అసలు చెక్ ఇంకా అందనే లేదు | Sakshi Malik's Coach Yet to Get Cash Award | Sakshi
Sakshi News home page

అసలు చెక్ ఇంకా అందనే లేదు

Published Mon, Sep 26 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

అసలు చెక్ ఇంకా అందనే లేదు

అసలు చెక్ ఇంకా అందనే లేదు

సాక్షి మలిక్ కోచ్ పరిస్థితి  
 కోల్‌కతా: రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన రెజ్లర్ సాక్షి మలిక్‌కు అభినందనలతో పాటు కనకవర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మలిక్ పరిస్థితి మాత్రం కాస్త విచిత్రంగా మారింది. సాక్షికి నజరానా అందించినట్టే హరియాణా ప్రభుత్వం కుల్దీప్‌కు కూడా రూ.10 లక్షలను ప్రకటించింది. రియో నుంచి రాగానే  సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభలోనే ఆయనకు ఫొటోకాపీ చెక్‌ను ప్రభుత్వం అందించింది.
 
  అయితే ఇది జరిగి నెల రోజులకు పైగానే గడిచినా ఇప్పటికీ అసలు చెక్ మాత్రం ఆయనకు అందలేదు. అంతేకాకుండా రైల్వే శాఖలో చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తనకు ప్రమోషన్ కల్పిస్తామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హామీ ఇచ్చారు. అది కూడా నోటిమాటగానే మిగిలిపోయింది. ఈ విషయంపై నెల రోజులుగా హరియాణా ప్రభుత్వం, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు చుట్టూ కుల్దీప్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement