ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల చూచిరాతలకు బాధ్యులను చేస్తూ కలెక్టర్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్‌లోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల శిక్షణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశా రు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.రవీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధ్యాయుల మ నోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని అన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సత్యానారాయణగౌ డ్, వెంకట్, దర్శనం దేవేందర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
దిలావర్‌పూర్ : పదో తరగతి పరీక్షల్లో ఇ న్విజిలేటర్లు, ఛీఫ్‌సూపరింటెండెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని గు రువారం దిలావర్‌పూర్‌లో ఉపాధ్యాయు లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో ఎన్నికల శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మార్సీ ఎదుట నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు హరిప్రసాద్, శ్రీనివాస్, రాజశేఖ ర్, వెంకటరమణారెడ్డి, కిషన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సంఘాల ధర్నా
నేరడిగొండ : పదో తరగతి పరీక్ష కేంద్రా ల్లో మాస్‌కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్లను బాధ్యులను చేస్తూ వారిని కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు గురువారం ఎంఈవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీఆర్టీ యూ, పీఆర్టీయూ, టీయూటీఎఫ్, డీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నేత లు నూర్‌సింగ్, నారాయణగౌడ్, శరత్‌శ్చందర్, సుభాష్‌రెడ్డి, రమేశ్, గణేశ్ మా ట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థినుల ను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహి ళా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సస్పెన్షన్ ఎత్తివేయాలి
Published Fri, Apr 4 2014 12:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement