GOSHAMAHAL
-
గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 26.30 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వం చేపడుతోంది. భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంత కుమారి సహా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.కొత్త ఉస్మానియా ఆసుప్రతిని పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా డిజైన్లు సిద్ధం చేశారు. మొత్తం 2 వేల పడకలతో గోషామహల్ స్టేడియంలో ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ భవన నిర్మాణం పూర్తయితే ఇప్పటివరకు శిథిలావస్థకు చేరి తరచూ పెచ్చులూడుతున్న పురాతన భవనంలో చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మల్టీ లెవల్ పార్కింగ్ మొత్తం 26.30 ఎకరాలకు గాను 15.84 ఎకరాల్లో ‘ఏ’బ్లాకును నిర్మించనున్నారు. అదే విధంగా 7.81 ఎకరాల్లో ‘బీ’బ్లాకు ను నిర్మించనున్నారు. 0.74 ఎకరాల్లో ‘సీ’బ్లాకు, 0.64 ఎకరాల్లో ‘డీ’బ్లాక్, 0.22 ఎకరాల్లో ‘ఈ’బ్లాకును నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మిగిలిన స్థలంలో మిగతా బ్లాకులు నిర్మిస్తారు. ఇన్‌పేషంట్, అవుట్ పేషంట్ సరీ్వసులతో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ పార్కింగ్ సౌకర్యంతోపాటు లాండ్ స్కేపింగ్, గార్డెన్లతో ఆసుపత్రిలో ఆహ్లాదకర వాతావరణం నెలకొననుంది.సహాయకులకు ధర్మశాల ఉచిత భోజనం ఓపీ, ఐపీ సేవలతో పాటు క్లిష్టమైన మూత్రపిండాలు, కాలేయం, స్కిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లు కూడా ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్చురీ, ఒకే గొడుగు కింద అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక డయాగ్నొస్టిక్స్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏకకాలంలో 3000–5000 మంది ఒకేచోట కూర్చొనే సామర్థ్యంతో కూడిన వెయిటింగ్ హాల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, దంత వైద్య కళాశాల కూడా ఇదే ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక వసతి గృహం..మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక వసతి గృహంతో పాటు రోగుల సహాయకులకు ఉచిత భోజనం సరఫరా చేసే ధర్మశాల కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఫైర్ స్టేషన్, పోలీసు అవుట్ పోస్టు, ఫ్యాకల్టీ రెసిడెన్సీ సహా బోయ్స్, బాలికల హాస్టళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త భవన నిర్మాణంతో రోగుల కష్టాలు పూర్తిగా తీరనున్నాయని తెలంగాణ వైద్యుల సంఘం ఉస్మానియా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు డాక్టర్ బొంగు రమేష్ నేతృత్యంలోని వైద్య బృందం గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. -
గోషామహల్ లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై పునరాలోచన చేయాలన్న పురుషోత్తం
-
గోషామహల్లో ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి శంకుస్థాపన వేళ గోషామహల్లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. గోషామహల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈరోజు ఉదయం 11.54 గంటలకు గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి గోషామహల్ స్టేడియం కాకుండా ఇంకెక్కడైనా నిర్మాణం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఉస్మానియ ఆసుపత్రి నిర్మాణంపై ముందుకెళ్లాలని స్థానికుల సూచిస్తున్నారు.మరోవైపు.. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్..‘ఇక్కడ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలి. గోషామహల్ గ్రౌండ్లో ఆసుపత్రి కడితే తమకు అనేక రోగాలతో పాటు, మార్చురీ వాసన వస్తుందని పక్కనే ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అక్కడున్న ప్రజలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాలి. అక్కడి ప్రజల గోడును వినండి. నేను కుంభమేళాలో ఉన్నందున నేటి కార్యక్రమానికి హాజరుకాలేపోతున్న అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పురుషోత్తంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ..‘ఆసుపత్రి నిర్మాణం చేయాలనుకోవడం మంచిదే. కానీ, గోషామహల్ వంటి ఇరుకైన ప్రాంతంలో కాదు. ఊపిరాడకుండా ఉండే ఇరుకు ఇండ్లు, రోడ్ల మధ్య ఆసుపత్రి నిర్మాణం సరికాదు. వర్షం వస్తే ఇక్కడి రోడ్లు నదులను తలపిస్తాయి. స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ నిర్ణయాన్ని పున:సమీక్ష చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. -
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మా'నయా' ఆస్పత్రి
-
ఉస్మానియా ఆస్పత్రి భవనం పోలీస్ గ్రౌండ్స్ లో నిర్మించవద్దని డిమాండ్
-
గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్‌కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఉన్న దాదాపు 32 ఎకరాల్లో కొత్త ఆసుపత్రిని నిర్మించాలని, ఇందుకు గాను వెంటనే ఆ భూమిని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పీడ్ (స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులపై తొలిసారిగా మంగళవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్పీడ్ ప్రణాళికలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణంతో పాటు కొత్తగా 15 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లకు తగినట్టుగా కొత్త ఆస్పత్రి‘రాబోయే 50 సంవత్సరాల అవసరాలను అంచనా వేసి దానికనుగుణంగా కొత్త ఆసుపత్రి డిజైన్‌ను రూపొందించాలి. ఆసుపత్రి నలుదిశలా రోడ్లు ఉండాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలి. ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలి. కేవలం కాంక్రీట్ భవంతులు, బహుళ అంతస్తులు మాత్రమే ప్రధానం కాదు. ఆహ్లాదకరమైన విశాలమైన ఖాళీ ప్రాంగణం ఎక్కువగా ఉండాలి. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అందుబాటులోకి రావాలి. ఇందుకు గాను అనుభవజు్ఞలైన ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు తయారు చేయించాలి. గోషామహల్ స్థలాన్ని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేసినందుకు గాను పోలీసు విభాగానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలి. పేట్లబురుజులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీల చుట్టూ ఉన్న స్థలాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. గోషామహల్‌లోని పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్సును అక్కడకు తరలించేలా చూడాలి. రాష్ట్రంలో కొత్త ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. 15 నర్సింగ్ కళాశాలల భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలి. కళాశాలలను తాత్కాలికంగా అద్దె భవనాల్లో నిర్వహించాలి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడతామని, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా హెరిటేజ్ కట్టడాలు గుర్తించి పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎస్‌హెచ్‌జీలకు కొత్త భవనాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు భవనాలు లేని 22 జిల్లాల్లో కొత్త భవనాలను నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి జిల్లా సమాఖ్యకు ఎకరం భూమి కేటాయించేందుకు అంగీకరించిన సీఎం.. ముందుగా స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం పక్కన మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడెకరాల స్థలాన్ని వెంటనే బదిలీ చేయాలని, మహిళా శక్తి సంఘాలు తయారుచేసే ఉత్పత్తులను అక్కడ ఏడాది పొడవునా అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ తరహాలో వివిధ రకాల ఉత్పత్తులను అక్కడ అందుబాటులో ఉంచాలని సూచించారు. వివిధ రంగాల ప్రముఖులు, జాతీయ స్థాయి నేతలు ఎవరు హైదరాబాద్‌కు వచ్చినా తప్పకుండా ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. -
ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడం ఖాయం: రాజాసింగ్
-
ప్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం
-
బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్ నంబర్ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు. తనకు ఫోన్ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్‌పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు చదవండి: మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు -
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల చేయబోతున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. దాదాపు 40-50 మందితో కూడిన తొలి జాబితా ప్రకటించనున్నారని...ఆ లిస్ట్‌లో తన పేరు ఉంటుందని పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనకు మద్దతుగా ఉందని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో బుధవారం రాజాసింగ్ మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయనున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. తాను స్ఫస్పెన్షన్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన గోషామహల్ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కంటే ఈసారి రెట్టింపు మెజారిటీతో గోషామహల్ నుంచి గెలువబోతున్నట్లు పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక బయటి నుంచి తెచ్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఇంకా దొరకడం లేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలివి: రాహుల్ గాంధీ -
రవీందర్‌కు సీరియస్.. విధుల బహిష్కరణకు హోంగార్డ్ జాక్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: జీతాల ఆలసత్వంపై ఆవేదనతో.. ఆత్మహత్యకు ప్రయత్నించిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న హోంగార్డు జేఏసీ ఆస్పత్రికి చేరుకోగా.. బుధవారం ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీందర్‌కు మద్దతుగా.. ఉస్మానియా హాస్పిటల్‌కు భారీగా తరలి రావాలని హోం గార్డ్ JAC పిలుపు ఇచ్చింది. అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా విధుల బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. అదే సమయంలో.. హోంగార్డులు ఎవరు అఘాయిత్యాలకు ప్రయత్నించొద్దని విజ్ఞప్తి చేసింది. జేఏసీ పిలుపు మేరకు హోంగార్డులు ఉస్మానియాకు తరలి వస్తున్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ఆస్పత్రికి భారీగా చేరుకుంటున్నాయి పోలీస్ బలగాలు. సకాలంలో జీతం రావట్లేదనే ఆవేదనతో చాంద్రాయణగుట్ట ట్రాఫిక్పీఎస్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రవీందర్ పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. 55 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడరు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం గోషామహల్‌లోని ఓ ఏటీఎంకు వెళ్లి తన బ్యాంకు ఖాతాను చూసుకోగా ఇంకా జీతం పడలేదు. వెంటనే గోషామహల్లోనే ఉన్న హోంగార్డు కమాండెంట్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందితో తన జీతం గురించి వాకబు చేశాడు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జీతం డబ్బులు జమ అవుతాయని వారు బదులిచ్చారు. అయినప్పటికీ ఆవేదనకు గురైన రవీందర్ సీసాలో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మరోవైపు హోంగార్డులను పర్మినెంట్ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై అధికార కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది హోంగార్డుల జేఏసీ. ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే రాజాసింగ్ హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) మాట్లాడుతూ.. హోంగార్డ్ రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలి అని డిమాండ్ చేశారు. హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణలో పనిచేస్తోన్న 22వేల హోంగార్డులను పర్మినెంట్ చేయాలన్నారు. మరొక హోంగార్డు రవీందర్ మాదిరి ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. -
Political Corridor: గోషామహల్ జెండా ఎవరిది?
-
Hyderabad : గోషామహల్లో నాలా కుంగిన దృశ్యాలు
-
నిబంధనల మేరకు నాలాలను నిర్మిస్తాం: మంత్రి తలసాని
-
హైదరాబాద్ గోషామహల్లో కుంగిపోయిన పెద్ద నాలా
-
Hyderabad: గోషామహల్లో కుంగిన పెద్ద నాల
హైదరాబాద్: నగరంలోని గోషామహల్లో గల పెద్ద నాల కుంగిపోయింది. దాంతో నాలాపై ఉన్న కార్లు, ఆటోలు, బైక్‌లు సైతం ధ్వంసమయ్యాయి. శుక్రవారం కావడంతో గోషామహల్ బస్తీలో మార్కెట్ ఏర్పాటు చేశారు. సంతమార్కెట్ దుకాణాలు నాలపై ఉండటంతో ఆ దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. నాలా కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పెద్దనాలా కుంగిన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. మార్కెట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన జనాలను ఇళ్లను తరలిస్తున్నారు. -
Raja Singh: చేటు తెచ్చిన మాటలు!.. 2018లో ఒకే ఒక్కడు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వైఖరి.. రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. తాజాగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఓ వర్గంపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఆ వర్గం వారు తరచూ నగర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింది. బక్రీద్ సందర్భంగానూ ఆయన ప్రత్యేకంగా యువకులతో గోరక్షక దళాలు ఏర్పాటు చేసి నగరానికి ఆనుకొని ఉన్న టోల్గేట్లు, నగరంలోకి ప్రవేశించే అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై గస్తీ ఏర్పాటు చేస్తారని.. ఓ వర్గం వారిపై దాడులకు పాల్పడతారన్న అపవాదు ఆయనపై ఉంది. ఈ విషయంలోనూ ఆయనపై దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నగరంలో సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీకి రాజాసింగ్ తీరుతో కొన్నిసార్లు మేలు జరగ్గా.. మరికొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2018లో ఒకే ఒక్కడు.. రాజాసింగ్ రెండుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో అంబర్పేట్ బరిలో నిలిచిన ప్రస్తుత కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ముషీరాబాద్ బరిలో నిలిచిన ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌లు టీఆర్ఎస్ వేవ్ కారణంగా ఓడిపోయినా.. రాజాసింగ్ గెలిచి సత్తా చాటారు. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
జీహెచ్ఎంసీలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి ఫింగర్ ప్రింట్ల స్కామ్ కలకలం రేగింది. శానిటైజేషన్ కార్మికుల హాజరులో గోల్మాల్ వెలుగు చూసింది. కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరైనట్లు చేసిన వైనం బయటపడింది. సింథటిక్ ఫింగర్ ప్రింట్లు వాడి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు గోషామహల్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ వెంకటరెడ్డి. పోలీసులు సుమారు 21 మంది ఫింగర్ ప్రింట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది. -
రాజాసింగ్ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. దీనిపై ఆయన సోమవారం సిటీ సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ తన పేరుతో ఓ ఫేస్బుక్ ఖాతా నిర్వహిస్తున్నారు. తన కార్యకలాపాలు, సందేశాలతో ఎప్పుడూ అప్డేట్ చేసే దీనిని దాదాపు ఐదు లక్షల మంది లైక్ చేయగా.. వేల మంది ఫ్రెండ్, ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫేస్బుక్ ఖాతా రాజాసింగ్‌కు చెందిన ఓ మెయిల్‌తో లింకై ఉంది. సోమవారం ఈయనకు హఠాత్తుగా ఆ ఫేస్బుక్ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్ చేయడానికి ప్రయత్నించగా... పాస్వర్డ్ మారినట్లు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్బుక్ ఖాతాను కొందరు హ్యాక్ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజాసింగ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్ బుక్ హాక్ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎంఐఎం పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించాడు. గోషామహల్ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కారెక్కనున్న ముఖేష్?
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మూల ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. గత ఏడాదిన్నర కాలంగా సందిగ్ధంలో ఉన్న ముఖేష్ ఎట్టకేలకు కారెక్కేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నగరానికి చెందిన ఓ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాయబారం నడిపి చేరికకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. సాక్షి, హైదరాబాద్: గోషామహల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాల నేపథ్యంలో స్థానిక కార్యకర్తల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముఖేష్ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్ 47 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది. ఎంపీ రాయబారంతో గ్రీన్ సిగ్నల్... తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ అధ్యక్షుడు, నగరానికి చెందిన ఒక పార్లమెంట్ సభ్యుడు ముఖేష్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్పించేందుకు కేసీఆర్ వద్ద రాయబారం నడిపినట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఆ ఎంపీ కేసీఆర్‌కు నచ్చజెప్పడంతో ముఖేష్‌గౌడ్‌ను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంజే మార్కెట్లోని తన కార్యాలయంలో ఈ నెల 15వ తేదీన ముఖేష్‌గౌడ్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో సమావేశం కానున్నారు. అనంతరం టీఆర్ఎస్లో చేరే తేదీని ప్రకటిస్తారని తెలిసింది. -
గోషామహల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలు
-
భారీ స్పందన
నగర ట్రాఫిక్ మెగా లోక్ ఆదాలత్‌కు విశేష స్పందన లభించింది. గోషా మహల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మెగాలోక్ ఆదాలత్ ప్రారంభం తొలిరోజునే బుధవారం దాదాపు 40 లక్షల ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లో ప్రగ్యా సందడి
హైదరాబాద్: సినీ నటి కంచె ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సందడి చేసింది. శనివారం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు రూపొందించిన హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ మొబైల్ యాప్‌ను ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరికి ట్రాఫిక్‌పై అవగాహన ఎంతో అవసరమన్నారు. ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... చలాన్లు రాయడమే లక్ష్యం కాదని ప్రజల్లో మార్పు తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నగరంలో రోజుకు సగటున 600 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. న్యూయర్క్ జనాభా హైదరాబాద్ నగర జనాభాకు సమానమని, కానీ అక్కడి కంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
దోపిడీకి యత్నించిన ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్
జల్సాలకు అలవాటు పడి స్నేహితులతో కలిసి బంధువుల ఇంట్లోనే దోపిడీకి యత్నించిన ఏడుగురు సభ్యుల ముఠాను మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. మలక్‌పేటలోని సలీంనగర్‌కు చెందిన ప్రియంతోష్నివాల్ బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ తోష్నివాల్ దొంగతనం చేసేందుకు పథకం రూపొందించాడు. తన ఇంటి సమీపంలో ఉండే దూరపు బంధువు రతన్‌దేవి తోష్నివాల్ను టార్గెట్ చేశారు. గోషామహల్‌కు చెందిన సూరబ్ అగర్వాల్, రేఖా అగర్వాల్, తీగలగూడకు చెందిన మహ్మద్ జాఫర్, అంబర్‌పేటకు చెందిన ఫిరోజ్ ఖాన్, హర్షల్ శర్మ, మలక్‌పేట్‌కు చెందిన మహ్మద్ అతిక్, మహ్మద్ సైఫ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గత నెల 29న రతన్ దేవి ఇంటికి పెళ్లి సంబంధం సాకుతో ఇంటిలోనికి ప్రవేశించారు. అదను చూసి రతన్‌దేవి నోరుకు ప్లాస్టర్ వేసి దోపిడీకి యత్నించారు. ఆ సమయంలో బాత్రూం నుంచి బయటకు వచ్చిన రతన్ దేవి కుమారుడు యాష్ తోష్నివాల్ సంఘటనను గమనించి కేకలు వేయడంతో ఆగంతకులు పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చే శారు. సంఘటన జరిగిన ఇంటి సమీపంలో సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి, అనంతరం చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైక్‌లు, 7 సెల్ఫోన్లు స్వాధీన పరుచకున్నట్లు తూర్పు మండల డీసీపీ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. -
గ్రేటర్లో బీజేపీకి షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో... ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ మొదలైంది. టిక్కెట్లు దక్కని నాయకులు, వారి అనుచరులు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. గోషామహల్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పార్టీకు రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికలలో తన అనుచరులకు టిక్కెట్లు కేటాయించకపోవడం వల్లే బీజేపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పని చేస్తున్న వారిని కాదని కొత్తగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో తాను మనస్తాపానికి గురైనట్లు రాథోడ్ తెలిపారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ రాథోడ్‌ను బుజ్జిగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. -
’సాక్షి’ని చూసి బ్రోకర్లు పరుగులు
-
విఠల్‌రావుకు కన్నీటి వీడ్కోలు
* ప్రభుత్వం తరపున రమణాచారి నివాళులు * ప్రభుత్వ అవార్డు, నగదు అందజేత హైదరాబాద్: గజల్ గానగంధర్వుడు విఠల్‌రావును కడసారి చూసేందుకు ఆయన శిష్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని గోషామహల్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. శనివారం అశ్రునయనాల మధ్య ఆయన నివాసం నుంచి ఆయన అంతిమయాత్ర పురానాపూల్‌లోని శ్మశానవాటిక వరకు సాగింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచారి విఠల్‌రావు భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సం దర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డు, రూ.1,16,000 నగదును ఆయన భార్య తారాబాయికి అందజేశారు. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ దేశ విదేశాలలో ప్రఖ్యాత గాయకుడిగా పేరు ప్రఖ్యాతలు అందుకున్న విఠల్‌రావు అకాల మరణం రాష్ట్రానికి తీరనిలోటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అవార్డు, నగదుతో సత్కరించాలనుకుందన్నారు. అయితే ఆ రోజు కార్యక్రమానికి ఆయ న రాలేదని, కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పుడు వాటిని అందజేసినట్లు వివరించారు. కన్నీటి వీడ్కోలు... నిజాం కాలం నుంచి గోషామహల్లో నివాసముంటూ.. కొద్ది రోజు లుగా అదృశ్యమై అకాల మరణం చెందిన విఠల్‌రావు పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం శని వారం ఉదయం ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ఆయన అభిమానులు తండోపతండాలుగా చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. మధ్యాహ్నం 2గంటలకు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి బయలు దేరి శిష్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య యాత్ర మధ్యాహ్నం 3 గంటలకు పురానాపూల్ శ్మశానవాటికకు చేరుకుంది. అక్కడ పండిట్ విఠల్‌రావుకు వేలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. -
బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథాపై మంగల్హాట్ పీఎస్‌లో శనివారం కేసు నమోదయింది. వివరాలు..మంగల్హాట్ పరిధిలోని బాలరామ్‌గల్లీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. మ్యారేజ్ పంక్షన్లో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడంతో స్థానికులు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో పోలీస్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని డీజేను ఆపేందుకు ప్రయత్నించాడు. డీజే ఆపేందుకు ప్రయత్నించగా పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై దాడి చేసి చంపుతానని బెదిరించాడని కానిస్టేబుల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అమరులైన పోలీసులకు భారీ ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ : విధి నిర్వహాణలో అమరులైన పోలీసులకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా భారీగా పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... విధి నిర్వహాణలో కానిస్టేబుల్ ఆపై సిబ్బంది మరణిస్తే రూ. 25 లక్షల నుంచి రూ. 40 లక్షలు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు రూ. 30 లక్షలు నుంచి రూ. 45 లక్షలు డీఎస్పీ స్థాయి అధికారికి రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షలు, అలాగే ఐపీఎస్ అధికారులకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కానిస్టేబుళ్లకు రోజువారి చెల్లిస్తున్ జీతం రూ. 90 నుంచి రూ. 250కి పెంచుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య భద్రత కింద ప్రస్తుతం ఉన్న రూ. లక్షను రూ. 5 లక్షలు పెంచుతున్నట్లు చెప్పారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండేది పోలీసులేని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు దేవునితో సమానమన్నారు. పోలీసు వ్యవస్థను చెడుగా చూడటం దేశానికి అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సింగపూర్ తరహాలో పోలీసులు వ్యవస్థను పటిష్ట పరుస్తామన్నారు. సమాచార వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు. ప్రజలు ధన,మాన, ప్రాణలను సంరక్షించడంలో విజయం సాధించాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, హోం మంత్రి నాయని నరసింహరెడ్డితోపాటు పలువురు మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
అమరులైన పోలీసులకు భారీ ఎక్స్‌గ్రేషియా
-
హైదరాబాద్ గోషామహల్లో అగ్నిప్రమాదం
-
సిట్టింగ్ సీట్లకు బైబై!
ఖైరతాబాద్, గోషామహల్లను వీడే యోచనలో దానం, ముఖేష్ నాంపల్లి, ముషీరాబాద్ నుంచి పోటీ? అప్జల్‌సాగర్‌లో రేపు దానం కీలక సమావేశం సాక్షి, సిటీబ్యూరో: స్థానికంగా వ్యతిరేకత.. గతం లో సహకరించిన మిత్రపక్షం దూరం కానుండ టం.. వెరసి నగర కాంగ్రెస్ పార్టీలో వీవీఐపీల పరి స్థితి డైలమాలో పడింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్లీ గెలవలేమన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ నాంపల్లిపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం నాంపల్లి నియోకజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అఫ్జల్‌సాగర్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాను ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కోసం పనిచేసిన వారందరినీ ఈ సమావేశానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఖైరతాబాద్ నియోకజవరగలో గడిచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టకపోవటం, స్థానిక నాయకుల ప్రవర్తన పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డపేరు తేచ్చింది. దీనికి తోడు మైనారిటీ, సీమాంధ్రుల మనోభావాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండటంతో దానం తనకు ఖైరతాబాద్ సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖేష్ సైతం.. మరో తాజా మాజీ మంత్రి మూల ముఖేష్‌గౌడ్ సైతం ప్రస్తుత గోషామహల్ స్థానాన్ని వీడే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గత ఐదేళ్లలో గోషామహల్ వాసులకు అందుబాటులో ఉండకపోవటం ఆయనకు మైనస్ కానుంది. దీనికితోడు గత ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపకుండా ముఖేష్‌కు సహకరించిన ఎంఐఎం, తదనంతర పరిణామాలతో ఆయన తీరుపై గుర్రుగా ఉంది. ఈ స్థానంలో ఎంఐఎం సహకారం లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లే దు. ఈ కారణంగానే ముఖేష్ స్థానమార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ జారీ అయి పోలింగ్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ ముఖేష్ నియోకజవర్గంలో కార్యకర్తలు, నాయకులకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ఆయన కుమారుడు విక్రమ్‌గౌడ్ కొంతమంది నాయకులను కలిసి వెళ్తున్నారు. ముఖేష్‌గౌడ్ ఆశిస్తున్నట్లుగా సికింద్రాబాద్ లోక్‌సభ లేదా ముషీరాబాద్ శాసనసభ స్థానంలో ఏదో ఒకటి తనకు కేటాయించక, గోషామహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తన కుమారుడు విక్రంగౌడ్‌ను బరిలోకి దించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు. -
జోరువాన
సాక్షి, సిటీబ్యూరో:కుండపోత వాన నగరంలో బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి పొద్దుపోయే వరకు ఎడ తెరిపిలేకుండా కురిసింది. మూడు రోజులుగా అక్కడక్కడా కురిసిన వాన సోమవారం ఉగ్రరూపం దాల్చింది. పలుచోట్ల ప్రధాన రోడ్లు కాల్వలను తలపించాయి. వాహనాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించుకొంటూ బాధితులు రాత్రంతా జాగారం చేశారు. పురాతన భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. సాయంత్రం వేళ ఉద్యోగులు, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాల్సిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రవాణా సాధనాలుఅందుబాటులో లేక మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. రాదారులన్నీ గోదారులు వర్షపు నీటి ఉధృతితో ఉగ్రరూపం దాల్చిన మూసీ చాదర్‌ఘాట్ ప్రధాన బ్రిడ్జికి పక్కనే ఉండే కాజ్వే (చిన్న వంతెన)ను ముంచెత్తింది. మోకాళ్ల లోతున నీళ్లు ప్రవహించాయి. అటుగా వెళ్లే వాహనాలను గోల్నాక వైపు మళ్లించారు మలక్‌పేట గంజ్ ప్రాంతంలో మెట్రో పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన గుంతల్లో భారీగా వరదనీరు చేరి రోడ్డు కుంగిపోయింది. అందుటో మెట్రో రైలు పనుల కోసం ఏర్పాటు చేసిన బార్కేడ్ పడడంతో మలక్‌పేట-చాదర్‌ఘాట్ రూట్లో రాకపోకలు స్తంభించాయి. మలక్‌పేట రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరింది. టోలిచౌకి, పాత ముంబై రహదారి నీట మునిగాయి. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, సాగర్ రింగ్రోడ్లపైనా భారీగా వర్షపునీరు చేరింది అత్తాపూర్‌లోని మల్లయ్య టవర్స్ అపార్ట్మెంట్ సెల్లార్ నీట మునిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే 190వ పిల్లర్ ప్రాంతంలో భారీగా వర్షపు నీళ్లు చేరాయి. రాజేంద్రనగర్ పరిధిలోని హసన్‌నగర్, శివరాంపల్లి, రాంబాగ్, సులేమాన్‌నగర్, మారుతినగర్, ప్రియదర్శిని కాలనీల్లోని వంద కు పైగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాలను నగర మేయర్ మాజిద్ హుస్సేన్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎల్బీనగర్, గోషామహల్, అబిడ్స్, సంతోష్‌నగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి లోతట్టు ప్రాంతాలు మునక.. అంధకారం గోల్కొండ మోతి దర్వాజ, గుడిమల్కాపూర్ మార్కెట్, మందుల బస్తీ, నదీంకాలనీ, అంజయ్యనగర్, భోజగుట్ట, తాళ్లగడ్డ ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. కొన్నిచోట్ల వర్షపు నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్ మూతలు తెరవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మలక్‌పేట, ఓల్డ్‌మలక్‌పేట, పాత నగరంలోని ఛత్రినాక, శివగంగానగర్, అరుంధతినగర్, సాయిబాబానగర్, క్రాంతినగర్, గౌలిపురా, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. బంజారాహిల్స్ పరిధిలోని బస్తీలు ముంపు బారినపడ్డాయి. ఎడతెరిపి లేని కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. మరోపక్క నాలాలు, ఓపెన్ డ్రైనేజీల్లో వరద నీరు పోటెత్తింది. కూకట్పల్లినాలా, బంజారా, పికెట్, బల్కాపూర్ నాలాలు పొంగిపొర్లడంతో రహదారులపైకి మోకాళ్లలోతు నీరు చేరింది. ఇంకోవైపు శివారు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలుచోట్ల అంధకారం అలుముకుంది. వర్షం కారణంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టడం వీలుకాకపోవడంతో జనం రాత్రి వేళ నరకయాతన అనుభవించారు.