ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రగ్యా సందడి | Pragya Jaiswal hulchul in traffic training centre | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రగ్యా సందడి

Published Sat, Jun 4 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రగ్యా సందడి

ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రగ్యా సందడి

హైదరాబాద్: సినీ నటి కంచె ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సందడి చేసింది. శనివారం గోషామహల్‌లోని  ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాఫిక్ రూల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల ట్రాఫిక్ పోలీసులు రూపొందించిన హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్ మొబైల్ యాప్‌ను ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరికి ట్రాఫిక్‌పై అవగాహన ఎంతో అవసరమన్నారు. ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... చలాన్లు రాయడమే లక్ష్యం కాదని ప్రజల్లో మార్పు తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నగరంలో రోజుకు సగటున 600 వాహనాల రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని తెలిపారు. న్యూయర్క్ జనాభా హైదరాబాద్ నగర జనాభాకు సమానమని, కానీ అక్కడి కంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాల సంఖ్య మూడింతలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement