వోడాఫోన్ ఐడియా బోర్డులోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'కృష్ణ కుమార్ మహేశ్వరి' తన పదవికి రాజీనామా చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 19న రాజీనామా చేసినట్లు తెలిసింది. కెకె మహేశ్వరి రాజీనామా చేయడానికి గల కారణాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ మహేశ్వరి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అల్ట్రాటెక్ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మహేశ్వరి వోడాఫోన్ ఐడియా బోర్డులో చేరటానికి ముందు ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు.
(ఇదీ చదవండి: వ్యాపార రంగంలో ముఖేష్ అంబానీ పిల్లల హవా! ఒకరిని మించి మరొకరు..)
నష్టాల్లో మునిగిపోయిన టెలికాం కంపెనీలో కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సమ్మేళనానికి 18 శాతం వాటా ఉంది. 2022 మార్చి 03న వొడాఫోన్ ఐడియా బోర్డులోకి నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి కంపెనీలో కొన్ని మార్పులు జరిగాయి. జులైలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అక్షయ మూండ్రా నియమితులు కాగా, హిమాన్షు కపానియా ఆగస్టులో టక్కర్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment