Gudur Narayana Reddy
-
పాన్ ఇండియా భాషల్లో రజాకార్.. ట్రైలర్ రిలీజ్!
సమర వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడూర్ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్ వీర్ క్రియేషన్స్ సంస్థ తరపున యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ: బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్లే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం వైపు పయనిస్తోందని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వివేకం పాటించకపోతే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని, ప్రస్తుత ఆర్థిక విధానాలను కొనసాగిస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ప్రమాదంలో ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై నారాయణరెడ్డి స్పందిస్తూ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని, సీఎం భయపడాల్సిన అవసరం లేదని, సొంత ఇంటిని చక్కదిద్దడంపై దృష్టి సారించాలని అన్నారు. చదవండి: ధనిక రాష్ట్రం.. జీతాలివ్వలేని స్థితికి కేంద్రంపై మాట్లాడే హక్కు సీఎంకు లేదని, విచ్చలవిడిగా రుణాలు తీసుకోవడంతో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. రాష్ట్ర రుణ భారం రూ.4 లక్షల కోట్లు దాటిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిపై సగటున రూ. 1.14 లక్షల రుణభారం ఉంది. వివిధ ఆర్థిక సంస్థల నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న రుణాల వడ్డీ, అసలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు 18 వేల కోట్లు చెల్లిస్తోందన్నారు. “డబ్బులు అప్పుగా తీసుకుంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజులు గడవడం కష్టంగా మారే హీన దశకు పరిస్థితి చేరుకుందని ప్రతి నెలా జీతాలు, పింఛన్లు ఆలస్యం అవుతున్నాయని ఆయన అన్నారు. వేల కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నాయని వివిధ కార్పొరేషన్ల రుణాలు మరియు చెల్లింపు ప్రక్రియ గురించి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపకపోవడంతో, కేంద్రం రుణాలు ఇవ్వడం నిలిపివేసిందని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాలు కేంద్రం సందేహాలను నివృత్తి చేసి రుణాలు పొందగలిగాయని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సందేహాలను నివృత్తి చేయకుండా నిందలు వేస్తూ సమస్యను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శ్రీలంకలో పరిస్థితిపై కేంద్రం అప్రమత్తమైందని, విపరీతమైన రుణాలను నియంత్రించాలని నిర్ణయించిందని భారత్‌ను శ్రీలంక పరిస్థితితో పోలుస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయ, ఆర్థిక, భద్రతా అస్థిరత ఏర్పడినప్పుడు శ్రీలంక అటువంటి పరిస్థితిలో ఉందని అన్నారు. “కానీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి యుగ పురుషుడు ఉన్నాడని ఆయన జాతి ప్రయోజనాల కోసం జన్మించాడని దేశాన్ని సురక్షితమైన మార్గంలో నడిపించడంతోపాటు కోట్లాది మంది భారతీయుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రధాని వివేకవంతుడని అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత కారణంగా దేశం ఆర్థికంగా, రాజకీయంగా, అంతర్గత, బాహ్య భద్రత విషయంలో సురక్షితంగా ఉందని’’ నారాయణరెడ్డి అన్నారు. ప్రధాని నిపుణుల సలహాలు తీసుకుంటారని, తెలివిగా, వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. చంద్రశేఖరరావు ఒక చక్రవర్తిలా ప్రవర్తిస్తారని, ఆధునిక యుగంలో కూడా తాను రాజుగా భావించుకుంటాడని ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ నిజాం కూడా బహుమతులతో వచ్చే సందర్శకులను కలుసుకునేవాడని, కానీ కేసీఆర్ ఎవరినీ కలవలేదు, మంచి సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన అహంకారం, దురహంకారం వల్ల రాష్ట్రం సంక్షోభం వైపు నడుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడూ అబద్ధాలు చెబుతారని, తన ఆర్థిక విధానాలు గాడి తప్పినా సీఎం తానే గొప్పలు చెప్పుకుంటున్నారని నీళ్లు, నిధులు, ఉద్యోగాలు (నీళ్లు, నిధులు, నియమాలు) కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకొని కేసీఆర్ అధికారంలోకి వచ్చారని. కానీ నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టులు నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్తుపై ఆధారపడటం వల్ల చాలా ఖర్చుతో కూడుకున్నవని అన్నారు. ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న అప్పులు వాయిదాల చెల్లింపుకు వినియోగిస్తున్నారని, అయితే ప్రజలు చెల్లిస్తున్న పన్నులు 6 శాతం కమీషన్ రూపంలో సీఎం కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళుతుందని ఆయన విమర్శించారు. -
‘ఫేషియల్ రికగ్నిషన్’ నిషేధించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత వినియోగాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ టెక్నాలజీ ఉపయోగించ డం ద్వారా ఖైదీల గుర్తింపు చట్టం, 1920, గో ప్యతా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ సాంకేతికత సహాయంతో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా పోలీసులు ఫొ టోలు తీస్తున్నారని, ప్రజలందరినీ నేరస్తులుగా చూస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు లేదా దోషిగా నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఫొటోలు లేదా వేలిముద్రలు తీసుకోడానికి క్రిమినల్ చ ట్టం అనుమతించదని చెప్పారు. రాష్ట్రంలో ఈ సాంకేతికత వినియోగంపై ఎలాంటి నియమా లు, మార్గదర్శకాలు లేవన్నారు. పోలీసు శాఖలో ఎవరైనా ఈ వ్యవస్థను వినియోగించొచ్చని, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గూడూరు అనుమానం వ్యక్తం చేశారు. -
వేపా.. వేపా.. ఎందుకు ఎండుతున్నావ్?
సాక్షి, హైదరాబాద్: కాలుష్యం జడలు విప్పుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అనూహ్య వాతావరణ మార్పులు అనంతజీవరాశి మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం దేన్నీ వదలడం లేదు. చీడపీడలకు విరుగుడుగా ఉపయోగపడే చెట్లు కూడా క్రమంగా కొత్త వ్యాధులు, తెగుళ్ల బారిన పడుతున్నాయి. చిన్నపిల్లలకు అమ్మవారు పోస్తే అది నయం కావడానికి వేప ఆకులు, వేపమండలపై వారిని పడుకోబెట్టడం, వేపాకులు, పసుపునీళ్లతో స్నానం చేయించడం వంటి వి చేయిస్తుంటారు. అలాంటి వేప చెట్టుకు సాధారణంగా రోగాలు, తెగుళ్లు దరిచేరవనేది జనంలో ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల వేపచెట్టుకు తెగుళ్లు ఏర్పడటంతో ఆకులు, కొమ్మలు ఎండిపోవడం, కొన్నిచోట్ల గోధుమ వర్ణంలోకి మారడం కనిపిస్తోంది. ఇలా తెగుళ్లు సోకి మూడునెలల్లోనే వేపచెట్టు నిర్జీవంగా తయారవుతోంది. జీవాయు«ధంగా పేరు గాంచిన వేపచెట్లు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చీడపీడలు, తెగుళ్ల బారిన పడి మాడిపోతున్నాయి. ముఖ్యంగా తేయాకు తోటల్లో కనిపించే తెగులు ఈ వేపచెట్లపై దాడి చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. వివిధ రకాల ఫంగస్‌లతో... మలేరియా, ఫంగస్, వైరల్ జ్వరాలపై పోరాడేతత్వమున్న వేపచెట్లను కొత్తగా ‘ట్విగ్ బ్లైట్ అండ్ డై బాక్’, ‘టీ మస్కిటో బగ్’తదితర ఫంగల్ వ్యాధులు అతలాకుతలం చేస్తున్నాయి. గాలి ద్వారా ఓ రకమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం వల్ల ఇది వేగంగా విస్తరిస్తున్నట్టుగా వెల్లడైంది. సాధారణంగా తేయాకు తోటల్లో కనిపించే ‘టీ మస్కిటో బగ్’తెగుళ్లు, ఫంగస్ వ్యాధులు ఇప్పుడు వేపచెట్లపై ప్రతాపం చూపుతున్నాయి. ఈ తెగుళ్లకు కారణమైన ఈ కీటకాల జీవితకాలం 25–32 రోజులు మాత్రమే. ఇవి కోకొవా, అల్లనేరేడు, చింత, మిరియాలు, పత్తి, చెక్క, తదితర రకాలను సైతం ప్రభావితం చేస్తున్నాయి. ఔషధ విలువలున్న వేపచెట్లను కాపాడుకుని పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కనిపిస్తున్న విధంగా డైబ్యాక్ డిసీజ్ విస్తృతంగా వ్యాప్తి చెం దితే వేపచెట్లు తీవ్రంగా ప్రభావితమౌతాయని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ బాటనీ అధ్యాపకులు, వ్యవసాయ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. చీడపీడలు, తెగుళ్లు సోకిన మేరకు వేప కొమ్మలను నరికి బాబిస్టిన్‌ను పిచికారి చేయడం లేదా గోరింటాకును ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించడం ద్వారా వీటి వ్యాప్తిని నియంత్రించి చెట్టు అవసాన దశకు చేరకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. వేప చెట్లను కాపాడండి: గూడూరు రాష్ట్రంలో అంతుచిక్కని తెగులు, వ్యాధితో ఎండిపోతున్న వేపచెట్లను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని పలుచోట్ల వేపచెట్లు, వాటి ఆకులు, కొమ్మలు ఎండిపోయి పసుపు, గోధుమ రంగులోకి మారుతూ క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేపచెట్లు చాలా ఔషధ విలువలు కలిగి ఉన్నందున పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘గత మూడు రోజుల్లో తమ ఇంటి ప్రాంగణంలో మూడు వేప చెట్లు అకస్మాత్తుగా ఎండిపోయాయి’అని పేర్కొన్నారు. అటవీ శాఖ తక్షణమే ముందుకు వచ్చి ఈ పరిణామాలకు గల కారణాలను గుర్తించాలని కోరారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ గాలిని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న వేపచెట్లను సంరక్షించడం లేదని, వేప చెట్లను సంరక్షించకుంటే హరితహారం కార్యక్రమం వృథా అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత గుడ్‌బై
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, తెలంగాణ పీసీసీ ట్రెజరర్ గూడూరు నారాయణరెడ్డి సోమవారం పార్టీని వీడారు. ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. త్వరలోనే నారాయణరెడ్డి బీజేపీలో చేరనున్నారు. గతంలోనే నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు విజయశాంతి కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె బీజేపీలో చేరతారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను విజయశాంతి కలిశారు. (అమిత్‌షాను కలిసిన విజయశాంతి) -
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి గూడూరు నారాయణరెడ్డి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయనతో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుజ్జిగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరిగా తలపడున్నాయి. వారి మాటల యుద్ధం సాగుతుండగా, ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ వెనుకబడింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్.. గ్రేటర్ వార్‌లో కూడా వెనకబడిపోవడంతో ఆ నేతల్లో నైరాశ్యం ఆవహించింది. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము..) -
టీపీసీసీ నేత గూడూరుకు కరోనా
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కరోనా వైరస్ బారి న పడ్డారు. ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు ధ్రువీకరించారని, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గాంధీభవన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాగా, లాక్డౌన్ సమయం లో గూడూరు పేదలకు అండగా ఉండేం దుకు పార్టీ పక్షాన పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పనిచేశారు. గూడూరుకు కోవిడ్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆయన త్వరలోనే కోలుకుం టారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కమ్యూనిటీ వ్యాప్తి జరిగింది... రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి జరిగిందని, ఇందుకు తన కేసే ఉదాహరణ అని గూడూరు నారాయణరెడ్డి వెల్లడించారు. ‘నేను ఇటీవల విదేశాలకు గానీ, ఇతర ప్రదేశాలకు గానీ ప్రయాణం చేయలేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను, వారికి సన్నిహితంగా ఉన్న వారిని కూడా కలవలేదు. అయినా నాకు కరోనా వచ్చిందంటే రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి జరిగినట్లేనని భావించాలి. ఈ విషయాన్ని నేను చెబుతున్నా ప్రభుత్వం ఖండిస్తూ వస్తోంది. ఇప్పటిౖకైనా తగిన చర్యలు తీసుకోవాలి’అని గూడూరు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కోఠి ఈఎన్టీ డాక్టర్‌కు పాజిటివ్.. సుల్తాన్‌బజార్: కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆయన కింగ్‌కోఠి ఆస్పత్రిలో కూడా సేవలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీతో పలుమార్లు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన ద్వారానే ఈ డాక్టర్‌కు కరోనా సోకినట్లు భావిస్తున్నారు. బంజారాహిల్స్ పీఎస్ ఎస్ఐకి కూడా.. జూబ్లీహిల్స్: బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్ఐకి, ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. దీంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా, గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిపిన కరోనా పరీక్షల్లో బంజారాహిల్స్‌కు చెందిన 8 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. -
ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టండి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోరింది. ‘ఆరునెలల్లో కేసీఆర్ కేవలం కేబినెట్ సమావేశాలు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటై 169 రోజులు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గంలో ఆరు ఖాళీలున్నాయి. ఈ తరహా పాలన ప్రజాస్వామ్యాన్ని కాకుండా నియంతృత్వాన్ని తలపిస్తోంది’అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ఎన్నికల నియమావళి పేరుతో ఆయన సెలవులు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి నిరుద్యోగ భృతి, రైతుబంధు సాయం పెంపు తదితర అంశాలను పరిష్కరించాలని, ఆర్థికంగా కుంగిపోతున్న రాష్ట్రం కోలుకునేందుకు ఆయన కొంతకాలం పాటు రాజకీయాలకు విరామం ఇచ్చి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు -
‘ప్రాంతీయ పార్టీలను భయపెట్టేందుకే..’
సాక్షి, హైదరాబాద్: ఈనెల 23న వెలువడనున్న లోక్‌సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ప్రాంతీయ పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలనే వ్యూహంతోనే ఎన్డీయే విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ ద్వారా చెప్పించారని టీపీసీసీ ఆరోపించింది. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలకన్నా ఎన్ని స్థానాలు ఎక్కువ, ఎన్ని తక్కువ అనేది ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించలేదని, అన్ని పోల్స్ ఫలితాల్లోనూ గతం కన్నా తక్కువగా ఎన్డీయే 275–285 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అదే సమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలకన్నా మూడు రెట్లు ఎక్కువ వస్తాయని అవే ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో మోదీ హవా ఎక్కడా కనిపించలేదని అభిప్రాయపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని మోదీ కేదార్నాథ్ యాత్రను దుర్వినియోగం చేశారని విమర్శించారు. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడని, మోదీ మాత్రం దక్షిణం వైపు తిరిగి సూర్యనమస్కారం చేస్తున్నట్టు ఫోటోలకు పోజివ్వడం హిందువులను అవమానపర్చడమేనన్నారు. యూపీఏ గెలుస్తుందనే భయం, తామే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే దురాశ బీజేపీలో కనిపిస్తోందని ఆ ప్రకటనలో ఆరోపించారు. -
8–9 స్థానాల్లో గెలుస్తాం: గూడూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 8–9 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుందన్న నమ్మకం తమకుందని, కచ్చితంగా 5 స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కుమారుడు రాహుల్‌ను ప్రధాని చేయాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేశారన్నారు. బీజేపీకి దక్షిణ తెలంగాణ మొత్తం కలిపి కూడా 10 స్థానాల కన్నా ఎక్కువ రావని, దేశ ప్రజలు 23న బీజేపీకి గట్టి బుద్ధి చెప్పబోతున్నారన్నారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోకుండా రాహుల్ కుటుంబంపై విమర్శలకు మోదీ పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వి గతంలోనూ గాడ్సేకి పాలాభిషేకం చేసి మహాత్మాగాంధీ చిత్రపటాన్ని కాల్చివేశారని, ఇప్పుడు గాంధీని చంపిన గాడ్సేని దేశభక్తుడని అన్నారని విమర్శించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. -
తెలంగాణ రాజ్యాంగాన్ని రాస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత రాజ్యాంగంపై నమ్మకం లేకే తెలంగాణ రాజ్యాంగాన్ని రాసే దిశలో అడుగులు వేస్తున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే ఆయన కేంద్ర చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు నారాయణరెడ్డి ఆదివారం ఒక విడుదల చేశారు. అఖిల భారత సర్వీసు తరహాలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సర్వీసులను తీసుకురావాలనే కేసీఆర్ ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తీసుకు వచ్చే ముందు రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 4,244 ఉద్యోగ పోస్టులను, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న 2,612 ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూసేకరణ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత లాంటి అనేక చట్టాల్లో తెలంగాణ రాష్ట్రం మార్కు చూపించాలని ప్రయత్నం చేశారని, ఇప్పుడు కొత్తగా రెవెన్యూ, మున్సిపల్ చట్టాలను తేవాలని చూస్తున్నారని విమర్శించారు. శాసన, పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని రాజ్యాంగం స్పష్టం చేస్తుంటే చంద్రశేఖర్ రావు మాత్రం కేంద్రానికి ఉన్న అధికారాలను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వేస్తున్న ఇటువంటి అడుగులు మన దేశ సార్వభౌమాధికారానికి చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ వెంటనే ఇలాంటి ప్రయత్నాలను మానుకోవాలని ఆయన హితవు పలికారు. పరిపాలన రంగంలో మార్పు తేవాలనుకుంటే ముందుగా రాష్ట్రంలో ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నారాయణరెడ్డి కోరారు. కేసీఆర్ ఎప్పుడూ రాజ్యాంగంపై గౌరవం ప్రదర్శించలేదని, రాజ్యాంగంలో పేర్కొన్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించి తన హయాంలో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గూడూరు గుర్తు చేశారు. -
స్టాంగ్ రూంల వద్ద ఆర్మీతో భద్రత కల్పించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంల వద్ద ఆర్మీ లేదా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కౌంటింగ్‌కు మరో 42 రోజుల గడువున్న నేపథ్యంలో ఈవీఎంలు ఎలాంటి ట్యాంపరింగ్‌కు గురికాకుండా భద్రంగా ఉండేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి గురువారం ఓ ప్రకటనలో కోరారు. స్ట్రాంగ్ రూంలలోకి స్థానిక పోలీసులకు ప్రవేశం కల్పించవద్దని, భద్రతను సమన్వయం చేసే బాధ్యత మాత్రమే వారికి అప్పగించాలన్నారు. హైసెక్యూరిటీ జామర్లను స్ట్రాంగ్‌రూంల వద్ద ఏర్పాటు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన అన్ని పోలింగ్ బూత్‌లు, స్ట్రాంగ్ రూంల సీసీటీవీ ఫుటేజీని భద్రపర్చాలన్నారు. ఈ ఎన్నికల్లో ఉపయోగించని ఈవీఎంలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని, లేదంటే సీజ్ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరు, ట్యాంపరింగ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చినందున ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ కేడర్‌తో స్ట్రాంగ్‌రూంల వద్ద విజిలెన్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ కేడర్ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే టీపీసీసీ నాయకత్వానికి తెలియపర్చాలని కోరారు. -
రాహుల్ చేసేదే చెప్తారు
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసేదే ప్రజలకు చెప్తారని, మోదీ, కేసీఆర్ లాగా అబద్ధాలతో ఆయన మోసం చేయరని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి స్పష్టం చేశారు. అలవికాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేయడం కాంగ్రెస్ తత్వం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటే ప్రజా సమస్యల్ని చర్చించి వాటికి ప్రత్యా మ్నాయ పరిష్కారాలను చూపే వేదికన్నారు. టీఆర్ఎస్కు మాత్రం అధికారం దక్కించుకోవడమే లక్ష్యమని, కొడుకును తెలంగాణకు సీఎంని చేసి, తాను ప్రధాని పదవి చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశం లోని అన్ని సమస్యలపై రాహుల్ గాంధీ రాజనీతిజ్ఞత తో మాట్లాడుతుంటే.. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక మోదీ మౌనంగా కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. జహీరాబాద్‌లో సోమవారం జరిగే బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను రాహుల్ వెల్లడిస్తార ని తెలిపారు. కనీస ఆదాయ హామీ ప్రకటన ద్వారా తెలంగాణలోని 50 లక్షల మంది లబ్ధిపొందుతారని, వ్యవసాయ రంగంలో మార్పులకు సంబంధించిన అంశాన్ని వెల్లడిస్తారని చెప్పారు. పార్టీకి నష్టం లేదు.. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను నారాయణరెడ్డి ఖండించారు. ఆయన జీవిత కాలంలో ఒక్క ఎన్నికలో గెలవకపోయినా, పొంగులేటికి పార్టీ ఎన్నో అవకాశాలిచ్చిందన్నారు. మార్చి 29 వరకు ఎమ్మెల్సీ పదవిలో ఉన్న ఆయన పదవీకాలం ముగిసిన రెండు రోజులకే పార్టీ కి రాజీనామా చేస్తూ తమ పార్టీ నాయకత్వంపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కొందరు అవకాశవాదులు పార్టీని వీడి వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని పేర్కొన్నారు. -
‘మా అమ్మ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారు’
హైదరాబాద్: తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీపీసీసీ కోశాధికారి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి చెప్పారు. గూడూరు నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే తాను ఎమ్మెల్సీ అయ్యేవాడినని గుర్తు చేశారు. కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే కేసీఆర్ ఆశపడుతున్నారని, అలాగే నన్ను కూడా రాజకీయ నాయకుడిగా చూడాలని మా తల్లి ఆశపడిందని తెలిపారు. మా అమ్మ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని భావోద్వేగంతో అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగడం లేదని విమర్శించారు. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే పాలన మంచిగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. -
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది’
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల గురించి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ కోశాధికారి, ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ ఫిరాయింపులు తప్ప.. టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లు చేసిందేమీలేదని విమర్శించారు. తెలంగాణ రాజ కీయాలను దిగదార్చిన చరిత్ర టీఆర్ఎస్దేనన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితేనే వారి సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ చెప్పడం బ్లాక్మెయిల్ రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడమంటే, వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరేంటని ప్రశ్నించారు. అధికార పార్టీని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎలా ప్రలోభాలకు గురిచేస్తుందో చెప్పాలని నిలదీశారు. అధికార పార్టీ నేతల నియంతృత్వ విధానాల కారణంగానే బీజేపీ ఎంపీ, టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. -
ఎమ్మెల్సీ అభ్యర్థిగా గూడూరు నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ అభ్యర్థిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేయడంతో గురువారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పోదెం వీరయ్య, ఆత్రం సక్కు, జాజుల సురేం దర్ పాల్గొన్నారు. అంతకుముందు గూడూరు పేరు ఖరారులో జాప్యం జరిగింది. గురువారం ఉదయమే ఆయన పేరు ప్రకటిస్తారని అనుకున్నా మధ్యాహ్నం వరకు ఢిల్లీ నుంచి సమాచారం రాలేదు. చివరకు ఒంటి గంట ప్రాంతంలో అధికారిక సమాచారం రావడంతో 1:30కి గూడూరు అసెంబ్లీకి చేరుకున్నారు. 2:55కి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఏడు నామినేషన్లు... టీఆర్ఎస్ నుంచి మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, యెగ్గె మల్లేశం, శేరి సుభాశ్‌రెడ్డి, ఎంఐఎం నుంచి మీర్జా అలీ హసన్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా గురువారం గూడూరుతోపాటు జాజుల భాస్కర్ అనే వ్యక్తి కూడా నామినేషన్ వేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఏడుకు చేరింది. నేడు స్క్రూటినీ... ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఆమోదించనున్నారు. ఈ నెల 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉం డటంతో ఆలోగా ఎవరూ నామినేషన్లు ఉపసంహరించకపోతే 12న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌం టింగ్ కూడా ఉంటుంది. కాగా, తనపై నమ్మకం ఉం చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి గూడూరు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వం ఖరారులో సహకరించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి విక్రమార్క, కుంతియా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ మౌనమెందుకు?: గూడూరు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా దానిపై స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేవలం టీఆర్ఎస్ నేతలు స్పందించి సాదాసీదా ప్రకటనలు చేశారని, ముఖ్యమంత్రిగా కేంద్ర బడ్జెట్‌పై స్పందించాల్సి ఉన్నా ఎందుకు మాట్లాడటం లేదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రశ్నించకపోగా ప్రజల దృష్టిని ఇతర అంశాల వైపు మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్లోనూ రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీతో పాటు చాలా కేంద్ర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు నిధులిచ్చేందుకు నీతి ఆయోగ్ తిరస్కరించింది’అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మౌనమే ఆయన బీజేపీ, మోదీ మద్దతుదారుడని తెలిసిపోయిందని, కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో సంవత్సరాల వారీగా బయటపెట్టాలని నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. -
10 నుంచి 22వరకు బీపీపీఎల్
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి 10 నుంచి 22 వరకు ఐపీఎల్ తరహాలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భువనగిరి పార్లమెంట్ ప్రీమియర్ లీగ్ (బీపీపీఎల్) 20–20 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం గాంధీభవన్‌లో బీపీపీఎల్ పోస్టర్‌ను ఆవి ష్కరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలికితీయడం కోసం బీపీపీఎల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన మునుగోడు సూపర్ కింగ్స్, జనగామ చాలెంజర్స్, ఆలేరు సన్‌రైజర్స్, భువనగిరి లయన్స్, యాదగిరిగుట్ట రాయల్స్, నకిరేకల్ వారియర్స్, ఇబ్రహీంపట్నం రైడర్స్ అనే ఎనిమిది టీమ్‌లతో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయని, లీగ్ విజేతకు రూ. 1.50 లక్షలు, రన్నరప్‌కు రూ.లక్ష, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 50 వేల బహుమతిని అందిస్తామని తెలిపారు. -
రిటైర్మెంట్ తర్వాత టీఆర్ఎస్లోకి గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆ విషయం మరిచి టీఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆయన చేసిన ప్రసంగం గవర్నర్‌గా రిటైర్మెంట్ అయ్యా క టీఆర్ఎస్లో చేరేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గవర్నర్ ప్రశంసించవచ్చు, కానీ నరసింహన్ మాత్రం కేసీఆర్, ఆయ న పార్టీని పొగిడేందుకే ఎక్కువ ఉత్సా హం చూపారన్నారు. గవర్నర్ ప్రసంగం పరమ చెత్తగా ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో గవర్నర్‌గా పదవీ కాలం ముగియనుండటంతో అది పొడిగించుకునేందుకే ఆయన వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందన్నారు. తాను ప్రాతినిథ్యం వహించేది రాజ్‌భవన్‌కు అని, టీఆర్ఎస్కు కాదని గవర్నర్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. -
కేసీఆర్ పర్యటనతో బీజేపీకే లాభం: గూడూరు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ పర్యటన తెలంగాణాను అవమానపరిచే విధంగా ఉందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి వ్యాక్యానించారు. హైదరాబాద్‌లో గూడూరు నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..పిలవని పేరంటానికి కేసీఆర్ వెళ్లారని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పట్ల మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్‌లు సుముఖంగా లేరని అన్నారు. అయినా కేసీఆర్ వారి చుట్టూ తిరగడం రాజకీయంగా బీజేపీకి లాభం చేకూర్చేందుకేనని అభిప్రాయపడ్డారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మమత బెనర్జీ ఇద్దరూ కూడా కేసీఆర్ కలిసిన తర్వాత మీడియాతో ఎలాంటి ఫ్రంట్ గురించి మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ కేవలం మోదీ ఆదేశాల మేరకే ఈ ఫ్రంట్ల పేరుతో తిరుగుతున్నారని ఆరోపించారు. యూపీఏను దెబ్బతీయడానికి ఎన్డీఏతో కలిసి కేసీఆర్ చేస్తున్న కుట్ర అని వ్యాక్యానించారు. కేసీఆర్‌ను దేశంలో ఏ రాజకీయపార్టీ నమ్మదని అభిప్రాయపడ్డారు. -
నియంత రాజ్యంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేయడం ద్వారా తెలంగాణను నియంత రాజ్యంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనం చేసుకోవడం ద్వారా కేసీఆర్ శాసనవ్యవస్థను దుర్వినియోగపరుస్తున్నారని నిర్ధారణ అయిందన్నారు. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన 25 మంది ఎమ్మెల్యేలు, రెండు డజన్ల మంది ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇచ్చిన పిటిషన్లను స్పీకర్, మండలి చైర్మన్లు పట్టించుకోలేదని శనివారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దయ కోసం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోని ఆ ఇద్దరూ రాజ్యాంగాన్ని మోసగించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు శాసన వ్యవస్థ పట్ల గౌరవం లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇప్పటివరకు కేబినెట్‌ను ఏర్పాటు చేయకపోవడం, గెలిచిన ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయించకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. -
కేసీఆర్ పాలనకు అంతం తప్పదు: గూడూరు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల పాటు సాగిన కేసీఆర్ అరాచక పాలనకు అంతం తప్పదని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాల్లోని సమస్యలపై సమీక్షించే అధికారం ఉన్నా గవర్నర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. గవర్నర్ గుడికి కాకుండా ఆసుపత్రులకు వెళితే ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానన్న కేసీఆర్.. ఖల్లాస్ చేశారని విమర్శించారు. ప్రజలను వంచించడంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడని అభివర్ణించారు. -
‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానని.. డర్టీగా మార్చారు’
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ గుళ్లు, గోపురాలు తిరిగే బదులు.. ఆస్పత్రులలకు వెళ్తే జనాలకు మేలు చేకురుతుందని సూచించారు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ నిలిచిపోయిందన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనాపరంగా సరైన చర్యలు తీసుకోనప్పుడు.. గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ గవర్నర్ ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పి.. డర్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను.. బంగారు తెలంగాణగా మారుస్తారని నమ్మి ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఈ నెల 3న రాహుల్ గాంధీ గద్వాల్, తాండూర్, హైదరాబాద్ నగరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. సోనియా గాంధీని మరోసారి రాష్ట్రానికి రావాల్సిందిగా కోరామని.. ఆమె ఆరోగ్యం సహకరిస్తే వస్తారని వెల్లడించారు. రాహుల్ గాంధీ కూడా ఈ నెల 5న మరోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
‘గుత్తా ఆధారాలు సేకరించి.. అమ్ముడుపోయారు’
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు తిరిగిన గుత్తాకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉండి మిషన్ భగీరథలో జరుగుతున్న అవినీతిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి.. ఆ తర్వాత డబ్బులకు టీఆర్ఎస్కు అమ్ముడుపోయారని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా మాదిరి మూడు పార్టీలు మారలేదని తెలిపారు. గుత్తా రాజకీయాలకు పనికిరాడని.. ముఖ్యమంత్రి వద్ద చెంచాగిరి చేసుకోవడానికే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ సీనియర్లపై గుత్తా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పాలమూరు ప్రాజెక్టులో రూ.1000 కోట్ల అవినీతి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని పదేపదే అనడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఓపెన్‌కట్ పంప్‌హౌస్‌ను నిర్మించే అవకాశం ఉన్నా అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ ఎందుకు నిర్మిస్తున్నారో సాగునీటి మంత్రి హరీశ్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూమిని సేకరించాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. హరీశ్‌రావు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.