సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత వినియోగాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ టెక్నాలజీ ఉపయోగించ డం ద్వారా ఖైదీల గుర్తింపు చట్టం, 1920, గో ప్యతా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ సాంకేతికత సహాయంతో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా పోలీసులు ఫొ టోలు తీస్తున్నారని, ప్రజలందరినీ నేరస్తులుగా చూస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఓ వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు లేదా దోషిగా నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఫొటోలు లేదా వేలిముద్రలు తీసుకోడానికి క్రిమినల్ చ ట్టం అనుమతించదని చెప్పారు. రాష్ట్రంలో ఈ సాంకేతికత వినియోగంపై ఎలాంటి నియమా లు, మార్గదర్శకాలు లేవన్నారు. పోలీసు శాఖలో ఎవరైనా ఈ వ్యవస్థను వినియోగించొచ్చని, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గూడూరు అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment