సుల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య | TRS Leader Murdered In Vikarabad | Sakshi
Sakshi News home page

సుల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నేత దారుణ హత్య

Published Tue, Nov 6 2018 10:06 AM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌ నాయకుడు నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. నారాయణ రెడ్డి వర్గానికి, గ్రామంలోని ఓ సామాజిక వర్గానికి గత కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. గతంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలపై కూడా పోలీసు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థులే నారాయణ రెడ్డిని హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement