పార్లమెంటుకు మాజీ ప్రధాని రాజీనామా | Former UK Prime Minister David Cameron resigns from Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంటుకు మాజీ ప్రధాని రాజీనామా

Published Tue, Sep 13 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

పార్లమెంటుకు మాజీ ప్రధాని రాజీనామా

పార్లమెంటుకు మాజీ ప్రధాని రాజీనామా

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ పార్లమెంటులో సభ్యత్వానికి రాజీనామా చేశారు.

లండన్: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ సోమవారం పార్లమెంటులో సభ్యత్వానికి రాజీనామా చేశారు. బ్రిటన్ ను యూరోపియన్ యూనియన్ లోనే ఉంచాలంటూ ప్రచారం చేసిన కామెరూన్.. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని ప్రజల నుంచి తీర్పు రావడంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత సమకాలీన రాజకీయాల్లో కొనసాగడం చాలా కష్టంగా ఉందని, అందుకే తాను పార్లమెంటుకు కూడా రాజీనామా చేస్తున్నట్లు కామెరూన్ తెలిపారు.

తన వారసురాలిగా ప్రధానమంత్రి పదవిని అందుకున్న థెరిస్సా మేపై అందరికీ నమ్మకం ఉందని ఆయన అన్నారు. మే నాయకత్వంలో బ్రిటన్ ముందుకుసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత బ్రిటన్ మాజీ ప్రధానులు పార్లమెంటులో చాలాకాలం సభ్యత్వాన్ని కలిగివున్నారు. కామెరూన్ గత ఆరేళ్లుగా పాస్ చేయని బిల్లును థెరిస్సా మే పాస్ చేయడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఈ వార్తలను కామెరూన్ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement