాగా తగ్గిపోయాయని ఆయన చెప్పారు. మొదట్లో బస్టాండ్లలో, దాబాలలో ఒక్కొక్క విరాళాల డబ్బాలనే ఏర్పాటు చేశామని, ఇప్పుడు తమకు పోటీగా అనేక డబ్బాలు పుట్టుకొచ్చాయని ఆయన తెలిపారు. తమ విరాళాల డబ్బాలను మాత్రం మేనేజింగ్ కమిటీకి చెందిన కనీసం ముగ్గురు సభ్యుల ముందు తెరచి సొమ్మును లెక్కిస్తామని, తాము ఖర్చుపెట్టే ప్రతిపైసాకు లెక్క ఉంటుందని సింగ్ చెప్పారు. గోవధ నిషేధ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి వద్దన్నా వినకుండా రైతులు బలవంతంగా తమ ఆవులను తీసుకొచ్చి వదిలేసి పోతున్నారని, తమపై భారం బాగా పెరిగిందని ఆయన అన్నారు. రోడ్డు పక్క డాబాలలో తాము ఏర్పాటు చేసిన విరాళాల డబ్బాలను కూడా కొంత మంది గో సంరక్షణ శాల సభ్యులమంటూ ఎత్తుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు, ఎక్కువగా అధికార బీజేపీకి చెందిన వారే వచ్చి తన డాబాలో విరాళాల డబ్బాలు పెట్టి పోతున్నారని, ఇన్ని డబ్బాలు ఎందుకంటే బెదిరిస్తారని ఢిల్లీ–చండీగఢ్ జాతీయ రహదారిలో ఉన్న ‘రాయల్ ముర్తాల్ దాబా’ యజమాని నరేంద్ర భరద్వాజ్ తెలిపారు. ఆయన కౌంటర్ మీద మూడు విరాళాల డబ్బాలు ఉన్నాయి. గతంలో ఏడు డబ్బాలు ఉండేవని, ఆ డబ్బాల విషయంలో వారి మధ్య గొడవలు కూడా జరిగేవని, భౌతికంగా కొట్టుకునేవారని ఆయన చెప్పారు. చివరకు వారే ఒక ఒప్పందానికి వచ్చి నాలుగు డబ్బాలు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. పైగా డబ్బాలు ఖాళీ చేసేటప్పుడు కౌంటర్ నుంచి కొంత విరాళం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తారని, యాభై రూపాయలు ఇస్తే వంద ఇమ్మని, ఐదు వందలు ఇస్తే వెయ్యి రూపాయలు ఇమ్మని దబాయించి తీసుకెళతారని ఆయన ఆరోపించారు. గతంలో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామంటూ బలవంతంగా చందాలు వసూలు చేసిన వారే ఇప్పుడు గో సంరక్షణ పేరుతో వసూళ్లకు దిగారని జాజ్జర్ జిల్లా ఢిగాల్ గ్రామం మాజీ సర్పంచ్ భాగ్వీర్ అహ్లావత్ తెలిపారు. తలకు కాషాయ రిబ్బన్లు కట్టుకొని వచ్చి దబాయించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. పలు పట్టణాల్లో ఇప్పుడు ఇలాంటి సిండికేట్లు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. కొంత మంది ఇంటింటికి వచ్చి కూడా గో సంరక్షణ పేరతో చందాలిమ్మని బెదిరిస్తున్నారని స్థానిక ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. -
జాట్ల జ్వాలలతో దిగొచ్చిన సర్కార్
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం జాట్లను ఓబీసీల్లో చేర్చడంపై అధ్యయనం కేంద్రానికి, బీజేపీ చీఫ్‌కు నివేదిక అందజేయనున్న కమిటీ హరియాణా అసెంబ్లీలో వచ్చే సమావేశాల్లో బిల్లు! కేంద్రం ప్రకటనతో హరియాణాలో నిరసనలు తగ్గుముఖం రోడ్ల దిగ్బంధం నుంచి వెనక్కు తగ్గుతున్న ఆందోళనకారులు 8 రోజుల పాటు ఉధృతంగా సాగిన ఉద్యమం హింసాత్మక ఘటనల్లో మొత్తం 12 మంది మృతి, 150 మందికి గాయాలు న్యూఢిల్లీ/చండీగఢ్: ఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో.. వారి రిజర్వేషన్ల డిమాండ్‌పై కేంద్రప్రభుత్వం స్పందించింది. సీనియర్ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కోరుతున్న జాట్ల డిమాండ్‌ను పరిశీలించి, ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ‘ఈ సమస్యకు పరిష్కారాలను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా నివేదికను అందించాలని కమిటీని కోరాం’ అని రాజ్‌నాథ్ వెల్లడించారు. సంయమనం పాటించాలని హరియాణా ప్రజలకు రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు, మంత్రివర్గ సహచరులు సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్‌లతో రాజ్‌నాథ్ భేటీ అయి, హరియాణాలో పరిస్థితిని సమీక్షించారు. ఈ భేటీకి ముందు జాట్ వర్గ ప్రతినిధులు రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. హరియాణాలో జాట్ వర్గీయులను ఓబీసీల్లో చేర్చడానికి ఉద్దేశించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెడ్తామని రాజ్‌నాథ్ వారికి హామీ ఇచ్చారు. వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్రమంత్రులు మహేశ్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ ఉపాధ్యక్షులు సత్పాల్ మాలిక్, అవినాశ్ రాయ్ ఖన్నా సభ్యులుగా ఉంటారని బీజేపీ ఒక ప్రకటనలో తెలిపింది. కమిటీ ఈ నివేదికను ప్రభుత్వానికి, అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు అందజేస్తుందని వెల్లడించింది. కాగా, ఓబీసీల్లో చేర్చాలంటూ హరియాణాలో జాట్ వర్గీయులు చేపట్టిన ఆందోళనల్లో విధ్వంసం, హింసాత్మక ఘటనలు, దహనకాండలు ఆదివారం కూడా కొనసాగాయి. అయితే, రాజ్‌నాథ్ ప్రకటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. సహరణ్‌పూర్- అంబాలా, పవంత సాహిబ్- యమునానగర్, అంబాలా- ఖైతాల్, సహరణ్‌పూర్-పిప్లీ- కురుక్షేత్ర, జిరాక్పూర్- పర్వానూ, లాద్వా- షాబాద్ తదితర రోడ్డు మార్గాలు సహా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించిన నిరసనకారులు క్రమంగా వెనక్కు తగ్గుతున్నారు.ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని భావిస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్ డిమాండ్‌తో గత ఎనిమిది రోజులుగా ఉధృతంగా సాగిన జాట్ల ఆందోళనల్లో ఆదివారం వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారని, 150 మంది వరకు గాయపడ్డారని డీజీపీ యశ్పాల్ సింఘాల్ తెలిపారు. ఉద్రిక్తత కొనసాగుతుండటంతో రాష్ట్రంలోని 8 పట్టణాల్లో కర్ఫ్యూని పొడిగించారు. ఆదివారం ఉదయం ఖైతాల్లోనూ కర్ఫ్యూ విధించి, సాధారణ పరిస్థితులు నెలకొనడంతో సాయంత్రానికి తొలగించారు. ఆందోళనలకు కేంద్రంగా నిలిచిన రోహ్తక్లో ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ నేడు పర్యటించనున్నారు. తాజాగా, ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో సోనిపెట్ జిల్లాలో ఒక వ్యక్తి చనిపోగా, హిస్సార్ జిల్లాలో జాట్-జాటేతరుల మధ్య ఘర్షణల్లో మరొక వ్యక్తి చనిపోయాడని హరియాణా హోంశాఖ కార్యదర్శి పీకే దాస్ తెలిపారు. పానిపట్ జిల్లాలోని గునార్ రైల్వే స్టేషన్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు. ఖైతాల్‌లో జాటేతర వర్గీయులు చేసిన ధర్నా సందర్భంగా విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఆదివారం నాటి విధ్వంసంలో.. భివానీ, సోనిపేట్ జిల్లాల్లో రెండు పోలీస్ స్టేషన్లను, కొన్ని షాపులను, ఏటీఎం కేంద్రాలను జాట్ ఆందోళనకారులు తగలబెట్టారు. రహదారులపై ఉన్న హోటళ్లను ధ్వంసం చేశారు. ఢిల్లీ టు చండీగఢ్.. రూ. 55 వేలు! జాట్ల ఆందోళనలు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. పలు చోట్ల కొంత విధ్వంసం కూడా చోటు చేసుకుంది. హరియాణాలో ఉద్రిక్తత నేపథ్యంలో 736 రైళ్లను రద్దు చేశారు. 105 రైళ్లను వేరే మార్గం మీదుగా మళ్లించారు. ఢిల్లీ-అంబాలా, ఢిల్లీ-రోహ్తక్ మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జాట్ల విధ్వంసంలో రూ. 200 కోట్ల మేర ఆస్తులకు నష్టం కలిగిందని రైల్వే శాఖ ప్రకటించింది. హరియాణా మీదుగా వెళ్లే బస్సులను సైతం రద్దు చేశారు. లాహోర్- ఢిల్లీ బస్సు సర్వీసును పాక్ ప్రభుత్వం నిలిపేసింది. జాట్ల ఆందోళనల నేపథ్యంలో భారత్ విజ్ఞప్తి మేరకు పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. రైలు, రోడ్డు రవాణా నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాలకు విమాన సర్వీసులకు డిమాండ్ పెరిగింది. దాంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా ఢిల్లీ-చంఢీగఢ్, ఢిల్లీ- అమృతసర్, ఢిల్లీ- జైపూర్‌ల మధ్య రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీ-చండీగఢ్‌ల మధ్య గరిష్టంగా రూ. 8 వేలు ఉండే టికెట్ ధరను జెట్ ఎయిర్వేస్ సాధారణ తరగతికి రూ. 46 వేలు, బిజినెస్ క్లాస్‌కు రూ. 55 వేలకు పెంచి, సొమ్ము చేసుకుంది. హరియాణా ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యంగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి వస్తున్న ప్రయాణీకులు జమ్మూ, శ్రీనగర్‌లలో చిక్కుకుపోయారు. ఢిల్లీలో జల సంక్షోభం జాట్ల ఆందోళన ఢిల్లీకి మునుపెన్నడూ ఎరగని నీళ్ల కష్టం తీసుకువచ్చింది. హరియాణా నుంచి దేశ రాజధానికి వచ్చే నీటి సరఫరా నిలిచిపోవచడంతో.. నగరంలో నీటి సంక్షోభం నెలకొంది. దాంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమీక్ష జరిపి, నీటి సరఫరాపై ఆంక్షలు విధించారు. నీళ్లను పొదుపుగా వాడుకోవాలని పౌరులకు సూచించారు. అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించాలని ఆదేశించారు. జాట్ల నిర్భంధంలో ఉన్న హరియాణాలోని మునాక్ కాలువ నుంచి ఢిల్లీకి నీళ్ల సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. హరియాణా నుంచి వచ్చే కూరగాయలు, పాలు తదితర నిత్యావసరాల సరఫరా నిలిచిపోవడంతో, ఢిల్లీలో వాటికి కూడా కొరత ఏర్పడింది. -
'రాహుల్ బావను వదిలేది లేదు'
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలను వదిలేది లేదని, వాటిపై విచారణ జరిపి తీరుతామని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. ''రాహుల్ గాంధీ గారి సూటు-బూటు బావను వదలబోము.. ఆయనపై దర్యాప్తు తప్పదు'' అని ఆ రాష్ట్ర మంత్రి అనిల్ విజ్ చెప్పారు. ఆయన చేసిన తప్పులకు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని ఆయన అన్నారు. గతంలో హర్యానాలో అధికారంలో ఉన్న భూపీందర్ సింగ్ హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాబర్ట్ వాద్రాకు అనుచిత లబ్ధి చేకూర్చిందని కాగ్ తప్పుబట్టింది. రియాల్టీ దిగ్గజం డీఎల్ఎఫ్తో కలిసి వాద్రా కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు చెప్పింది. గుర్గావ్ జిల్లాలోని అత్యంత ఖరీదైన మనేసర్ ప్రాంతంలో 3.5 ఎకరాల భూమిని హూడా సర్కారు నుంచి అత్యంత చవగ్గా.. కేవలం 15 కోట్లకే వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ పొందింది. తర్వాత దాన్ని రూ. 58 కోట్లకు డీఎల్ఎఫ్కు అమ్మింది. -
‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభం
గుర్గావ్: నగరంలో ఆదివారం ఉదయం ‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభమైంది. తన మానస పుత్రిక అయిన ఈ కార్యక్రమా న్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. అయినప్పటికీ హర్యానా ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు సాగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. స్వతంత్ర సేనాని జిల్లా పరిషత్ భవన్ ప్రాంగణంలో ప్రారంభించిన ఈ యాత్రలో స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా శనివారం హర్యానాలోని అనేక ప్రాంతాల్లో కే ంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించిన సంగతి విదితమే. పధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని పానిపట్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ మాట్లాడుతూ ‘ సెక్స్ నిష్పత్తిలో అసమతుల్యతతోపాటు మహిళ ల్లో అనేకమంది విద్యకు దూరమవుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలత చెందారు. ఈ నేపథ్యంలో దీనిపై దేశవాసులకు అవగాహన కల్పించాల నే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యతోపాటు మహిళలకు సాధికారిత కల్పించడంద్వారా సెక్స్ నిష్పత్తిని పెంచవచ్చు. సమాజంలో మార్పు కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సమాజంలో మార్పు రానంతకాలం ఇందుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా అది విజయవంతం కాదు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ విషయంలో సామాజిక చైతన్యం రావాలంటే అందుకు ప్రజాఉద్యమం అవసరం. పానిపట్‌లో ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్దసంఖ్యలో పాల్గొనాలి’ అని కోరారు. -
33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారుల బదిలీ
హర్యానా: రాష్ట్రంలో 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తు హర్యానా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులంతా హర్యానా సివిల్ సర్వీసెస్ (హెచ్‌సీఎస్) అధికారులే. ఇటీవల హర్యానా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు మనోహర్ లాల్ కట్టర్ సీఎంగా అక్టోబర్ 26న పదవి బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ఇటీవల వరకు దాదాపు 100 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా శనివారం 128 మంది ఉన్నతాధికారులను బదిలీ చేసే ఫైల్‌పై సీఎం మనోహర్ లాల్ సంతకం చేశారు. దీంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన 33 రోజుల్లో 228 మంది ఉన్నతాధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
హర్యానా సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిక్కుల నిరసన ప్రదర్శన
న్యూఢిల్లీ: హర్యానాలోని గురుద్వారాల నిర్వహణ కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ సిక్కు కమిటీ నియామక చట్టం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట సిక్కులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించా రు. అక్కడ ఏర్పాటుచేసిన బారికేడ్లను దాటుకుని ముందుకుసాగిన సిక్కులు... కాంగ్రెస్ పార్టీకి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు వారిపై నీటి ఫిరంగులను ప్రయోగించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 400 మంది సిక్కులు పాల్గొన్నారని, అందులో కొందరిని అరెస్టు చేశామని డీసీపీ త్యాగి తెలిపారు. కాగా హర్యానాలోని గురుద్వారా నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించేం దుకు ఉద్దేశించిన బిల్లును అక్కడి శాసనసభ ఇటీవల ఆమోదించిన సంగతి విదితమే.