బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు | mangalhat police case filed against goshamahal BJP Mla | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Published Sat, May 2 2015 12:36 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు - Sakshi

బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథాపై మంగల్‌హాట్ పీఎస్‌లో శనివారం కేసు నమోదయింది. వివరాలు..మంగల్‌హాట్ పరిధిలోని బాలరామ్‌గల్లీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. మ్యారేజ్ పంక్షన్‌లో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని డీజేను ఆపేందుకు ప్రయత్నించాడు. డీజే ఆపేందుకు ప్రయత్నించగా పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై దాడి చేసి చంపుతానని బెదిరించాడని కానిస్టేబుల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement