Kamineni Srinivasarao
-
వర్ల ఎందుకు భుజాలపై ఎత్తుకున్నారు?
సాక్షి, అమరావతి : రాజకీయ నాయకులతో రహస్య భేటీలు జరిపే ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సన్నిహితులుగా ముద్రపడ్డ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విటర్ వేదికగా ఈ భేటీపై స్పందించిన సజ్జల.. నిమ్మగడ్డ, టీడీపీ బంధంపై పలు విమర్శలు చేశారు. (చదవండి : హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!) స్టార్ హోట్ల్లో రహస్య భేటీలో పాల్గొన్న ముగ్గురు చెప్తున సమాధానాలు.. తాడిచెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ గడ్డికోసం అన్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆరో ఫ్లోర్ వరకూ లిఫ్ట్‌లో వెళ్లి అక్కడనుంచి 8వ ఫ్లోర్‌కు లిఫ్ట్ వరకూ నడుచుకుని వెళ్లి వారితో ఎందుకు భేటీ అయ్యారని ప్రశ్నించారు. సుజనా, కామినేనిలు బీజేపీ మనుషులని టీడీపీ చెప్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికే ఈ సమావేశం పెట్టుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య తన భుజాల మీదకు ఎందుకు ఎత్తుకున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ‘ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా వ్యవహరించగలరు?. బీజేపీ ముసుగు వేసుకున్న టీడీపీ నాయకులతో భేటీ కుమ్మక్కు కాదా?. స్థానిక ఎన్నికల్లో నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించలేదా?. స్టార్ హోటల్లో జరిగిన రహస్య భేటీని కోర్టుల దృష్టికి తీసుకెళ్లాల్సిన అసరం లేదంటారా’ అని సజ్జల ప్రశ్నించారు. సుజనా, కామినేని బీజేపీ మనుషులన్న టీడీపీ, కేంద్రానికి విజ్ఞాపనపత్రం తయారుచేయడానికే మీటింగు పెట్టుకున్నారంటూ ఈ రహస్యభేటీని టీడీపీ @JaiTDP వర్లరామయ్య తన భుజాలమీదకు ఎందుకు ఎత్తుకున్నారు? ఇలాంటి పన్నాగాలు చేసే నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎలా ఉంటారు? (2/3) — Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) June 24, 2020 -
బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ
సాక్షి, అమరావతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల రహస్య సమావేశం బట్టబయలు కావడంతో టీడీపీ ఉలిక్కిపడింది. నిమ్మగడ్డను ఉపయోగించుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెర వెనుక వ్యవహారాలు నడిపిన నేపథ్యంలో తమ గుట్టు రట్టు అయిందని టీడీపీ అధినాయకత్వంలో ఆందోళన మొదలైంది. నిమ్మగడ్డ పూర్తిగా తమ అధినేత కనుసన్నల్లో పని చేశారని, ఆయన తరపున కోర్టు కేసులను కూడా టీడీపీ నేతలే నడిపిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలు ఈ రహస్య భేటీతో నిజమని నిర్ధారణ అయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆధారాలతో అడ్డంగా దొరికిపోయినట్లే నిమ్మగడ్డతో అనైతిక సంబంధం నెరుపుతూ చిక్కామని టీడీపీ నేతలు వాపోతున్నారు. బీజేపీలో ఉన్నా బాబు సన్నిహితులే.. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నా వారిద్దరూ చంద్రబాబు సన్నిహితులనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా నిమ్మగడ్డతో సమావేశం కావడం, అందులో తమ అగ్రనేత ఆన్లైన్ ద్వారా పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఖండించడానికి సైతం టీడీపీ నేతలు ముందుకు రావట్లేదు. ‘ఫేస్‌టైమ్’ ద్వారా టీడీపీ అగ్రనేత ఈ రహస్య సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడి కావడంపై ఆ పార్టీలో కలకలం మొదలైంది. రహస్య సమావేశం దృశ్యాలు బయటకు రావడంతో నిమ్మగడ్డ వ్యవహారంలో తాము చేస్తున్న వాదన అబద్ధమని ప్రజలకు తెలిసిపోయిందని, తెర వెనుక జరిపిన రాజకీయం బెడిసికొట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ఆవేదన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. నోరు మెదపని నేతలు.. ఈ రహస్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినా సాయంత్రం వరకూ టీడీపీ నాయకులు నోరు మెదపలేదు. సాధారణంగా ఏ విషయంపైనైనా మూకుమ్మడిగా మీడియా ముందుకు వచ్చి హడావుడి చేసే ఆ పార్టీ నేతలు ఈసారి స్పందించేందుకు ముందుకురాలేదు. సాయంత్రానికి వ్యూహాత్మకంగా దళిత నేత వర్ల రామయ్యను రంగంలోకి దించి మాట్లాడించారు. మాజీ మంత్రులు, చంద్రబాబు కోటరీ వ్యక్తులు, అధికార ప్రతినిధులెవరూ ఈ అంశంపై స్పందించలేదు. కాగా, కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఇప్పుడు కూడా అదే హోట్ల్లో నిమ్మగడ్డ, సుజనా, కామినేని శ్రీనివాస్‌లు భేటీ అయ్యారు. -
హైదరాబాద్ స్టార్ హోటల్లో గూడుపుఠాణి!
