అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా నేడు కర్నూలు జిల్లా బంద్ కొనసాగుతోంది.
కర్నూలు: అధికార పార్టీ హత్యారాజకీయాలకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేడు కర్నూలు జిల్లా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జీ చెరకులపాడు నారాయణ రెడ్డి హత్యపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం జిల్లాలో ర్యాలీలు, ధర్నాలు చేపడుతోంది.
బంద్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక... ప్రతిపక్ష పార్టీ నేతలను అంతమొందించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకుందామనే ధోరణిలో అధికార పార్టీ ఉందని మండిపడ్డారు. మరోవైపు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.