‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభం | Himachal readies for PM's 'Beti Bachao Beti Padhao' campaign | Sakshi
Sakshi News home page

‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభం

Published Sun, Jan 18 2015 11:27 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

Himachal readies for PM's 'Beti Bachao Beti Padhao' campaign

గుర్గావ్: నగరంలో ఆదివారం ఉదయం ‘బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన యాత్ర ప్రారంభమైంది. తన మానస పుత్రిక అయిన ఈ కార్యక్రమా న్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. అయినప్పటికీ హర్యానా ప్రభుత్వం చొరవ తీసుకుని ముందుకు సాగింది. ఈ కార్యక్రమాన్ని హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. స్వతంత్ర సేనాని జిల్లా పరిషత్ భవన్ ప్రాంగణంలో ప్రారంభించిన ఈ యాత్రలో స్థానిక మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా శనివారం హర్యానాలోని అనేక ప్రాంతాల్లో కే ంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించిన సంగతి విదితమే.
 
 పధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన ఈ కార్యక్రమాన్ని పానిపట్‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా  హర్యానా రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి నర్బీర్‌సింగ్ మాట్లాడుతూ ‘ సెక్స్ నిష్పత్తిలో అసమతుల్యతతోపాటు మహిళ ల్లో అనేకమంది విద్యకు దూరమవుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలత చెందారు. ఈ నేపథ్యంలో దీనిపై దేశవాసులకు అవగాహన కల్పించాల నే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యతోపాటు మహిళలకు సాధికారిత కల్పించడంద్వారా సెక్స్ నిష్పత్తిని పెంచవచ్చు.
 
 సమాజంలో మార్పు కోసం ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. సమాజంలో మార్పు రానంతకాలం ఇందుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా అది విజయవంతం కాదు. ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోలేదు. ఈ విషయంలో సామాజిక చైతన్యం రావాలంటే అందుకు ప్రజాఉద్యమం అవసరం. పానిపట్‌లో ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్దసంఖ్యలో పాల్గొనాలి’ అని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement