జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్‌మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment