నాగాలాండ్‌ సీఎం రాజీనామా | Nagaland CM TR Zeliang steps down | Sakshi
Sakshi News home page

నాగాలాండ్‌ సీఎం రాజీనామా

Published Mon, Feb 20 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

నాగాలాండ్‌ సీఎం రాజీనామా

నాగాలాండ్‌ సీఎం రాజీనామా

కోహిమా: నాట కీయ పరిణామాల మధ్య నాగాలాండ్‌ సీఎం టీఆర్‌ ఝెలియాంగ్‌ ఆదివారం రాజీ నామా చేశారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్  కల్పించాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. శాంతిభద్రతల పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో తప్పనిసరి పరిస్థిత్లులో ఝెలియాంగ్‌ రాజీనామా చేశారు. దీన్ని గవర్నర్‌ పీబీ ఆచార్య ఆమోదించారు.

సోమవారం ఉదయం 11 గంటలకు డెమొక్రటిక్‌ అలయెన్స్  ఆఫ్‌ నాగాలాండ్‌ (డీఏఎన్ ) సమావేశమై కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనుంది. మాజీ సీఎం, రాష్ట్ర ఏకైక ఎంపీ నేఫియూ రియో తదుపరి సీఎంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. 60 మంది ఎమ్మెల్యేలున్న నాగా అసెంబ్లీలో రియోకు 49 మంది ఎమ్మెల్యేల బలముంది. కాగా, రెండ్రోజుల క్రితమే ఝెలియాంగ్‌ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement