‘దంగల్‌’ కు పన్ను మినహాయింపు | dangal-made-tax-free-in-haryana | Sakshi
Sakshi News home page

‘దంగల్‌’ కు పన్ను మినహాయింపు

Published Mon, Dec 26 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM

‘దంగల్‌’ కు పన్ను మినహాయింపు

‘దంగల్‌’ కు పన్ను మినహాయింపు

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి తన విలక్షణతను ప్రూవ్ చేసుకున్న చిత్రం ‘దంగల్‌’ . విమర్శకులు సైతం పొగడ్తలతో ముంచెత్తడంతో దంగల్‌ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ చిత్రానికి యూపీలో వినోదపు పన్నును మినహాయించిన సంగతి తెలిసిందే. తాజాగా హర్యానా ప్రభుత్వం కూడా ఈ చిత్రానికి ట్యాక్స్‌ రద్దు చేస‍్తున్నట్టు ప్రకటించింది. ఈ సినియా ‘బేటీ బచావో- బేటీ పడావో’  కార్యక్రమానికి మరింత శక్తిని ఇచ్చిందని, అందుకే వినోదపు పన్నును మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు హర్యనా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖత్తర్‌ అన్నారు.
 
కాగా హర్యానాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన కుస్తీ వీరుడు మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా దంగల్‌ తెరకెక్కింది. ఈ చిత్రంలో సాక్షి తన్వార్‌, ఫాతిమా సనా షేక్‌, సన్యా మల్హోత్రా, అపర్‌శక్తి ఖుర్రాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement