ముంబై: టాటా- మిస్త్రీ వివాదానంతర పరిణామాలలో మరో రాజీనామా చోటు చేసుకుంది. నాన్-ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ నిర్మాలయ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని టాటా గ్రూప్ మంగళవారం నివేదించింది. అక్టోబర్ 31, సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఈ సమాచారాన్నిటాటా కెమికల్స్ కంపెనీ కార్యదర్శి రాజీవ్ చందన్ బీఎస్ఈ ఫైలింగ్లో రిపోర్టు చేశారు.
కాగా లండన్ బిజినెస్ స్కూల్కు చెందిన ప్రొఫెసర్, నిర్మాలయ కుమార్ మిస్త్రీ ఏర్పాటు చేసిన ఎక్జిక్యూటివ్ కమిటీ (జీఈసీ) సభ్యులు. 2013 లో జీఈసీలో చేరిన టాటా గ్రూపు వ్యూహ రచనలో బాధ్యుడిగా ఉన్నారు. అయితే అక్టోబరు 24 న మిస్త్రీ తొలగించిన మరుక్షణమే ఈ కమిటీని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.
టాటా జీఈసీలో మరో రాజీనామా
Published Tue, Nov 1 2016 2:51 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
Advertisement