డిండి: పాలమూరు-డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రిజర్వాయర్లపై నల్లగొండ జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి సమీక్ష జరిపారు. శనివారం ఆయన డిండి ప్రాజెక్టు అతిథిగృహంలో డీఈ, ఈఈలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, శివన్నగూడెం, కిష్టారంపల్లిలలో చేపట్టాల్సిన పనుల పురోగతి, అవరోధాలపై చర్చించారు. పనుల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.