గ్రేటర్లో బీజేపీకి షాక్ | goshamahal ex-mla resigned to BJP | Sakshi

గ్రేటర్లో బీజేపీకి షాక్

Published Thu, Jan 21 2016 3:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

గ్రేటర్లో బీజేపీకి షాక్ - Sakshi

గ్రేటర్లో బీజేపీకి షాక్

గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో... ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ మొదలైంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో... ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ మొదలైంది. టిక్కెట్లు దక్కని నాయకులు, వారి అనుచరులు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు.

గోషామహల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పార్టీకు రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికలలో తన అనుచరులకు టిక్కెట్లు కేటాయించకపోవడం వల్లే బీజేపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పని చేస్తున్న వారిని కాదని కొత్తగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో తాను మనస్తాపానికి గురైనట్లు రాథోడ్ తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాథోడ్ను బుజ్జిగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement