kolleru lake problems
-
కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు
-
కొల్లేటి దొంగజపం
కొల్లేరుపై కొంగలకు బదులు దొంగలు వాలుతున్నారు. దొంగజపం చేస్తున్నారు. యథేచ్ఛగా అక్ర మాలకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లూ కొల్లేరు ప్రాంతాన్ని ఇష్టారాజ్యంగా దోచుకున్న టీడీపీ నేతలు ఇంకా చెరువులను అక్రమంగా తవ్వేస్తున్నారు. సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దోపిడీని అడ్డుకుంటే దొంగలు ఏం చేస్తారు? సామ దాన, భేద దండోపాయాలు ఉపయోగిస్తారు. ఏదేమైనా తాము అనుకున్నది సాధించాలనుకుంటారు. సరిగ్గా ఇలాగే ఇప్పుడు కొల్లేరులో చెరువులు అక్రమంగా తవ్వేందుకు టీడీపీ నేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఐదేళ్ల పాటు కొల్లేరును కొల్లగొట్టి వేలాది చెరువులు తవ్విన వారు ఇప్పుడు సొసైటీ జపం చేస్తున్నారు. ఆ పేరుతో అభయారణ్యం పరిధిలో యథేచ్ఛగా చెరువుల తవ్వకాలు సాగించేస్తున్నారు. సొసైటీ సభ్యులను మభ్యపెట్టి అదే చెరువులను లీజుకు తీసుకుంటూ ఒప్పందాలు రాయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకపక్క అటవీశాఖ అధికారులు కొల్లేరులో అక్రమ చెరువులు కొట్టేస్తుంటే, మరోపక్క టీడీపీ నేతలు అడ్డదారుల్లో చెరువులు తవ్వేస్తున్నారు. అధికారం చేజారినా వారి అరాచకాలు ఆగడం లేదు. వంద ఎకరాల విస్తీర్ణంలో చెరువుల తవ్వకం తాజాగా పది రోజుల కిందట ఏలూరు మండలం శ్రీపర్రు పెట్రోల్ బంకు పక్క రోడ్డు శివారు 2 కిలోమీటర్ల దూరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెండు పెద్ద చెరువులను ఓ టీడీపీ నేత తవ్వేశారు. తవ్వకాలకు ముందురోజు గుట్టు చప్పుడు కాకుండా, పొక్లెయిన్లు, బ్లేడ్ ట్రాక్టర్లు అభయారణ్యంలో మోహరించారు. సరిగ్గా ఇదే సమయంలో అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో కలిసి మొండికోడు పరిసరాల్లో అక్రమ చెరువులకు గండ్లు కొడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ అనుచరులతో కలిసి శ్రీపర్రులో అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఏకబిగిన మూడు రోజులపాటు గుట్టు చప్పుడు కాకుండా పగలు, రాత్రి వేళల్లో యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. సుమారు 200 మీటర్ల మేరకు పెద్ద ఎత్తున గట్లు వేసి విశాలమైన రెండు భారీ చెరువులు తవ్వేశారు. కొల్లేరు ప్రక్షాళన సందర్బంగా 2007లో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ చెరువులను ధ్వంసం చేశారు. అయితే సొసైటీ పేరుతో ఇప్పుడు వీటిని టీడీపీ నేతలు మళ్లీ తవ్వేశారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల చొప్పున చేపల వ్యాపారులకు లీజుకు కట్టబెట్టేందుకు యత్నాలు చేపట్టారు. ఇదే మాదిరి టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ఏలూరు మండలంలో మొండికోడు, శ్రీపర్రు, కలకుర్రు, మానూరుతోపాటు భీమడోలు, ఉంగుటూరు, పెదపాడు మండలాల పరిధిలో ఉన్న అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేశారు. ఇటీవల అటవీశాఖ అధికారులు చేపట్టిన సర్వేలోనూ సుమారు 9 వేల ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వినట్టు నిర్ధారణ అయింది. తిరగబడుతున్న కొల్లేరు ప్రజలు ఇటీవల లీజు ఒప్పందం పేరుతో కోమటిలంకలో చెరువులు కబ్జా చేసేందుకు యత్నించిన టీడీపీ మండల నాయకుడు నేతల రవి, ఆయన అనుచరులను గ్రామ యువకులు అడ్డుకున్నారు. తమ చెరువుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. కొద్దిరోజుల క్రితం నేతల రవి కోమటిలంక పెద్దలను కైకులూరులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. మద్యం, విందుతో పెద్దలను మచ్చిక చేసుకుని గ్రామంలో చెరువులను తనకు లీజుకు ఇచ్చినట్టు రాయించుకున్నాడు. ఎకరం రూ.లక్ష లీజు పలికే చెరువును కేవలం రూ.25 వేల చొప్పున ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోమటిలంక యువకులు టీడీపీ నేతలను నిలదీశారు. అధికారం పోయినా తమ గ్రామాన్ని పీడిస్తూనే ఉంటారా అంటూ ఎదురు తిరిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ రేగడంతో కొట్లాట జరిగింది. యువకులు టీడీపీ నేతలను ఊరు నుంచి తరిమికొట్టారు. ఈ ఘటన ఇతర గ్రామాల ప్రజలకూ తెలిసింది. దీంతో కొల్లేరు వాసులు టీడీపీ నేతలను గ్రామాల్లోకి రానీయకూడదని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
మనకే.. మస్కా కొట్టారు!
త్రిమూర్తులు : అరే.. సహదేవుడు.. మూటా ముల్లు సర్దుకుని ఊరి విడిచివెళ్లిపోతున్న.. ఆ కుటుంబం ఎవరిదిరా.. అటు చూడూ.. సహదేవుడు : వాళ్లా.. మామా.. ఇంకెవరూ మన భూషారావు కుటుంబం.. పాపం.. మన కొల్లేరులో పనులు లేక ఒడిషా రాష్ట్రానికి పిల్లలతో సహా వలస పోతున్నాడు.. త్రిమూర్తులు: అరేరే.. ఎంత కష్టం వచ్చిందిరా.. పదా ఆపుదాం.. అంటూ పరుగున వెళ్లారు.. సహదేవుడు : భూషారావు బాబాయ్.. ఎక్కడకు వెళుతున్నారు.. మొత్తం కుటుంబమే తరలిపోతున్నారు... భూషారావు : ఏమని చెప్పను.. సహదేవు.. మన కొల్లేరులో పనులు కరువయ్యాయి.. ఇకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది.. నీకు తెలుసుకదా.. ఒడిషాలో నీటి ఏరులు ఉన్నాయి.. అక్కడ చేపల వేటతో జీవనం సాగిద్దామని వెళుతున్నా.. త్రిమూర్తులు: భూషారావు.. నువ్వు పెద్దోడివి. అన్ని తెలిసినోడివి.. నువ్వే ఇలా అంటే ఎలా.. మరో 21 రోజుల్లో ఎన్నికల వస్తున్నాయి... వచ్చే ప్రభుత్వం మన కొల్లేరు కష్టాలు ఆలకిస్తుందనే నమ్మకం నాకు ఉంది.. అప్పటి వరకు ఆగిపోవచ్చుకదా.. భూషారావు : ఆ నమ్మకం నాకు లేదు.. త్రిమూర్తులు.. మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏమన్నారు... మేము అధికారంలోకి వస్తే∙కొల్లేరు కాంటూరును కుదిస్తామన్నారు.. రెగ్యులేటర్ కడతా మన్నారు. సర్కారు కాల్వపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. కుదింపు అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నా, మిగిలిన హామీలైన నెరవేర్చవచ్చుకదా.. నా పుట్టిన రోజుకు వంతెన నిర్మిస్తానని మన ఎమ్మెల్యే కామినేని గత ఏడాది చెప్పారు.. పనులు పూర్తి కాలేదు.. మనకే మస్కా కొట్టారురా... ఇప్పుడు చెప్పు.. మల్లిఖార్జునరావు : (సైకిల్‌పై వస్తూ ఆగాడు) భూషారావు నువ్వు చెప్పిన మాటలు విన్నా. అది నిజమే.. మొన్న ఎన్నికల్లో మన కొల్లేరు గ్రామాల వ్యక్తికి రావల్సిన సీటు టీడీపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు దక్కింది. ఆయనను గెలిపించాం.. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఉన్న సంబంధాలతో కొల్లేరు కష్టాలు తీరుతాయని భావించా.. చివరకు మనకు కన్నీళ్లే మిగిలాయి. భూషారావు : నిజమే.. మల్లిఖార్జున.. పుష్కరాల స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హెలికాప్టర్‌పై మన కొల్లేరు పెద్దింట్లమ్మ గుడివద్ద దించి ఏవో.. నాలుగు మాటలు చెప్పించారు.. తర్వాత కమిటీలంటూ కాలయాపన చేశారు. చివరకు కొల్లేరు కాంటూరు కుదింపు కుదరదన్నారు.. పౌల్రాజ్ : భూషారావు బాబాయ్.. మిగిలింది నేను చెప్తా.. వినండి.. కాంటూరు కుదింపు కుదరదని సుప్రీం కోర్టు చెప్పడంతో, కొల్లేరు బౌండరీలు మార్చి చుట్టూ జిరాయితీ భూములు కేటాయిస్తామని, మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే కామినేని చెప్పారు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు అసలు పత్తా లేకుండా పోయారు... అవునా.. కాదా.. త్రిమూర్తులు : పౌల్రాజ్ నువ్వు చెప్పింది నిజమే .. అదట్టా ఉంచూ.. క్రిందటి సంవత్సరం ప్రజా సంకల్పయాత్ర చేయడానికి వచ్చిన జగన్ మన కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అనుకుంటున్నారా... అదిగదిగో.. ఆ వచ్చేది మన నరసింహేకదా.. ఆడికి బాగా తెలుసు అడుగుదాం.. నరసింహ : అందరికి నమస్కారమండీ.. ఏంటీ అందరూ మీటింగు పెట్టారు... త్రిమూర్తులు: ఏం లేదు.. నరసింహా.. మన భూషారావు కొల్లేరులో పనులు లేవని వలసపోతున్నాడు.. అందరం కలసి ఆపుతున్నాం.. నరసింహ : భూషారావు.. ఇన్ని రోజులు కష్టలు పడ్డావు.. ఇంకొక్క నెల ఆగు.. మన బతుకులు మారతాయి. మొన్న ప్రజా సంకల్ప యాత్రగా వచ్చిన వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఏమన్నారో.. చెబుతాను వినండి.. ‘ నేను గత నాయకుల మాదిరిగా అమలు కాని వాగ్దానాలు ఇవ్వను.. మీ సామాజికవర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి, నా పక్కన కూర్చోబెట్టుకుంటా.. మీ సమస్యల పరిష్కారానికి ప్లాన్ ఏ, ప్లాన్ బీ అనే పద్ధతుల ద్వారా పరిష్కారించుకుందాం.. కొల్లేరు ప్రజలకు అవసరమైన రెగ్యులేటర్ నిర్మించుకుందాం.. అని చెప్పారు.. చూద్దాం.. ఆగండి.. పౌల్రాజ్ : భూషారావు.. నాకు జగన్ చెప్పిన హామీలపై నమ్మకం ఉంది.. మన కొల్లేరు ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటున్నా.. ఆయన తండ్రి కొల్లేరు ఆపరేషన్ తర్వాత దాదాపు 3,500 కోట్లు ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అందించారు. సహదేవుడు : ఇదిగో భూషారావు బాబాయ్.. ఇంత మంది చెబుతున్నాం.. ఒక్క నెలరోజులు ఆగు.. పిన్ని బట్టల బుట్ట.. ఇటివ్వండి.. అందరూ రండిరా.. ఈ రోజు మా ఇంటి దగ్గరే మీ భోజనం.. భూషారావు : మీరందరూ చెబుతుంటే.. నాకు నమ్మకం కలుగుతుంది.. రాజన్న పాలన మళ్లీ మనం చూడబోతున్నామన్న నమ్మకంతో తిరిగి వెళుతున్నాం.. అందరూ అనుకుంటూ సహదేవుడు ఇంటికి భోజనాలకు వెళ్లారు.. -
బాబోయ్.. కొంపకొల్లేరు
సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి మంతెన వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లేరుపై పలు అధ్యయన కమిటీలు వేసినా.. నివేదికలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంటూర్ కుదింపు సాధ్యం కాదని, ఇలాంటి హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని, కొల్లేరు సమస్యకు ఇది పరిష్కారం కాదని స్పష్టం చేశారు. 5వ కాంటూర్ వరకూ కొల్లేరును అభివృద్ధి చేయాల్సిందేనని, కొల్లేరు జాతీయ సరస్సుగా గుర్తింపు పొందినప్పుడే దీనికి ప్రాముఖ్యం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని స్పష్టం చేశారు. సాక్షి : కొల్లేరు సరస్సుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతంలో చేపల చెరువులు భారీగా తవ్వడం వల్ల సరస్సు కుచించుకుపోయింది. 1971లో ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం సంతకం చేసింది. దానిలో కొల్లేరు సరస్సు పరిరక్షణ కూడా ఉంది. సాక్షి : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రాలేమా? సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రావడం సాధ్యం కాదు. వస్తే ప్రపంచ దేశాలు వెలివేస్తాయి. మంచినీటి సరస్సును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులను పరిరక్షించేందుకు రామ్సర్ ఒప్పందం జరిగింది. సాక్షి : కొల్లేరుపై జీఓ 120 ఎందుకు విడుదల చేశారు. సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందాన్ని అమలు జరిపేందుకే కొల్లేరును అభయారణ్యం చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు 120 జీఓను విడుదల చేశారు. జీఓను అప్పటి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జీఓను అమలు జరిపితే కొల్లేరు సరస్సు పరిరక్షణ సాధ్యమవుతుంది. సాక్షి : అభయారణ్యం పరిధిలో కొల్లేరు సమస్య ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సును 5వ కాంటూర్ వరకూ గుర్తించి ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణించారు. అభయారణ్యం పరిధిలో 72 వేల ఎకరాల భూమి ఉంది. దీనిలో ప్రైవేటు వ్యక్తుల భూమి(జిరాయితీ) 14 వేల ఎకరాలు ఉంది. ప్రైవేటు వ్యక్తుల భూమి ఉన్నప్పుడు అభయారణ్యంగా గుర్తించకూడదు. సాక్షి : కొల్లేరు జిరాయితీ రైతుల పరిస్థితి ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరులోని జిరాయితీ రైతులకు నష్టపరిహారం కేంద్రమే ఇవ్వాల్సి ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ భూములకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. పోలవరం నిర్వాసితులకు చెల్లించినట్టే జిరాయితీ రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది. సుమారు రూ.4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా రూ.1,000 కోట్లు చెల్లించినా సరిపోయేది. కానీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కొల్లేరు భూస్వాములు అయినా.. తినడానికి తిండిలేక, పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని దుస్థితిలో ఉన్నారు. జిరాయితీని ఎటూ తేల్చలేకపోవడం దారుణం. సాక్షి : కొల్లేరుపై వేసిన కమిటీల నివేదికలపై చర్యలు తీసుకున్నారా? సూర్యనారాయణరాజు : కొల్లేరుపై పదికిపైగా కమిటీలు వేశారు. కొల్లేరు పరిరక్షణకు చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై నిపుణుల కమిటీని కూడా వేశారు. కమిటీల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. అజీజ్ కమిటీ నివేదిక అమలుచేస్తే కొల్లేరు సరస్సుకు, జిరాయితీ రైతులకు మేలు జరుగుతుంది. సాక్షి : కొల్లేరును రక్షించాలంటే ఇంకేమి చేయాలి? సూర్యనారాయణరాజు : కొల్లేరును రక్షించాలంటే ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. రెండు మూడు రెగ్యులేటర్ల నిర్మాణం వల్ల ఉపయోగం లేదు. సముద్రపు ఆటుపోట్లు ఉప్పుటేరు ద్వారా ప్రవహించాల్సి ఉంది. ఆ విధంగా జరిగినప్పుడే ఉప్పుటేరు, కొల్లేరు సంరక్షణ సాధ్యం సాక్షి : సరస్సు కాలుష్యాన్ని అరికట్టలేమా? సూర్యనారాయణరాజు : సరస్సు కలుషితం కాకుండా ఉండేందుకు ఇంజినీర్ రామకృష్ణంరాజు సూచనలు పాటిస్తే బాగుంటుంది. కొల్లేరు చుట్టూ డ్రెయిన్లు తవ్వి, ఆ నీరు ఉప్పుటేరులోకి చొచ్చుకుపోయేలా తప్పక చర్యలు తీసుకోవాలి. సాక్షి : ఇంకిపోతున్న కొల్లేరుకు పరిష్కారం? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి నదుల నీరు వివిధ కాలువల ద్వారా చొచ్చుకువస్తుంది. పట్టిసం ఎత్తిపోతల పథకంతో కొల్లేరులోకి నీటిప్రవేశం తగ్గిపోయింది. కొల్లేరులోకి చొచ్చుకువచ్చే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు తదితర పంట కాలువల ఇన్‌ఫ్లోలను అభివృద్ధిచేయాలి. సాక్షి : రెగ్యులేటర్ల నిర్మాణ ఆవశ్యకత ఎంత? సూర్యనారాయణరాజు : కొల్లేరులో 5వ కాంటూర్ వరకూ నీరు నిలబడినప్పుడే సరస్సు ఉనికి ఉంటుంది. అందుకోసం ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. దీనిద్వారా కొల్లేరులో నీటి మట్టం పెరిగి సరస్సులోకి పక్షుల రాకపోకలు పెరుగుతాయి. సాక్షి : కొల్లేరు పరిరక్షణకు శాశ్వత మార్గం? సూర్యనారాయణరాజు : కాంటూర్ కుదింపు కొల్లేరు పరిరక్షణకు సరైన పరిష్కారం కానేకాదు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని ఆసియా ఖండంలోనే విశిష్టమైన మంచినీటి సరస్సును కాపాడుకోవాలి. -
'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'
-
'కొల్లేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం'
దెందులూరు: తమ పార్టీ అధికారంలోకి వస్తే కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఏలూరు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్ హామీయిచ్చారు. కొల్లేరు ప్రజల జీవన గతులు మెరుగుపరిచేందుకే ఈ అంశాన్ని వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు తగ్గించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. చంద్రబాబు వల్లే కొల్లేరు ప్రజలకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలోని గుడివాకలంక, పైడిచింతపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
అసలు మతలబు ‘ఆత్మీయ’మేనా!
విజయవాడ: కొల్లేరువాసుల ఓట్లు వలలో పడ్డాయి.. ఎంపీ పదవి దక్కింది.. చివరి ఏడాదైనా అనుకున్న కేంద్రమంత్రి పదవి వరించింది.. పైకి ఎన్ని చెప్పినా ఐదేళ్లు పదవులను అనుభవించడం కూడా పూర్తయింది.. ఇంకేముంది అనుకోకండి.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయనకు ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజలు, కార్యకర్తల ‘ఆత్మీయత’ గుర్తొచింది. కొల్లేరు సమస్యలను పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనను అడ్డుకోకుండా కాలాన్ని వెళ్లబుచ్చే ప్రయత్నం చేసిన కావూరి మళ్లీ ఎన్నికల కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తూ సరికొత్త వేషంతో ముందుకు వస్తున్నారు. ఆయన కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు. ఎవరికోసం ‘ఆత్మీయ’ సమావేశం తన రాజకీయ భవితను నిర్ణయించుకునేందుకు ఏలూరులో కావూరి ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏలూరు లోక్‌సభ పరిధిలోని కృష్ణా జిల్లాకు చెందిన కైకలూరు, నూజివీడు కాంగ్రెస్ శ్రేణులకు కబురు పంపించారు. నూజివీడులో ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు వర్గమే బలంగా ఉండడంతో కావూరి పిలుపునకు అక్కడి నుంచి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదు. కైకలూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల్లోని తన సామాజికవర్గం నుంచి ఏలూరు ఆత్మీయ సమావేశానికి గణనీయంగానే జన సమీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో కావూరి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో క్యాడర్, ప్రజల సూచన మేరకు తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాన్ని తీసుకుంటానంటూ ప్రతిపాదన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిని బట్టి తన రాజకీయం కోసమే ఈ సమావేశం ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం. టీడీపీలోకి వస్తే మాగంటి ఎటాక్.. కాంగ్రెస్ గుర్తుతో పోటీచేస్తే సీటు గల్లంతయ్యే అవకాశం ఉందని భావించిన కావూరి కనీసం పోటీ ఇచ్చినా పరువు దక్కుతుందన్న ఉద్దేశంతో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం మొదలైంది. అదే జరిగితే ఇప్పటికే టీడీపీలో ఏలూరు ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న మాజీమంత్రి మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) నుంచి రాజకీయ ఎటాక్ తప్పేలా లేదు. గతంలో ఇద్దరు కాంగ్రెస్‌లో కొనసాగినా.. అటు తరువాత కాంగ్రెస్, టీడీపీలో చేరొకరు ఉన్నా వీరద్దరి రాజకీయం కొల్లేరు చుట్టూనే తిరిగేది. కొల్లేరువాసుల ఓట్లకు వలవేస్తే గెలుపు సాధ్యమనుకునే వీరిద్దరూ కొల్లేరు రాజకీయాన్ని కొన్నేళ్లుగా చక్కగా పండిస్తున్నారు. ఇప్పటికే మాగంటి ఏలూరు టీడీపీ ఎంపీ టిక్కెట్ తనదే అన్న ధీమాలో ఉన్నారు. ఇంతలో కావూరి ఆ టికెట్ తనుకుపోయి తమ నాయకుడికి కైకలూరు ఎమ్మెల్యే టిక్కెట్‌తో సరిపెడతారేమోననే భయం మాగంటి బాబు అనుయూయుల్లో మొదలైంది. దీంతో కావూరి టీడీపీలోకి వస్తే వ్యతిరేకించేందుకు మాగంటి సైన్యం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అటు కావూరితో స్నేహ సంబంధాలు, ఇటు మాగంటితో పార్టీ సంబంధాలు కొనసాగిస్తున్న ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అవుతుందని కైకలూరులో అప్పుడే గుసగుసలు మొదలుకావడం కొసమెరుపు.