satyanarayana goud
-
సత్తన్న ఇంటికి ‘కోమటిరెడ్డి’
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీచైర్మన్ శోభారాణి, బీఆర్ఎస్ రాష్ట్రనేత సత్యనారాయణగౌడ్ దంపతులను మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి కలిశారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సత్తన్న ఇంటికి వెళ్లి ఇటీవల కిడ్నీలో రాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న సత్యనారాయణగౌడ్‌ను పరామర్శించారు. ఆయన వెంట బీజేపీ ముధోల్ నియోజకవర్గ నేత రామారావుపటేల్, తదితరులు ఉన్నారు. రాజకీయమేమీ లేదు.. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేసిన నేతగా గుర్తింపు ఉన్న సత్యనారాయణగౌడ్ ఇంటికి రాజ్‌గోపాల్‌రెడ్డి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీఆర్ఎస్తో అంటీముట్టనట్టుగా ఉంటున్న సత్తన్న బీజేపీలో చేరుతారా..? ఆదిలాబాద్ పార్లమెంట్‌ను దత్తత తీసుకుంటానని పలుమార్లు ప్రకటించిన కోమటిరెడ్డి అదే విషయంలో ఈయన ఇంటికి వచ్చారా..? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ‘సాక్షి’వివరణ కోరగా సత్యనారాయణగౌడ్ కొట్టిపారేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డి బంధువు తనకు క్లాస్మేట్ అని, ఆక్రమంలో ముందునుంచీ తమకు కొంత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆదిలాబాద్ మీటింగ్‌కు వెళ్లి వస్తూ ఆరోగ్య సమాచారం దృష్ట్యా తనను పరామర్శించడానికి మాత్రమే ఆయన వచ్చారని వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పార్టీల చర్చే తమ మధ్య రాలేదన్నారు. తొలిసారి తన ఇంటికి వచ్చినందున శాలువా, జ్ఞాపికతో సత్కరించానని అన్నారు. -
మంత్రి మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): బాధ్యతగల మంత్రిగా కొనసాగుతున్న మల్లారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్ అన్నారు. గురువారం సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అధికార పార్టీనేతలు, మంత్రివర్గంలో వణుకు పుడుతోందన్నారు. ప్రజాభిమానం పొందుతున్న టీపీసీసీ ప్రెసిడెంట్‌పై బహిరంగంగా మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేనిపక్షంలో ప్రజలచే సరైన గుణపాఠం చెబుతామన్నారు. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: దిశ ఎన్‌కౌంటర్‌పై నేడు విచారణ -
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాల్పుల కలకలం
-
నాలుగు స్తంభాలాట..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల ఆధిపత్యానికి నిర్మల్ వేదికవుతోంది. సీనియర్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన కె.శ్రీహరిరావు ఇప్పుడు ఎవరికి వారే తమ ప్రాబ ల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాల్లో నిమగ్నం కావడంతో నిర్మల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ జిల్లా కేంద్రంగా పేరొందిన నిర్మల్‌లో అధికార పార్టీలో నాలుగు స్తంభాలాట కొనసాగుతోంది. టీఆర్ఎస్లోని పలువురు ముఖ్యనేతలు ఈ నియోజకవర్గానికే చెం దినవారు కావడం, ఇతర నియోజకవర్గాల నేతలు కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గంపైనే దృష్టి సారించడంతో ఆ పా ర్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏ నే త వైపు మొగ్గుచూపితే రానున్న రోజుల్లో భవిష్యత్తుఎలా ఉం టుందోనని నాయకులు అయోమయానికి గురవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా గతంలో కె.శ్రీహరిరావు కొనసాగారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు కావడం.. బీఎస్పీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ యం సాధించిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరి కీలకంగా మారడం జరిగిపోయింది. సీనియర్ నేతగా పేరున్న ఇంద్రకరణ్‌రెడ్డికి ఇక్కడ గట్టి అనుచరవర్గం ఉంది. అలాగే చాలా ఏళ్ల నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాల్లో శ్రీహరిరావు నిమగ్నమయ్యారు. దీంతో ఇక్కడ పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు షురువయ్యాయి. పక్షం రోజుల క్రితం ఈ రెండు వర్గాలకు చెందిన ఒకరిద్దరు కార్యకర్తలు ఈజ్గాంలో బహిరంగంగానే గొడవకు దిగినట్లు సమాచారం. కాగా ఆ పార్టీ మరో అగ్రనేత వేణుగోపాలచారి కూడా ఈ మధ్య కాలంలో నిర్మల్పైనే దృష్టి సారించారు. ముథోల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. విఠల్‌రెడ్డి ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. దీంతో చారి ప్రస్తుతం నిర్మల్‌పై దృష్టి సారించినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యేగా ఓటమి పాలైనప్పటికీ.. అధినేత కేసీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవిని సాధించుకున్న చారి ఇప్పుడు తరచూ నిర్మల్‌లో పర్యటిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చ కు దారితీస్తోంది. గతంలో ఆయన టీడీపీలో పనిచేసినప్పు డు ఉన్న అనుచరులతో కలిసి తన క్యాడర్‌ను పెంచుకునే దిశ గా దృష్టి సారించారు. ఈ ముగ్గురికి తోడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభారాణి భర్త సత్యనారాయణగౌడ్ ప్రాబల్యం కూ డా ఈ మధ్య కాలంలో నిర్మల్‌లో చాలా వరకు పెరిగింది. ఈ ముగ్గురు నేతలకు దీటుగా సత్యనారాయణగౌడ్ అనుచరవర్గం బలోపేతం అవుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో అధికార పార్టీలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ముఖ్యనేతల్లో షురువైన ఆధిపత్య పోరు.. ఇంకా రచ్చకెక్కకపోయినా, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు ఊపందుకున్నాక పరిస్థితి ఎలా ఉంటుందోననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
సస్పెన్షన్ ఎత్తివేయాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల చూచిరాతలకు బాధ్యులను చేస్తూ కలెక్టర్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారని, ఆ సస్పెన్షన్లు ఎత్తివేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఆదిలాబాద్‌లోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల శిక్షణ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశా రు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినదించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బి.రవీంద్ర మాట్లాడుతూ కలెక్టర్ ఉపాధ్యాయుల మ నోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు మార్చుకోవాలని అన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుల సత్యానారాయణగౌ డ్, వెంకట్, దర్శనం దేవేందర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన దిలావర్పూర్ : పదో తరగతి పరీక్షల్లో ఇ న్విజిలేటర్లు, ఛీఫ్‌సూపరింటెండెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని గు రువారం దిలావర్పూర్లో ఉపాధ్యాయు లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాల యంలో ఎన్నికల శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మార్సీ ఎదుట నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు హరిప్రసాద్, శ్రీనివాస్, రాజశేఖ ర్, వెంకటరమణారెడ్డి, కిషన్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ధర్నా నేరడిగొండ : పదో తరగతి పరీక్ష కేంద్రా ల్లో మాస్‌కాపీయింగ్‌కు ఇన్విజిలేటర్లను బాధ్యులను చేస్తూ వారిని కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు గురువారం ఎంఈవో కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. టీఆర్టీ యూ, పీఆర్టీయూ, టీయూటీఎఫ్, డీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నేత లు నూర్సింగ్, నారాయణగౌడ్, శరత్‌శ్చందర్, సుభాష్‌రెడ్డి, రమేశ్, గణేశ్ మా ట్లాడారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థినుల ను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహి ళా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. సస్పెండైన ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.