అది హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్.. ఉదయం 10.47 గంటలు.. టక్ చేసుకుని ఫోన్లో మాట్లాడుతూ వేగంగా నడుస్తున్న ఓ వ్యక్తి అక్కడకు చేరుకోగానే స్వాగతం పలికి థర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరిశీలించారు. అనంతరం ఆయన లిప్ట్ ఎక్కి 8వ అంతస్తులోని గదిలోకి వెళ్లారు. ఆ వెంటనే తెల్ల దుస్తులు ధరించిన మరొకరు నింపాదిగా చేతులను శానిటైజ్ చేసుకుని అదే విధంగా గదిలోకి చేరుకున్నారు. చివరిగా వచ్చిన మూడో వ్యక్తి మాత్రం 6వ అంతస్తు దాకా లిఫ్ట్ వాడినా అక్కడ్నుంచి నడుచుకుంటూ 8వ అంతస్తులోని గదిలోకి ప్రవేశించారు. ఆ గదిలో.. ముగ్గురు మిత్రుల మధ్య గంటన్నర పాటు రహస్య మంతనాలు సాగాయి. అనంతరం ఒక్కొక్కరే అక్కడి నుంచి నిష్క్రమించారు... సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారానికి సంబంధించి కోర్టులో వివాదాలు కొనసాగుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు బీజేపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రహస్యంగా కలిసిన దృశ్యాలు వెలుగులోకి రావడం పెను సంచలనం కలిగిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈనెల 13వ తేదీన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు గుట్టుగా నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు నేతల రహస్య సమావేశం దాదాపు గంటన్నరకుపైగా కొనసాగింది. ఈ దృశ్యాలు మంగళవారం పలు చానళ్లలో ప్రసారమయ్యాయి. టీడీపీ అగ్రనేత కూడా ‘ఫేస్‌టైమ్’ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. మిత్రుడనా... ఫిర్యాదుకా? ఈ రహస్య భేటీపై మీడియాలో దుమారం రేగడంతో నిమ్మగడ్డ తమ కుటుంబానికి చిరకాల మిత్రుడని, ఇటీవల పరిణామాలు, విధి నిర్వహణకు సంబంధించిన విషయాలపై ఆయనతో చర్చించలేదని, కామినేనితో పార్టీ వ్యవహారాలపై మాట్లాడానని సుజనా పేర్కొనగా.. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకే నిమ్మగడ్డ సుజనాను కలసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ప్రకటించడం గమనార్హం. ఎస్ఈసీ వివాదానికి సంబంధించి నిమ్మగడ్డ దాఖలు చేసిన కేసులో కామినేని శ్రీనివాస్ ఆయనకు అనుకూలంగా పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందనే ఆరోపణలున్నాయి. ఒకరి తరువాత ఒకరుగా గదిలోకి... హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో ఈనెల 13వతేదీన ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య ముగ్గురు నేతలు ఒక్కొక్కరిగా చేరుకొని సుమారు గంటన్నర సేపు రహస్య మంతనాలు సాగించినట్టు ఆ వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. తొలుత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి హోటల్‌కు చేరుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే కామినేని శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రమేష్కుమార్లు వేర్వేరుగా సుజనా గదిలోకి వెళ్లారు. సమావేశానికి ముందు ఈ ముగ్గురు నేతలకు ఓ వ్యక్తి హోటల్ ప్రవేశద్వారం వద్ద స్వాగతం పలికి గది వద్దకు తోడ్కొని వెళ్లారు. రహస్య మంతనాల అనంతరం వారంతా విడివిడిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. ఆన్లైన్లో పాల్గొన్న టీడీపీ అగ్రనేత? రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి వివాదంలో ఇరుక్కుపోయిన వ్యక్తితో బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాల ఎగవేత కేసును ఎదుర్కొంటూ టీడీపీ నుంచి ఫిరాయించి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కామినేని గంటన్నరసేపు రహస్యంగా మంతనాలు సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీజేపీలో కొనసాగుతున్నా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్లుగా టీడీపీకి చెందిన అగ్రనేత కూడా ‘ఫేస్ టైమ్’ ద్వారా ఈ సమావేశంలో ఆన్లైన్లో పాల్గొన్నట్లు సమాచారం. వీరంతా కలసి రహస్య మంతనాలు సాగించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న కుట్ర దాగి ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అడ్డుకుంటూ దురుద్దేశపూరితంగా... రాష్ట్ర ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం, పలు సంక్షేమ పథకాలను అడ్డుకోవడంతో పాటు తనకు రక్షణ లేదంటూ శాంతి భద్రతలపై సందేహాలు రేకెత్తించేలా నిమ్మగడ్డ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేసి టీడీపీకి అనుకూలంగా దురుద్దేశపూరితంగా వ్యవహరించినట్లు వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాదరణను ఓర్వలేక కుతంత్రాలు.. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది వ్యవధిలోనే 90 శాతం హామీలను అమలు చేసింది. కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ప్రజలకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా రూ.42 వేల కోట్లకుపైగా లబ్ధి చేకూర్చింది. ప్రభుత్వం అమలు చేయనున్న వివిధ పథకాలు, కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను క్యాలెండర్‌తో సహా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇవన్నీ చూసి తట్టుకోలేని విపక్ష నేతలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజా సమావేశం జరిగినట్లు విశ్లేషిస్తున్నారు. భేటీతో పార్టీకి సంబంధం లేదన్న బీజేపీ నిమ్మగడ్డతో సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు భేటీ కావడంపై తమ పార్టీకి ఏ సంబంధం లేదని బీజేపీ పేర్కొంది. అదంతా వారు వ్యక్తిగతంగా నిర్వహించుకున్న సమావేశమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డతో సంప్రదింపులు జరపాలని పార్టీ ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. లిఫ్ట్‌లో ఇద్దరు... నడుచుకుంటూ నిమ్మగడ్డ! సుజనా చౌదరి 13వతేదీ ఉదయం 10.47 గంటలకు హోటల్లోని ఎంఎల్ అపార్ట్మెంట్ వైపు నుంచి ఒంటరిగా ప్రవేశించారు. అక్కడికి సమీపంలోని లిప్టు ద్వారా హోటల్ 8వ ఫ్లోర్‌కు చేరుకొని కారిడార్‌లో నడుచుకుంటూ 10.48 గంటలకు మంతనాల కోసం ముందుగా బుక్ చేసుకున్న గదిలోకి వెళ్లారు. కామినేని శ్రీనివాసరావు ఉదయం 11.23 గంటలకు హోటల్లోకి సుజనా ప్రవేశించిన దారి నుంచే వెళ్లారు. మంతనాలకు ముందు ముగ్గురు నేతలకు హోటల్ వద్ద స్వాగతం పలికిన వ్యక్తితో కలిసి కామినేని లిప్టు ద్వారా 8వ అంతస్తుకు చేరుకుని కారిడార్‌లో నడుచుకుంటూ 11.26 గంటలకు సుజనా గది వద్దకు చేరుకున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాత్రం ఆ దారిలో కాకుండా హోటల్ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించి గ్రౌండ్ ఫ్లోరు నుంచి లిప్టులో 11.45 గంటలకు హోటల్ 6వ అంతస్తుకు చేరుకుని ఎల్ షేప్ కారిడార్లలో నడుచుకుంటూ 8వ అంతస్తుకు వెళ్లారు. స్వాగతం పలికిన వ్యక్తి వెంట రాగా 11.48 గంటలకు సుజనా రూంకు చేరుకున్నారు. సుమారు గంటన్నర పాటు సమావేశం తరువాత ముగ్గురు నేతలు భేటీ ముగించుకొని తొలుత మధ్యాహ్నం 1.03 గంటలకు కామినేని గది నుంచి బయటకు వచ్చారు. 1.13 నిమిషాలకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ గది నుంచి వెలుపలకు రాగా ఆఖరున 1.32 గంటలకు సుజనా చౌదరి ఆ గది నుంచి బయటకు వచ్చారు. రాజ్యాంగ పదవి స్థాయిని దిగజార్చారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి. ఇతరులకు ఆదర్శప్రాయంగా మెలగాలి. ఎన్నికల కమిషనర్ వ్యవహారం న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి రాజకీయ నాయకులను కలవడం ఏంటి?! ఆ పోస్టు స్థాయిని దిగజార్చినట్లయింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, న్యాయమూర్తులతో సహా ఎవరూ కూడా వారి పరిధి, నియమావళిని అతిక్రమించకూడదు. వీడియోను చూస్తే నిమ్మగడ్డ రమేష్ రాజకీయ నేతలతో సమావేశం అయినట్లు కనిపిస్తోంది. ఏం మాట్లాడలేదన్నా ఎవరు నమ్ముతారు? కోవిడ్ వల్ల హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి పనిచేస్తానని నిమ్మగడ్డ అప్పట్లో ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండి ఆయన చేస్తున్న పనులు ఇవేనా!? – సర్వా సత్యనారాయణ ప్రసాద్, హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మచ్చలేకుండా ఉండాలి. పక్షపాత ధోరణితో ఉండకూడదు.. ఉన్నట్లు అనిపించకూడదు. రాజకీయంగా ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కానీ, నిమ్మగడ్డ రమేష్ కలిసింది ఎవరిని? వాళ్లేమీ బీజేపీలో పుట్టి పెరిగిన నేతలు కాదు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలున్న వాళ్లూ కాదు. టీడీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరిన వ్యక్తి ఒకరు.. టీడీపీ సర్కారులో మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరొకరు. కలిసిన వ్యక్తేమో టీడీపీ హయాంలో నియమితులైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో కలుసుకున్నారంటే ఏం అనుకోవాలి? దీనిపై వాళ్లు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ప్రయోజనంలేదు. ఈ ముగ్గురి కలయికపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయి. – చిత్తర్వు నాగేశ్వరరావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఈయన నిమ్మగడ్డ రమేశ్ నిమ్మగడ్డ రమేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. ‘రాజ్యాంగ బద్ధమైన’ పదవిలో ఉంటూ ముఖ్యమంత్రిపై నిందలు మోపుతూ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల సంస్కరణలతో పదవిని కోల్పోయి కోర్టుకెక్కారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లను ఈయన తరఫున వాదించడానికి నియమించారు. ఎవరు నియమించారన్నది జగమెరిగిన సత్యం. ఇతను సుజనా చౌదరి చంద్రబాబు నమ్మిన బంటుగా సుజనా చౌదరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత ఏడాది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన మరుక్షణమే చంద్రబాబు సలహా మేరకు బీజేపీలో చేరారు. చంద్రబాబు తరఫున పనులు చక్కబెడుతూ లాబీయింగ్ చేస్తున్నారు. ఈయన గారు 7 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు తరఫున ‘లెక్కలు’ చూసే వాళ్లలో ఈయన ముఖ్యుడని చెబుతుంటారు. ఇదిగో కామినేని శ్రీనివాస్ టీడీపీ అధినేత చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్ బాగా సన్నిహితుడు. చంద్రబాబు సూచన మేరకే 2014 ఎన్నికలప్పుడు బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీ చేశారు. చంద్రబాబు ఇతన్ని మంత్రిగా కూడా తీసుకున్నారు. పేరుకు బీజేపీ అయినప్పటికీ చంద్రబాబు తరఫునే పని చేస్తుంటారు. ఇటీవల ఆయన సూచన మేరకే నిమ్మగడ్డ రమేశ్ తరఫున కోర్టులో పిటిషన్ వేశారు. నిమ్మగడ్డపై దాఖలైన ఈ వ్యాజ్యాన్ని విచారిస్తాం సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేరకు జరగడానికి వీల్లేదని, ఎస్ఈసీ నియామకం పూర్తిగా రాష్ట్ర గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో అసలు ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ నియామకమే చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. ఈ పిటిషన్ దాఖలుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలతో ధర్మాసనం విభేదించింది. ఈ పిటిషన్‌పై తాము విచారణ జరుపుతామంటూ తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత కుమారిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. నిమ్మగడ్డ రమేశ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంత్రిమండలి సిఫారసు మేరకు ఎన్నికల కమిషనర్ నియామకం కావడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పినందున, ఏ అధికారంతో ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారో నిమ్మగడ్డ రమేశ్‌ను వివరణ కోరాలంటూ కో వారెంట్ రూపంలో శ్రీకాంత్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే ఈ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యం దాఖలుపై పలు అభ్యంతరాలు లేవనెత్తి నంబర్ కేటాయించలేదు. పిటిషన్ విచారణార్హతపై అభ్యంతరం లేవనెత్తే అధికారం రిజిస్ట్రీకి లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శశిభూషణ్‌రావు రిజిస్ట్రీ వర్గాలకు ఘాటు లేఖ పంపారు. -
ఎవరి మీద కుట్ర చేసేందుకు మంతనాలు?
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిజస్వరూపం కోసం తాము చెబితే ఎవరూ నమ్మలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కానీ ఇప్పుడు ఆయన అసలు స్వరూపం బయటపడిందన్నారు. మంగళవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. "హం తుమ్ ఏక్ కమరేమే" అన్నట్లుగా అందరు ఒకే గదిలో కూర్చుని నిమ్మగడ్డ ఎవరితో మంతనాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి మీద కుట్ర చేసేందుకు ప్రైవేటు హోటల్స్‌లో కలిశారని నిలదీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి, పరపతిని కుదించాలని ప్రయత్నం చేస్తున్నారని, ఆ కుట్రలో భాగంగానే కలిశారన్న విషయం బయటపడిందని తెలిపారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) "బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో కలిసి ఉండడంతో నిమ్మగడ్డ నిజ స్వరూపం బయట పడింది. నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికీ సచ్చీలుడని చెబుతారా? నిమ్మగడ్డ కోసం చెబితే కోర్డుల నుంచి మాకు నోటీసులు ఇస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రే. బాబు కుట్ర ఎజెండా ప్రజలకు తెలిసింది. చంద్రబాబు అండ్ కో ఆడుతున్న డ్రామాలో నిమ్మగడ్డ ఒక పాత్రధారి అని బయట పడింది" అని మంత్రి పేర్కొన్నారు. (నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి) -
'ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు'
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..' చంద్రబాబు అడుగడుగునా కుట్రలకు పాల్పడుతున్నారు. ఇంత నీచమైన రాజకీయాలు గతంలో ఎపుడూ చూడలేదు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత భారీగా కుట్రలు పన్నుతున్నారు. నేరుగా మాతో యుద్దం చేసే ధైర్యం లేక దొడ్డిదారిన వస్తున్నారు. విశాఖలో భూ అక్రమాలు జరిగాయని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా నిరూపించలేకపోయారు. మీ కుట్రలకి ఇక చెల్లు. మీరెన్నికుట్రలకు పాల్పడినా మేము రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. నిమ్మగడ్డ రమేష్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కుట్రలేంటో బయటపడాలి.(రహస్య భేటీ కుట్రను ఛేదిస్తాం: ఆదిమూలపు) మాకు తెలిసింది ఒక్కటే ప్రజలకి సేవ చేయడం... ప్రజల మెప్పు పొందడం...మళ్లీ ఎన్నికలకి వెళ్లడం.నీచ రాజకీయాలకి పాల్పడితే చూస్తూ ఊరుకోం.ఏడాది కాలంలో 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చడంతో చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు కుట్ర స్వభావాన్ని మార్చుకోకుండా ప్రభుత్వంపై తప్పుడుగా బురద జల్లాలని చూస్తున్నారు.కుట్రలతో వ్యవస్ధలని అదుపులో పెట్టుకుని రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవడం తగదు. గత ఏడాది కాలంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఎక్కడున్నారు. ఏడాదిగా బయటకి రాని వ్యక్తి ఇపుడు ఎందుకు వచ్చారు. తన అనుచరుడు కిషోర్‌ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకు సిఐడి ఆఫీస్‌కి వచ్చావు. ఈ కేసులో తన పేరు ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే గంటా బయటకి వచ్చారే తప్ప కిషోర్ పై ప్రేమతో మాత్రం సిఐడి కార్యాలయానికి రాలేదు. కుట్రల వెనుక ఎవరున్నా .. అన్ని సాక్ష్యాదారాలతోనే నిందితులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు' అంటూ ధ్వజమెత్తారు.(వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) కాగా, రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
‘ఆ భేటీ వెనుక కుట్ర దాగుంది’
సాక్షి అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ రహస్య సమావేశం వెనుక కుట్ర దాగుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చెయ్యడమే పని అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావుతో ఎలా భేటీ అవుతారని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి ఆదిమూలపు మంగళవారం మాట్లాడారు. ‘చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్‌ని పావుగా వాడి మా ప్రభుత్వం పై కుట్రలు చేస్తున్నాడు. దళిత జడ్జిని మేం ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తే ఇందుకేనా అడ్డుకున్నది? దళిత ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగింది. నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్య భేటీకి సంబంధించిన వీడియోలతో మొత్తం కుట్ర బయటపడింది. ఆ రహస్య భేటీలో ఏం జరిగిందో విచారిస్తాం. దీని వెనుకగల కుట్రను ఛేదిస్తాం. సుప్రీం కోర్టుకి కూడా వాస్తవాలు తెలియపరుస్తాం’అని మంత్రి అన్నారు. (చదవండి: నిమ్మగడ్డతో రహస్య భేటీపై బీజేపీ అసంతృప్తి) కాగా, రాష్ట్ర మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో భేటీ కావడం పట్ల బీజేపీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. (చదవండి: వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?
సాక్షి, అమరావతి : టీడీపీ సానుభూతిపరుడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. పార్క్ హయత్‌లో దుష్ట చతుష్టయంలోని ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారని.. వారితో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరని ప్రశ్నించారు. అతి త్వరలో మరిన్ని వివరాలు.. అని పేర్కొన్నారు.(చదవండి : నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?. మరిన్ని వివరాలు అతి త్వరలో...’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ నిమ్మగడ్డపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇరువురు నేతలతో ఈ నెల 13 ఆయన భేటీ కావడం పలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చింది. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.(చదవండి : ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) చంద్రబాబు కుట్రలో భాగం : మంత్రి వెల్లంపల్లి ఈ భేటీకి సంబంధించి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏమిటనేది ఈ వీడియోతో తెలిపోందన్నారు. ఇన్నాళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్నవి ఆరోపణలు కావని, నిజాలని రుజువైందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలో ఇదంతా భాగమని విమర్శించారు. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లు బీజేపీ నేతలు కాదని.. వారు బాబు జనతా పార్టీ నాయకులను ఎద్దేవా చేశారు. వారిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్మగడ్డ నిజ స్వరూపాన్ని కోర్టులకు వివరస్తామని తెలిపారు. -
నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి భేటీ కావడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం సరికాదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.నిమ్మగడ్డ వ్యవహరంపై బహిరంగంగా పోరాటం చేయమన్నామే తప్ప కుట్రలు చేయమని చెప్పలేదన్నారు. హోటళ్లలో రాజకీయ నేతలలతో చర్చించాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఏంటని ప్రశ్నించారు. నిమ్మగడ్డ విశ్వసనీయతపై ప్రశ్నలు వచ్చిన సమయంలో ఈ భేటీలు దేనికి నిదర్శనమని నిలదీశారు. మొదటి నుంచి ఆకాశ చంద్రన్న ఉత్తరాలతో నిమ్మగడ్డ అనుమానస్పదంగా ఉన్నారని, హోటల్ భేటీతో ఇది రుజువైందని సదరు నేత వ్యాఖ్యానించారు.(ఇద్దరు నేతలతో నిమ్మగడ్డ రహస్య భేటీ) కాగా, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 13న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ భేటీ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో రమేష్ కుమార్ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో నిమ్మగడ్డ చర్చలు జరపడం రాజకీయ వర్గల్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. (నిమ్మగడ్డకు సుప్రీంకోర్టు నోటీసులు) కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే చంద్రబాబు సహచరులతో రహస్యంగా సమావేశం కావడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. నిమ్మగడ్డ టీడీపీ సానుభూతిపరుడంటూ తొలి నుంచి వస్తున్న వార్తలు నిజమేనా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు డైరెక్షన్లోనే వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ('నిమ్మగడ్డ'ను నియంత్రించండి) -
మనకే.. మస్కా కొట్టారు!
త్రిమూర్తులు : అరే.. సహదేవుడు.. మూటా ముల్లు సర్దుకుని ఊరి విడిచివెళ్లిపోతున్న.. ఆ కుటుంబం ఎవరిదిరా.. అటు చూడూ.. సహదేవుడు : వాళ్లా.. మామా.. ఇంకెవరూ మన భూషారావు కుటుంబం.. పాపం.. మన కొల్లేరులో పనులు లేక ఒడిషా రాష్ట్రానికి పిల్లలతో సహా వలస పోతున్నాడు.. త్రిమూర్తులు: అరేరే.. ఎంత కష్టం వచ్చిందిరా.. పదా ఆపుదాం.. అంటూ పరుగున వెళ్లారు.. సహదేవుడు : భూషారావు బాబాయ్.. ఎక్కడకు వెళుతున్నారు.. మొత్తం కుటుంబమే తరలిపోతున్నారు... భూషారావు : ఏమని చెప్పను.. సహదేవు.. మన కొల్లేరులో పనులు కరువయ్యాయి.. ఇకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది.. నీకు తెలుసుకదా.. ఒడిషాలో నీటి ఏరులు ఉన్నాయి.. అక్కడ చేపల వేటతో జీవనం సాగిద్దామని వెళుతున్నా.. త్రిమూర్తులు: భూషారావు.. నువ్వు పెద్దోడివి. అన్ని తెలిసినోడివి.. నువ్వే ఇలా అంటే ఎలా.. మరో 21 రోజుల్లో ఎన్నికల వస్తున్నాయి... వచ్చే ప్రభుత్వం మన కొల్లేరు కష్టాలు ఆలకిస్తుందనే నమ్మకం నాకు ఉంది.. అప్పటి వరకు ఆగిపోవచ్చుకదా.. భూషారావు : ఆ నమ్మకం నాకు లేదు.. త్రిమూర్తులు.. మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు... మేము అధికారంలోకి వస్తే∙కొల్లేరు కాంటూరును కుదిస్తామన్నారు.. రెగ్యులేటర్ కడతా మన్నారు. సర్కారు కాల్వపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. కుదింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నా, మిగిలిన హామీలైన నెరవేర్చవచ్చుకదా.. నా పుట్టిన రోజుకు వంతెన నిర్మిస్తానని మన ఎమ్మెల్యే కామినేని గత ఏడాది చెప్పారు.. పనులు పూర్తి కాలేదు.. మనకే మస్కా కొట్టారురా... ఇప్పుడు చెప్పు.. మల్లిఖార్జునరావు : (సైకిల్‌పై వస్తూ ఆగాడు) భూషారావు నువ్వు చెప్పిన మాటలు విన్నా. అది నిజమే.. మొన్న ఎన్నికల్లో మన కొల్లేరు గ్రామాల వ్యక్తికి రావల్సిన సీటు టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు దక్కింది. ఆయనను గెలిపించాం.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఉన్న సంబంధాలతో కొల్లేరు కష్టాలు తీరుతాయని భావించా.. చివరకు మనకు కన్నీళ్లే మిగిలాయి. భూషారావు : నిజమే.. మల్లిఖార్జున.. పుష్కరాల స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హెలికాప్టర్‌పై మన కొల్లేరు పెద్దింట్లమ్మ గుడివద్ద దించి ఏవో.. నాలుగు మాటలు చెప్పించారు.. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేశారు. చివరకు కొల్లేరు కాంటూరు కుదింపు కుదరదన్నారు.. పౌల్రాజ్ : భూషారావు బాబాయ్.. మిగిలింది నేను చెప్తా.. వినండి.. కాంటూరు కుదింపు కుదరదని సుప్రీం కోర్టు చెప్పడంతో, కొల్లేరు బౌండరీలు మార్చి చుట్టూ జిరాయితీ భూములు కేటాయిస్తామని, మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు... అవునా.. కాదా.. త్రిమూర్తులు : పౌల్రాజ్ నువ్వు చెప్పింది నిజమే .. అదట్టా ఉంచూ.. క్రిందటి సంవత్సరం ప్రజా సంకల్పయాత్ర చేయడానికి వచ్చిన జగన్ మన కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా... అదిగదిగో.. ఆ వచ్చేది మన నరసింహేకదా.. ఆడికి బాగా తెలుసు అడుగుదాం.. నరసింహ : అందరికి నమస్కారమండీ.. ఏంటీ అందరూ మీటింగు పెట్టారు... త్రిమూర్తులు: ఏం లేదు.. నరసింహా.. మన భూషారావు కొల్లేరులో పనులు లేవని వలసపోతున్నాడు.. అందరం కలసి ఆపుతున్నాం.. నరసింహ : భూషారావు.. ఇన్ని రోజులు కష్టలు పడ్డావు.. ఇంకొక్క నెల ఆగు.. మన బతుకులు మారతాయి. మొన్న ప్రజా సంకల్ప యాత్రగా వచ్చిన వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఏమన్నారో.. చెబుతాను వినండి.. ‘ నేను గత నాయకుల మాదిరిగా అమలు కాని వాగ్దానాలు ఇవ్వను.. మీ సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా.. మీ సమస్యల పరిష్కారానికి ప్లాన్ ఏ, ప్లాన్ బీ అనే పద్ధతుల ద్వారా పరిష్కారించుకుందాం.. కొల్లేరు ప్రజలకు అవసరమైన రెగ్యులేటర్ నిర్మించుకుందాం.. అని చెప్పారు.. చూద్దాం.. ఆగండి.. పౌల్రాజ్ : భూషారావు.. నాకు జగన్ చెప్పిన హామీలపై నమ్మకం ఉంది.. మన కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నా.. ఆయన తండ్రి కొల్లేరు ఆపరేషన్ తర్వాత దాదాపు 3,500 కోట్లు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అందించారు. సహదేవుడు : ఇదిగో భూషారావు బాబాయ్.. ఇంత మంది చెబుతున్నాం.. ఒక్క నెలరోజులు ఆగు.. పిన్ని బట్టల బుట్ట.. ఇటివ్వండి.. అందరూ రండిరా.. ఈ రోజు మా ఇంటి దగ్గరే మీ భోజనం.. భూషారావు : మీరందరూ చెబుతుంటే.. నాకు నమ్మకం కలుగుతుంది.. రాజన్న పాలన మళ్లీ మనం చూడబోతున్నామన్న నమ్మకంతో తిరిగి వెళుతున్నాం.. అందరూ అనుకుంటూ సహదేవుడు ఇంటికి భోజనాలకు వెళ్లారు.. -
బీజేపీతో కొనసాగుతోన్న టీడీపీ దోస్తీ
పశ్చిమ గోదావరి జిల్లా: బీజేపీతో టీడీపీ దోస్తీ పూర్తిగా తెగినట్లు కనబడటం లేదు. టీవీ చర్చా కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నా కూడా ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగా పాల్గొంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తణుకు ఏరియా ఆసుపత్రిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతా శిశు విభాగాన్ని ఎమ్మెల్యే హోదాలో కామినేని ప్రారంభించారు. కామినేని మంత్రిగా కాకుండా ఎమ్మెల్యే హోదాలో వేరే జిల్లాలోని నియోజకవర్గ ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వివరణ అడగగా తణుకు టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆహ్వానం మేరకే ప్రారంభోత్సవం చేశానని చెబుతున్నారు. అయితే కామినేని పార్టీ మారతారనే గుసగుసలు కూడా వినిపిస్తోన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తేగానీ ఎవరు ఏ పార్టీలోకి వెళ్లేది లేనిది తెలిసేలా లేదు. -
కాణిపాకంలో మాజీ మంత్రి ప్రమాణం
సాక్షి, చిత్తూరు : పదవిలో ఉండగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చెబుతున్నారు. ఈ మేరకు ప్రమాణాల దేవుడుగా పేరుగాంచిన కాణిపాకం వరసిద్ది వినాయకుడి వద్ద ఆయన ప్రమాణం చేశారు. గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కామినేని.. నేడు కాణిపాకం వర సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. ‘పదవిలో ఉండగా నాపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. కానీ, అప్పుడు ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు. అందుకే రాజీనామా చేశాక ప్రమాణం చేస్తున్నా. నేను కానీ, నా కుటుంబంలోని వ్యక్తులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు’ అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా, గతంలో 10 వతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు వెల్లువెత్తడంతో అప్పటి విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు కాణిపాకంలో ప్రమాణం చేసి వార్తల్లో నిలిచారు. -
ఏపీ మంత్రుల రాజీనామాలు ఆమోదం
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు సమర్పించిన రాజీనామాలు ఆమోదం పొందాయి. బీజేపీ మంత్రుల రాజీనామాలు గవర్నర్ నరసింహన్ ఆమోదించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ అంగీకరించినట్లు సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. కాగా, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిల రాజీనామాలు ఆమోదం పొందాయా.. లేదా అనేది తమకు తెలియదని పరకాల చెప్పారు. 'ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణలో సీఎం చంద్రబాబు పూర్తి వివరాలు తెలిపారు. మా డిమాండ్లపై కేంద్రం అవమానకరంగా వ్యవహరించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆంధ్రుల అందరి హక్కు. వీటిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అవమానకరంగా వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ప్రజలు అసహనంతో ఉన్నారని' పరకాల తెలిపారు. కాగా, నేటి ఉదయం కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావులు ఏపీ కేబినెట్ నుంచి వైదొలగిని విషయం తెలిసిందే. ఆ మేరకు తమ రాజీనామా లేఖలను బీజేపీ నేతలు గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు తమ అధికారిక వాహనాలు, ఐడీ కార్డులను సంబంధిత అధికారులకు అప్పగించారు. -
బీజేపీ మంత్రుల రాజీనామా
-
ఏపీ: బీజేపీ మంత్రుల రాజీనామా
సాక్షి, అమరావతి : ఏపీ కేబినెట్ నుంచి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు వైదొలిగారు. రాజీనామా లేఖలను గురువారం ఉదయం అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందచేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టు వారు తెలిపారు. సీఎం ఛాంబర్లో కామినేని భేటీ అయి రాజీనామా లేఖ ఇచ్చారు. రాజీనామా లేఖ ఇచ్చిన మూడు నిమిషాల్లోనే మంత్రి మాణిక్యాలరావు వెనుదిరిగారు. బీజేపీ మంత్రులు అధికార వాహనాలను, ఐడీ కార్డులను వదులుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చిచెప్పడంతో కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు వైదొలుగుతున్న క్రమంలో ఏపీ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు అధిష్టానం ఆదేశాలతో బీజేపీ మంత్రులు సంసిద్ధమయ్యారు. అనుకున్న విధంగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే సభలోనే మంత్రులు కామినేని, మాణిక్యాలరావు ముఖ్యమంత్రికి తమ రాజీనామా లేఖలను అందచేశారు. -
ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా
-
ఏపీ కేబినేట్‌కు బీజేపీ మంత్రులు రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్‌కు భారతీయ జనతా పార్టీ మంత్రులు రాజీనామా చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం రాజీనామాలు చేస్తారని తెలిపారు. రేపు జరగనున్న కేబినేట్ భేటీలో కూడా మంత్రులు పాల్గొనరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలసి వివరిస్తారని తెలిపారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో బీజేపీ నాయకులు చంద్రబాబు ప్రకటనపై అత్యవసరంగా భేటీ అయ్యారు. -
ఎలా బతికించుకునేదీ..!
తొలి ప్రసవంలోనే మగ బిడ్డ పుట్టడంతోఆ దంపతుల్లో సంతోషం పెల్లుబికింది...మలి ప్రసవంలో ఆడబిడ్డ...ఇక చాలనుకున్నారుసంసార బండి సాఫీగా సాగుతుందనుకున్నారుఅంతలోనే పిడుగులాంటి వార్త... తొలిబిడ్డలో కాలేయం దెబ్బతిందని...ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండగానేమరో బిడ్డకూ అదే వ్యాధి...ఇద్దరు బిడ్డలకూ అనారోగ్యం వెంటాడడంతోమరో బిడ్డని కన్నారు ... ఆ బిడ్డకూ అదే జబ్బుకూలీ, నాలీ చేసిన డబ్బులతోముగ్గురినీ ఆసుపత్రుల చుట్టూ తిప్పుతున్నారు లక్షల ఖర్చు... అక్కరకు రాని ఆరోగ్య శ్రీ...అంతలోనే ఆరోగ్య శాఖా మంత్రి రాకతోఎంతో ఆశతో ఆశ్రయించారు...అయన మాటలతో కుంగిపోయారు...సాయం మాటెలా ఉన్నా ...ఆయనేం మంత్రి...కడుపు పంటపైనే కడుపు మంటా దక్కే బిడ్డకోసం ముగుర్ని కంటేఇంత అపహాస్యమా...ఆదుకోవాలని అర్ధిస్తేఇంత అసహనమా...! కాకినాడ రూరల్: మట్టిపనికి వెళ్తేనే అన్నం కుండ పొయ్యెక్కేది ... పూట గడిచేది. ఉన్నదాంట్లోనే గుట్టుగా బతికే కుటుంబంలో ఓ మాయదారి రోగం ఆ సంసారాన్ని అతలాకుతలం చేసేస్తోంది. ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆ కన్నపేగుల్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. చివరకు జిల్లా అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రతిఫలం కనిపించడం లేదు. ఎవరైనా సాయం చేద్దామన్నా ఒకటి, రెండు వేలల్లో అయిపోయే జబ్బు కాదు. దీంతో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన ప్రజావాణికి ముగ్గురు చిన్నారులను వెంటపెట్టుకొని ప్రాధేయపడిన ఘటన పలువురిని కలిచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సామర్లకోట ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన అమర్తి చిన్న, వెంకన్నలు భార్యాభర్తలు. వీరికి దుర్గాప్రసాద్ (7), లక్ష్మి (4), మార్త (2) ముగ్గురు సంతానం. మొదటి కుమారుడు దుర్గాప్రసాద్ పుట్టిన మూడేళ్లకు ఒంట్లో బాగోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాలేయ వ్యాధి సోకిందని, దీనికి దాదాపుగా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. తరువాత మరో అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికీ అదే జబ్బుండడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకరుకాకపోతేమరొకరైనా బాగుంటారన్న ఆశతో మరో అమ్మాయికి జన్మనిచ్చిన ఆ తల్లికి మూడో బిడ్డ కు కూడా అదే వ్యాధి ఉందని తెలిసి కుప్పకూలిపోయారు. హైదరాబాద్, విశాఖపట్నం, సామర్లకోట, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో తిరగని ఆసుపత్రి లేదు. ముగ్గురు పిల్లలకూ ఒకే రకమైన జబ్బు సోకడంతో ఆపరేషన్లు చేయించాలంటే సుమారు రూ. కోటి వ్యయమవుతుందని వైద్యులు చెబుతున్నారని ఆ తల్లిదండ్రులు వాపోయారు. మంత్రి వ్యాఖ్యలతో... ఈ రోగానికి ఆరోగ్యశ్రీ వర్తించదని తేల్చడంతో నాలుగు రోజుల కిందట కాకినాడ వ చ్చిన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాసరావును తమ పిల్లలతో వెళ్లి సమస్యను వివరించారు. దయ చూపించాల్సిన ఆ మంత్రి ‘తొలి బిడ్డకు జబ్బు ఉందని తెలి సి వరుసగా ఇద్దరు బిడ్డలను ఎందుకు కన్నావ’ని ఛీదరించుకున్నారని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జబ్బు ఉంది ... ఏదో ఓ బిడ్డ బతికి వంశాన్ని నిలబెడతారని కన్నాం... బాధను అర్ధం చేసుకోకుండా మంత్రి కామినేని అన్న మాటలకు అక్కడే బిడ్డలతో కలసి చనిపోవాలనిపించింద’ని ఆ తల్లి ‘సాక్షి’తో చెబుతూ బోరున విలపించింది. కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కలసి తమ సమస్యను వివరించినా ‘ఈ సమ స్య ఇక్కడ పరిష్కారం కాదని చెప్పా’రంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దాతలు ముందు కు వచ్చి తమ బిడ్డలను కాపాడా’లంటూ ఆ భార్యా, భర్తలు వేడుకుంటున్నారు. -
ఉపాధి పనులు కల్పించండి
► కైకలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన కూలీలు కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నంతో పాటు సమీప గ్రామాల్లోనూ పూర్తిస్థాయి ఉపాధి పనులు ఉండటం లేదని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కైకలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. రాచపట్నం, చింతలచెరువు, గోపవరం గ్రామాలకు చెందిన ఉపాధిహామీ పథకం మేట్లు, కూలీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. గ్రూపులకు కేవలం ఆరు రోజులు పని మాత్రమే కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఉపాధిహామీ నిధులను గృహనిర్మాణాలకు కేటాయిస్తున్నారని వాపోయారు. పని కోసం ఎవరైనా జాబ్‌కార్డుతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల్లో పని కేటాయించాలన్నారు. అలా జరగకపోతే ఉపాధి చట్టం ప్రకారం సదరు వ్యక్తికి కూలి డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఆందోళన తీవ్రమవ్వడంతో ఇన్చార్జి ఎంపీడీవో పార్థసారథి బయటకు వచ్చి కూలీలతో మాట్లాడారు. సోషల్ ఆడిట్ కారణంగా పనులు కేటాయింపు ఆలస్యమైందన్నారు. మండలంలో 20 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. జాబ్ కార్డు, ఆధార్ నంబరు నమోదు కాకపోతే ఖాతాలో నగదు జమ కాదన్నారు. చేసిన పని కొలతలు ఖచ్చితంగా ఉంటేనే నగదు కేటాయిస్తారని తెలిపారు. రాచపట్నంలో 6000 పని దినాలు చేసుకునే పనులు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కైకలూరు మండలంలో కేవలం 7 గ్రామాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ పనులు కేటాయించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కైకలూరు, కలిదిండి నాయకులు కురేళ్ల లాజర్, డి.టి.మూర్తి చైతన్య, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడ్డాం: కామినేని
విశాఖ: ఎన్టీఆర్ వైద్య సేవలు ఆగవని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు ఆస్పత్రులకు బకాయి పడిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. వచ్చే నెల 15వ తేదీలోపు బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్ 11 నుంచి నిమ్స్ లో ఓపీ సేవలు అందించాలని నిర్ణయించినట్టు ఏపీ మంత్రి కామినేని వివరించారు. -
'ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ డాక్టర్లకు మధ్య వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తప్పవని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మంగళవారం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో 501 మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. ఈ 25న ప్రైవేట్ ఆస్పత్రులతో సమావేశమై ప్యాకేజీలు ఖరారు చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఆస్పత్రుల్లోనూ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ 22న జీజీహెచ్ లో మోకాలికి చికిత్స చేయించుకుంటానని మంత్రి కామినేని వివరించారు. విధులకు సక్రమంగా హాజరు కాని 650 మంది ప్రభుత్వ వైద్యులకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే నోటీసులు జారీ చేసిన విషయం అందరికీ విదితమే. -
ఏపీలో 74 కేంద్రాల్లో ఈ సెట్
అనంతపురం: పాలిటెక్నిక్ విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ లో ప్రవేశం పొందే ఈ సెట్ ఎంట్రెన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ లో నేడు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 74 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకుగాను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాసరావు ఈ సెట్ పరీక్షకు 'ఎల్-2' సెట్ ను అనంతపురం జెఎన్ టీయూ లో గురువారం ఉదయం విడుదల చేశారు. రాష్టాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. షెడ్యూలు ప్రకారం తరగతులు, పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని గంటా తెలిపారు. -
త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జనరిక్ మందుల దుకాణాలు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అధ్యాపకులు సకాలంలో విధులకు హాజరయ్యేలా వైద్య కాలేజీల్లో బయెమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. -
'వైద్యశాఖ పోస్టులు త్వరలో భర్తీ'
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు రాజాం: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సుమారు 350 వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ కేర్ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, త్వరలో న్యాయం చేస్తామని కామినేని తెలిపారు. ఏరియా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనకు నిధుల సమస్య వెంటాడుతోందన్నారు. రాజాంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై పరిశీలన కోసం వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి నెలక్పొడం గర్వకారణమని, అయితే ఈ ఆస్పత్రిలో 135 పడకలు ఉన్నాయని, 300 పడకలకు పెంచితే దరఖాస్తు పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ స్వైన్‌ఫ్లూతో ఐదుగురు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ దామెర రాజేంద్ర తదితరులు ఈ పరిశీలన ప్రక్రియలో భాగంగా మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు వచ్చారు. -
ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు 11 జాతీయ విద్యాసంస్థలు రప్పించేందుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 8 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తాము కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన మెడికల్ సీట్లను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని, దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు.