సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పదేళ్లలో మీరు ఏం చేశారని.. మాపై ఛార్జ్‌షీట్ అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి చేయని పథకం లేదంటూ దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాకుంటే చరిత్ర హీనునిగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు.
హరీష్, కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసమని సీఎం రేవంత్ రెడ్డికి సూచించా.. ఇక నేను కూడా మాట్లాడను. తెలంగాణ విగ్రహావిష్కరణ కు రానివారంతా తెలంగాణ ద్రోహులే.. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశాం’’ అని కోమటిరెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment