ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెంలో సోదరుడి చేతిలో దాడికి గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెంలో సోదరుడి చేతిలో దాడికి గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉమ్మడి పొలంలో గడ్డివాము విషయమై నారాయణరెడ్డి, అతడి పెద్దన్నయ్య పెద్ద వీర నారాయణరెడ్డి మధ్య శుక్రవారం సాయంత్రం వివాదం జరిగింది. మంచంకోడుతో నారాయణరెడ్డి సోదరుడిపై దాడిచేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన పెద్ద వీరనారాయణరెడ్డిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.