
ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్‌కు భారతీయ జనతా పార్టీ మంత్రులు రాజీనామా చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు, వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం రాజీనామాలు చేస్తారని తెలిపారు.
రేపు జరగనున్న కేబినేట్ భేటీలో కూడా మంత్రులు పాల్గొనరని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమేం చేసిందో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ కలసి వివరిస్తారని తెలిపారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో బీజేపీ నాయకులు చంద్రబాబు ప్రకటనపై అత్యవసరంగా భేటీ అయ్యారు.