వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు తలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు.
ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
కర్నూలు(హాస్పిటల్): వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు తలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో ఆయన తలపై మోది హతమార్చారు. అనంతరం వేటకొడవళ్లతో తలను ఛిద్రం చేసినట్లు సోమవారం నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రాథమికంగా తేలింది. పూర్తిస్థాయి నివేదికను కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్‌ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణ రూపొందిస్తున్నారు.