
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విజయశాంతి కలిశారు. (అమిత్‌షాను కలిసిన విజయశాంతి)