ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా | Eleven National educational institutions for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా

Published Tue, Jun 17 2014 7:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా

ఏపీకి 11 జాతీయ విద్యాసంస్థలు: గంటా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు 11 జాతీయ విద్యాసంస్థలు రప్పించేందుకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకోసం 8 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 25న కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తాము కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో తగ్గిన మెడికల్‌ సీట్లను తిరిగి అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తామని, దీనిపై కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement