మనకే.. మస్కా కొట్టారు! | TDP, BJP Parties Try To Escaped To Solve Kolleru Lake Problems | Sakshi
Sakshi News home page

మనకే.. మస్కా కొట్టారు!

Published Thu, Mar 21 2019 8:54 AM | Last Updated on Thu, Mar 21 2019 8:55 AM

TDP, BJP Parties Try To Escaped To Solve Kolleru Lake Problems - Sakshi

త్రిమూర్తులు : అరే.. సహదేవుడు.. మూటా ముల్లు సర్దుకుని ఊరి విడిచివెళ్లిపోతున్న.. ఆ కుటుంబం ఎవరిదిరా.. అటు చూడూ..
సహదేవుడు : వాళ్లా.. మామా.. ఇంకెవరూ మన భూషారావు కుటుంబం.. పాపం.. మన కొల్లేరులో పనులు లేక ఒడిషా రాష్ట్రానికి పిల్లలతో సహా వలస పోతున్నాడు..
త్రిమూర్తులు: అరేరే.. ఎంత కష్టం వచ్చిందిరా.. పదా ఆపుదాం.. అంటూ పరుగున వెళ్లారు..
సహదేవుడు : భూషారావు బాబాయ్‌.. ఎక్కడకు వెళుతున్నారు.. మొత్తం కుటుంబమే తరలిపోతున్నారు...
భూషారావు : ఏమని చెప్పను.. సహదేవు.. మన కొల్లేరులో పనులు కరువయ్యాయి.. ఇకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది.. నీకు తెలుసుకదా.. ఒడిషాలో నీటి ఏరులు ఉన్నాయి.. అక్కడ చేపల వేటతో జీవనం సాగిద్దామని వెళుతున్నా..
త్రిమూర్తులు: భూషారావు.. నువ్వు పెద్దోడివి. అన్ని తెలిసినోడివి.. నువ్వే ఇలా అంటే ఎలా.. మరో 21 రోజుల్లో ఎన్నికల వస్తున్నాయి... వచ్చే ప్రభుత్వం మన కొల్లేరు కష్టాలు ఆలకిస్తుందనే నమ్మకం నాకు ఉంది.. అప్పటి వరకు ఆగిపోవచ్చుకదా.. 
భూషారావు : ఆ నమ్మకం నాకు లేదు.. త్రిమూర్తులు.. మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు... మేము అధికారంలోకి వస్తే∙కొల్లేరు కాంటూరును కుదిస్తామన్నారు.. రెగ్యులేటర్‌ కడతా మన్నారు. సర్కారు కాల్వపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. కుదింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నా, మిగిలిన హామీలైన నెరవేర్చవచ్చుకదా.. నా పుట్టిన రోజుకు వంతెన నిర్మిస్తానని మన ఎమ్మెల్యే కామినేని గత ఏడాది చెప్పారు.. పనులు పూర్తి కాలేదు.. మనకే మస్కా కొట్టారురా... ఇప్పుడు  చెప్పు.. 
మల్లిఖార్జునరావు : (సైకిల్‌పై వస్తూ ఆగాడు) భూషారావు నువ్వు చెప్పిన మాటలు విన్నా. అది నిజమే.. మొన్న ఎన్నికల్లో మన కొల్లేరు గ్రామాల వ్యక్తికి రావల్సిన సీటు టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు దక్కింది. ఆయనను గెలిపించాం.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఉన్న సంబంధాలతో కొల్లేరు కష్టాలు తీరుతాయని భావించా.. చివరకు మనకు కన్నీళ్లే మిగిలాయి. 
భూషారావు : నిజమే.. మల్లిఖార్జున.. పుష్కరాల స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హెలికాప్టర్‌పై మన కొల్లేరు పెద్దింట్లమ్మ గుడివద్ద దించి ఏవో.. నాలుగు మాటలు చెప్పించారు.. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేశారు. చివరకు కొల్లేరు కాంటూరు కుదింపు కుదరదన్నారు..
పౌల్‌రాజ్‌ : భూషారావు బాబాయ్‌.. మిగిలింది నేను చెప్తా.. వినండి.. కాంటూరు కుదింపు కుదరదని సుప్రీం కోర్టు చెప్పడంతో, కొల్లేరు బౌండరీలు మార్చి చుట్టూ జిరాయితీ భూములు కేటాయిస్తామని, మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు... అవునా.. కాదా.. 
త్రిమూర్తులు : పౌల్‌రాజ్‌ నువ్వు చెప్పింది నిజమే .. అదట్టా ఉంచూ.. క్రిందటి సంవత్సరం ప్రజా సంకల్పయాత్ర చేయడానికి వచ్చిన జగన్‌ మన కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా... అదిగదిగో.. ఆ వచ్చేది మన నరసింహేకదా.. ఆడికి బాగా తెలుసు అడుగుదాం..
నరసింహ : అందరికి నమస్కారమండీ.. ఏంటీ అందరూ మీటింగు పెట్టారు... 
త్రిమూర్తులు:  ఏం లేదు.. నరసింహా.. మన భూషారావు కొల్లేరులో పనులు లేవని వలసపోతున్నాడు.. అందరం కలసి ఆపుతున్నాం.. 
నరసింహ : భూషారావు.. ఇన్ని రోజులు కష్టలు పడ్డావు.. ఇంకొక్క నెల ఆగు.. మన బతుకులు మారతాయి. మొన్న ప్రజా సంకల్ప యాత్రగా వచ్చిన వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఏమన్నారో.. చెబుతాను వినండి.. ‘ నేను గత నాయకుల మాదిరిగా అమలు కాని వాగ్దానాలు ఇవ్వను.. మీ సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా.. మీ సమస్యల పరిష్కారానికి ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ అనే పద్ధతుల ద్వారా పరిష్కారించుకుందాం.. కొల్లేరు ప్రజలకు అవసరమైన రెగ్యులేటర్‌ నిర్మించుకుందాం.. అని చెప్పారు.. చూద్దాం.. ఆగండి.. 
పౌల్‌రాజ్‌ : భూషారావు.. నాకు జగన్‌ చెప్పిన హామీలపై నమ్మకం ఉంది.. మన కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నా.. ఆయన తండ్రి కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత దాదాపు 3,500 కోట్లు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అందించారు.  
సహదేవుడు : ఇదిగో భూషారావు బాబాయ్‌.. ఇంత మంది చెబుతున్నాం.. ఒక్క నెలరోజులు ఆగు.. పిన్ని బట్టల బుట్ట.. ఇటివ్వండి.. అందరూ రండిరా.. ఈ రోజు మా ఇంటి దగ్గరే మీ భోజనం.. 
భూషారావు : మీరందరూ చెబుతుంటే.. నాకు నమ్మకం కలుగుతుంది..  రాజన్న పాలన మళ్లీ మనం చూడబోతున్నామన్న  నమ్మకంతో తిరిగి వెళుతున్నాం.. అందరూ అనుకుంటూ సహదేవుడు ఇంటికి భోజనాలకు వెళ్లారు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement