ఏపీ: బీజేపీ మంత్రుల రాజీనామా | Bjp Ministers Resigned From Ap Cabinet | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 8 2018 10:18 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Bjp Ministers Resigned From Ap Cabinet - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్‌ నుంచి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు వైదొలిగారు. రాజీనామా లేఖలను గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్‌లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు.

బీజేపీ మంత్రులు అధికార వాహనాలను, ఐడీ కార్డులను వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో  కేంద్ర కేబినెట్‌ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్‌ నుంచి బయటకు వచ్చేందుకు అధిష్టానం ఆదేశాలతో బీజేపీ మంత్రులు సంసిద్ధమయ్యారు. అనుకున్న విధంగా శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందే సభలోనే మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలను అందచేశారు.




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement