సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాపై ప్రజలు, పార్టీలు ఎంత పోరాటం చేసినా దున్నపోతు మీద వాన పడినట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనుకుంటోందన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య తలాక్.. తలాక్ అయిపోయిందని జేసీ వ్యాఖ్యానించారు. విడాకులైన భార్యభర్తలు పిల్లల కోసం ఎలా మట్లాడుకుంటారో..తాము అలానే ఉంటామన్నారు.
ఇక భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రం లోకి వెళ్లడం తప్ప చేసేదేమి లేదన్నారు. రాజీనామాలతో ఒరిగేదేమి లేదని అభిప్రాయపడ్డారు. ఏ ఫ్రంట్‌కు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. మీడియా నారధ పాత్ర పోషిస్తోందని.. హోదా కోసం మీడియా చేసే హడావిడంతా వ్యాపారం కోసమే అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment