డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్ బేబి రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. రాజీనామాను గవర్నర్ కార్యదర్శి బ్రిజేశ్‌కుమార్ సంత్ ధ్రువీకరించారు. అయితే ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు సమాచారం.
చదవండి: ఏపీ పర్యాటకానికి ప్రత్యేక యాప్.. మంత్రి అవంతి
1956లో జన్మించిన బేబీ రాణి మౌర్య 2018 ఆగస్టు 26వ తేదీన ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతనెలలో ఆమె గవర్నర్‌గా మూడేళ్లు పూర్తి చేసుకున్నారు. బేబీ రాణి గతంలో అనేక పదవులు చేపట్టారు. ఆగ్రా మేయర్‌గా పని చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సమాజ్ రత్న, ఉత్తరప్రదేశ్ రత్న, నారీ రత్న అవార్డులు పొందారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది.
చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. నిద్రలోనే బూడిదైన ఖైదీలు
ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా
Published Wed, Sep 8 2021 3:53 PM | Last Updated on Wed, Sep 8 2021 4:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment