అశోక్ ఖేమ్కాపై మరో చార్జిషీట్
చండీగఢ్: ఖజానాకు నష్టం చేకూర్చారన్న అభియోగంతో ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై బీజేపీ పాలిత హరియాణా ప్రభుత్వం చార్జిషీట్ దాఖలు చేసింది. 2012-13 మధ్య రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు ఎండీగా ఉన్న ఖేమ్కా.. గోధుమ గింజలను పూర్తిగా అమ్మకపోవడంతో రూ. 3.41 కోట్ల నష్టం వచ్చిందంటూ ఈ నెల 1న చార్జిషీట్ నమోదు చేసిన ప్రభుత్వం 8న ఆయనకు పంపింది. ఖేమ్కా నిర్లక్ష్యంతో 87 వేల క్వింటాళ్ల గోధుమ విత్తనాలు వృధాగా పోయాయని ఆరోపణలు వచ్చాయి.
యూపీఏ ప్రభుత్వ హయాం(2012 అక్టోబర్)లో కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి, రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ల మధ్య జరిగిన భూఒప్పందాన్ని ఖేమ్కా రద్దు చేశారు. పరిధులు దాటి ప్రవర్తించారంటూ ఆయన్ను బదిలీ చేశారు.