బీజేపీతో కొనసాగుతోన్న టీడీపీ దోస్తీ | TDP Friendship With BJP In AP | Sakshi
Sakshi News home page

బీజేపీతో కొనసాగుతోన్న టీడీపీ దోస్తీ

Feb 13 2019 7:36 PM | Updated on Feb 13 2019 8:35 PM

TDP Friendship With BJP In AP - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌

పశ్చిమ గోదావరి జిల్లా: బీజేపీతో టీడీపీ దోస్తీ పూర్తిగా తెగినట్లు కనబడటం లేదు. టీవీ చర్చా కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ నాయకులు ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నా కూడా ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో బాహాటంగా పాల్గొంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తణుకు ఏరియా ఆసుపత్రిలో రూ.8.50 కోట్లతో నిర్మించిన మాతా శిశు విభాగాన్ని ఎమ్మెల్యే హోదాలో కామినేని ప్రారంభించారు.

కామినేని మంత్రిగా కాకుండా ఎమ్మెల్యే హోదాలో వేరే జిల్లాలోని నియోజకవర్గ ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వివరణ అడగగా తణుకు టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆహ్వానం మేరకే ప్రారంభోత్సవం చేశానని చెబుతున్నారు. అయితే కామినేని పార్టీ మారతారనే గుసగుసలు కూడా వినిపిస్తోన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తేగానీ ఎవరు ఏ పార్టీలోకి వెళ్లేది లేనిది తెలిసేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement