Non-Executive Director
-
దేశ ప్రగతి కొన్ని కంపెనీలపైనే ఆధారపడరాదు
ముంబై: దేశ అభివృద్ధి అన్నది కేవలం కొన్ని కంపెనీలు లేదా కొన్ని గ్రూపులపైనే ఆధారపడి ఉండరాదని ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. దేశమంతటా మరిన్ని కంపెనీలు వృద్ధి చెందేలా విస్తృతంగా ఉండాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థూలంగా చూస్తే ఆశావహంగానే కనిపించినా.. సూక్ష్మంగా చూస్తే కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. బారత కంపెనీలు రక్షణాత్మక ధోరణి కంటే పోటీతత్వంపైనే ఎక్కువ దృష్టి సారించాలని కోరారు. దీపావళి సందర్భంగా ఇన్వెస్టర్లకు ఉదయ్ కోటక్ ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు. కంపెనీలకు సాయం చేయడం ద్వారా ‘వెయ్యి పువ్వులు వికసించనివ్వండి’ అనే సామెతను ఆచరణ దాల్చేలా క్యాపిటల్ మార్కెట్లు చూడాలన్నారు. గతేడాది ఈక్విటీలు, ఫైనాన్షియల్ మార్కెట్లకు గొప్ప సంవత్సరంగా ఉండిపోతుందంటూ, ఇన్వెస్టర్లకు అద్భుతమైన రాబడులు వచి్చనట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్ధాన పతనాలకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాలన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు క్షీణిస్తుండడంతో అప్రమత్తతో కూడిన ఆశావహ ధోరణితో ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయంటూ, వీటిపై భారత్ ఓ కన్నేసి ఉంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ సైతం కేవలం కొన్ని గ్రూపులే కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. -
ఉదయ్ కొటక్ రాజీనామా
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు, ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఎండీ, సీఈవోగా వ్యవహరించారు. సెపె్టంబర్ 1 నుంచి ఆయన రాజీనామా అమలులోకి వచి్చందని బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్‌లో ఆయనకు 26 శాతం వాటా ఉంది. ఇక నుంచి నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉదయ్ కొటక్ వ్యవహరిస్తారని కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఎవరైనా 15 ఏళ్లు మాత్రమే ఆ పదవిలో పనిచేయాల్సి ఉంటుంది. గడువు కంటే 3 నెలల ముందే ఉదయ్ రాజీనామా చేయడం గమనార్హం. -
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి కేకే మహేశ్వరి రాజీనామా.. కారణం ఇదే!
వోడాఫోన్ ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'కృష్ణ కుమార్ మహేశ్వరి' తన పదవికి రాజీనామా చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 19న రాజీనామా చేసినట్లు తెలిసింది. కెకె మహేశ్వరి రాజీనామా చేయడానికి గల కారణాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ మహేశ్వరి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మహేశ్వరి వోడాఫోన్ ఐడియా బోర్డులో చేరటానికి ముందు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. (ఇదీ చదవండి: వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పిల్లల హవా! ఒకరిని మించి మరొకరు..) నష్టాల్లో మునిగిపోయిన టెలికాం కంపెనీలో కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సమ్మేళనానికి 18 శాతం వాటా ఉంది. 2022 మార్చి 03న వొడాఫోన్ ఐడియా బోర్డులోకి నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. జులైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూండ్రా నియమితులు కాగా, హిమాన్షు కపానియా ఆగస్టులో టక్కర్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. రుణాల భారం తగ్గింపునకు ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. -
టాటా జీఈసీలో మరో రాజీనామా
ముంబై: టాటా- మిస్త్రీ వివాదానంతర పరిణామాలలో మరో రాజీనామా చోటు చేసుకుంది. నాన్-ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ నిర్మాలయ కుమార్ తన పదవికి రాజీనామా చేశారని టాటా గ్రూప్ మంగళవారం నివేదించింది. అక్టోబర్ 31, సోమవారం నుంచి ఇది అమల్లోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఈ సమాచారాన్నిటాటా కెమికల్స్ కంపెనీ కార్యదర్శి రాజీవ్ చందన్ బీఎస్ఈ ఫైలింగ్‌లో రిపోర్టు చేశారు. కాగా లండన్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్, నిర్మాలయ కుమార్ మిస్త్రీ ఏర్పాటు చేసిన ఎక్జిక్యూటివ్ కమిటీ (జీఈసీ) సభ్యులు. 2013 లో జీఈసీలో చేరిన టాటా గ్రూపు వ్యూహ రచనలో బాధ్యుడిగా ఉన్నారు. అయితే అక్టోబరు 24 న మిస్త్రీ తొలగించిన మరుక్షణమే ఈ కమిటీని కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.