facial recognition technology
-
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలకంగా AI
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తన పరిశీలనాంతరం ఇది ఉగ్రదాడిగా భావిస్తుండగా.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సైతం పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించింది. తాజాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీనే ఈ కేసు మొత్తానికి కీలకంగా మారింది. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి.. ప్రధాన అనుమానితుడి ఫుటేజీ ఒకటి బయటకు వచ్చింది. ఆ నిందితుడి కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐఈడీ(Intensive Explosive Device)ను బ్యాగ్‌లో తీసుకెళ్లిన ఆ వ్యక్తి.. ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు రంగంలోకి దిగాయి. అయితే.. ముసుగు తొలగించి.. ఇందుకోసం భద్రతా సంస్థలు ఏఐ(Artificial Intelligence) సాయం తీసుకుంటున్నాయి. ఏఐ ఆధారిత ఫేషీయల్ రికగ్నిషన్ సాంకేతిక సాయంతో.. బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టబోతున్నారు. అనుమానితుడెవరో తెలిసిపోయిందని.. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ను ఉపయోగించి ఆ వ్యక్తిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెబుతున్నారు. మరోవైపు ఏఐ టెక్నాలజీ సాయంతో అతని ముఖానికి ఉన్న ముసుగును తొలగించారు. అతని ఫొటోల్ని సేకరించుకుని ఆచూకీ కనిపెట్టే పనిలో ఉంది బెంగళూరు నగర నేర పరిశోధన విభాగం. Bengaluru blast: Suspected accused captured in CCTV #Bengaluru #Karnataka #Blast #RameshwaramCafe #RameshwaramCafeBlast pic.twitter.com/jNM6BFnPVH — Fresh Explore (@explorefresh24) March 2, 2024 బెంగుళూరులో.. అదీ టెక్నాలజీ కారిడార్లోనే ఈ పేలుడు జరగడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భద్రతాపరంగా మరింత నిఘా, చర్యలు పెంచాల్సిన అవసరాన్ని ఈ పేలుడు ఘటన తెలియజేస్తోందని నిపుణలు అంటున్నారు. అలాగే.. అనుమానిత వ్యక్తులను పట్టుకునేందుకు AI లాంటి అత్యాధునిక సాంకేతికతను అధికారికంగా వినియోగించడం ఎంత అవసరమో కూడా చెబుతోందంటున్నారు. రెండేళ్ల కిందటి.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో.. మొత్తం 10 మంది గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. 2022 నవంబర్‌లో మంగళూరులో ఇదే తరహాలో కుక్కర్ బాంబు పేలింది. దీంతో.. ఈ రెండు ఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. బృందం ధార్వాడ్, హుబ్లీ, బెంగళూరుకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విచారణకు పూర్తి సహకారం: కేఫ్ యాజమాన్యం తమ ప్రాంగణంలో బాంబు దాడి జరగడంపై రామేశ్వరం కేఫ్ యాజమాన్యం స్పందించింది. విచారణలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాకారం అందిస్తామని.. అలాగే పేలుడులో గాయపడిన వాళ్లకు తాము అండగా నిలుస్తామని కేఫ్ ఎండీ దివ్య రాఘవేంద్ర రావు ప్రకటించారు. ఏం జరిగిందంటే.. శుక్రవారం ఉదయం.. బ్రూక్‌ఫీల్డ్ ఐటీపీఎల్ రోడ్లో ఉన్న రామేశ్వరం కేఫ్. నెత్తిన క్యాప్.. ముఖానికి ముసుగు.. భుజాన బ్యాగ్‌తో ఆ ఆగంతకుడు కేఫ్‌కు వచ్చాడు. అతని వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 11గం.30.ని. ప్రాంతంలో బస్సు దిగి నేరుగా కేఫ్‌లోకి వెళ్లిన ఆ వ్యక్తి ఇడ్లీ ఆర్డర్ చేశాడు. పావు గంట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ మధ్యలో తన భుజానికి ఉన్న బ్యాగ్‌ను కేఫ్‌లోని సింక్ వద్ద ఉన్న డస్ట్‌బిన్ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వెళ్లిపోయిన గంటకు ఆ బ్యాగ్‌లో ఉన్న ఆ బాంబు పేలింది. ఫొటోలు వచ్చాయి: సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనలో నిందితుడు ప్రెజర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చాడు. రవ్వఇడ్లీని ఆర్డర్ చేసుకొని ఒక దగ్గర కూర్చున్నాడు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి, వెళ్లిపోయాడు. అతడు ఎవరో తెలీదు. ఫొటోలు వచ్చాయి. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటాం అని అన్నారాయన. #Marksmendaily : #JustiIn #Karnataka CM #Siddaramaiah visits #RameshwaramCafe, a day after an explosion took place here in #Bengaluru @siddaramaiah #RameshwaramCafeBlast #BengaluruCafeBlast #bombblast pic.twitter.com/ptoGaYePHL — Marksmen Daily (@DailyMarksmen) March 2, 2024 అలాగే.. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు.‘‘ఈ విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా..? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు’’ అని అన్నారు. అలాగే ఘటనాస్థలానికి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారాయన. -
ముఖం చూశాకే ముందుకు!
ఏదో పనిమీద ఓ ఆఫీసుకు వెళ్లారు. మీకన్నా ముందు ఉన్నఓ వ్యక్తి ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లగానే డోర్ ఆటోమేటిగ్గా తెరుచుకుంది.మీకు మాత్రం తెరుచుకోలేదు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వచ్చి తీస్తేనే తెరుచుకుంది. ఇది ‘ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ’మహిమ. మీకన్నా ముందు వెళ్లిన వ్యక్తిఆ ఆఫీసులో ఉద్యోగి. ద్వారం దగ్గర ఉన్న ‘ఫేషియల్ రికగ్నిషన్’కెమెరా అతడినిగుర్తించి డోర్ తెరిచింది. మీరు బయటివారు కాబట్టి తెరవలేదు. కేవలం ఉద్యోగుల కోసమే కాదు అపరిచితులు, అనుమానితులు, నేరస్తులపై నిఘా కోసం వాడేఈ టెక్నాలజీకి ఇటీవల హైదరాబాద్‌లో ఆదరణ పెరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే విమానాశ్రయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక సంస్థలలో ఉద్యోగుల ప్రవేశ, నిష్క్రమణ కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా అపరిచితుల ప్రవేశం, అనుమానితుల కదలికల నేపథ్యంలో.. ప్రైవేట్ పార్టీలు నిర్వహించే గేటెడ్ కమ్యూనిటీలు, క్లబ్‌లు, పబ్‌లకు కూడా ఎఫ్‌ఆర్‌టీ వినియోగం విస్తరించింది. సైబర్ నేరాలు, అనుమానితుల కదలికలు పెరిగిన నేపథ్యంలో దీని వినియోగం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎఫ్‌ఆర్‌టీ సామర్థ్యంఎంతంటే? నాలుగు కెమెరాలు, ఒక వీడియో మేనేజ్మెంట్ సర్వర్, నాలుగు లైసెన్స్‌లు, సర్వర్ స్టోరేజీ, బ్యాకప్‌తో కూడిన ఎఫ్‌ఆర్‌టీ ఉపకరణానికి రూ.3లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. 200 నుంచి 10 వేల వరకు ముఖాలను, 5 వేల వేలిముద్రలను స్టోర్ చేసుకోవచ్చు. ఇన్కార్డ్ ఎఫ్‌ఆర్‌టీ పరికరాలైతే నియంత్రిత యూనిట్లలో డేటా విడిగా నిల్వ ఉంటుంది. ఎఫ్‌ఆర్‌టీ పరికరాలను అదీకృత నిర్వాహకులు మాత్రమే.. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్), పాస్వర్డ్, వేలిముద్రల సాయంతో మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారు. వీటిలోని డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉండటం వల్ల హ్యాకర్ల నుంచి కూడా భద్రత ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎఫ్‌ఆర్‌టీ లేదా బయోమెట్రిక్‌లను నేరుగా నియంత్రించే చట్టం లేదు. ఎలక్ట్రానిక్ రికార్డులు, ముఖ గుర్తింపు సహా వ్యక్తిగత డేటాను సేకరించే లేదా నిల్వ చేసే విధానం ‘ఇన్ఫర్మేషన్ చట్టం–2000’పరిధిలోకి వస్తాయని కేంద్ర హోం శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ముఖ్యమైన ప్రదేశాల్లో ఎఫ్‌ఆర్‌టీ రాష్ట్రంలోని పలు కీలక కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయం, సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైదరాబాద్ పోలీసు ప్రధాన కార్యాలయం, తెలంగాణ పోలీసు ప్రధాన కార్యాలయం, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర చోట్ల ఎఫ్‌ఆర్‌టీ నిఘా ఉంది. ఎలా పని చేస్తుంది అంటే.. ♦ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వ్యవస్థలో అవసరమైన మేర కెమెరాలు, 7 ఇంచుల ఎల్సీడీ స్క్రీన్, మైఫేర్ అనే రీడింగ్ మాడ్యుల్ కాంటాక్ట్‌లెస్ కార్డు ఉంటుంది. ♦ ముఖాన్ని గుర్తించాక వారిని లోపలికి అనుమతించేందుకు ‘టర్న్ స్టయిల్ గేట్లు’తెరుచుకుంటాయి. ♦ ఈ ఉపకరణాలన్నీ ఇంటర్నెట్తో కాకుండా లోకల్ ఏరియా నెట్వర్క్ (ఎల్ఏఎన్)తో అనుసంధానమై ఉంటాయి. డేటా ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. మాస్క్ లేకుండాఉన్నవారి ముఖాలను 3 మీటర్ల దూరం నుంచే ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఒక్కొక్కరి ముఖాన్ని 0.2 సెకన్లలోపే రీడ్ చేసి.. ఇప్పటికే ఫీడ్ చేసి ఉన్న ఫొటోలు, వీడియోల్లోని డేటాతో పోల్చుతుంది. సదరు వ్యక్తి ఎవరనేది నిర్ధారిస్తుంది. ఒకవేళ కొత్త వ్యక్తులు అయితే వెంటనే అలర్ట్ చేస్తుంది. అనుమానితులు, బ్లాక్‌లిస్టులో ఉన్న వ్యక్తులను గుర్తిస్తే.. సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తుంది. అవగాహన లేక పరిమిత స్థాయిలో వినియోగం – రాజశేఖర్, ఎండీ, బృహస్పతి టెక్నాలజీస్ అనుమానాస్పద, అపరిచిత వ్యక్తులు, నేరస్తుల ప్రవర్తనను ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో నేరాల శాతం తగ్గుతుంది. అయితే విదేశాలతో పోలిస్తే మన దగ్గర ఎఫ్‌ఆర్‌టీ వినియోగం తక్కువే. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో వినియోగం పరిమితంగా ఉంది. -
ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చర్యలు చేపట్టింది. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ అప్లికేషన్‌కు అవసరమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించేందుకు సచివాలయంలోని అన్ని శాఖలు ఓ మిడిల్ లెవల్ ఆఫీసర్‌ను, శాఖాధిపతుల కార్యాలయాల్లో డిప్యూటీ కమిషనర్ స్ధాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో సమాచారాన్ని అందించేందుకు జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించింది. నిర్దేశించిన నమూనా పత్రంలో నోడల్ అధికారి పేరు, హోదా, కార్యాలయం చిరునామా, మొబైల్ నంబర్, ఇ–మెయిల్ ఐడీని ఐటీ శాఖకు పంపాలని పేర్కొంది. ఐటీ శాఖ వెంటనే నోడల్ అధికారులను సంప్రదించి మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయాలని, ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్లో ఎన్రోల్ అయ్యేందుకు అవసరమైన శిక్షణ కూడా నోడల్ అధికారులకు ఇవ్వాలని పేర్కొంది. ఉద్యోగుల సెలవుల నిర్వహణ కూడా ఈ వ్యవస్థలోనే ఉంటుందని పేర్కొంది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ ఇదే విధానంలో హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల్లో జనవరి 1 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమల్లోకి తెస్తుండగా మిగతా కార్యాలయాల్లో జనవరి 16 నుంచి అమల్లోకి తేనున్నారు. స్వయంప్రతిపత్తి గల సంస్థలు, రీజినల్, డివిజనల్, స్థానిక సంస్థలు, మండల, గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి వరకు గల సబార్డినేట్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు చేయాల్సిన బాధ్యత శాఖాధిపతులు కార్యాలయాల అధిపతులపైన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో హాజరు బాధ్యత జిల్లా కలెక్టర్లపైన ఉంటుందని స్పష్టం చేశారు. -
Azadi Ka Amrit Mahotsav: 10 వేల మందితో పహారా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం జరగనున్న భారత 75వ స్వాతంత్య్రదిన వేడుకలకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7 వేల మంది ఆహుతులు వస్తూ ఉంటే ఎర్ర కోట చుట్టుపక్కల 10 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. సోమవారం జాతీయ జెండాను ఆవిష్కృతం చేసేంతవరకు ఎర్రకోట చుట్టూ అయిదు కిలో మీటర్ల మేర ఎలాంటి పతంగులు ఎగరవేయకూడదని ఆంక్షలు విధించారు. డ్రోన్లతో కూడా నిరంతరం పహారా ఉంటుంది. ఎర్రకోట ప్రాంగణంలోకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కారు కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్‌కేసెస్, హ్యాండ్‌బ్యాగ్స్, కెమెరాలు, బైనాక్యులర్స్, గొడుగులు తీసుకురావడంపై నిషేధం విధించారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్ కెమెరాలను అమర్చారు. 400కి పైగా కైట్ కేచర్స్‌ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. -
‘ఫేషియల్ రికగ్నిషన్’ నిషేధించాలి: గూడూరు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సీసీటీవీ కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత వినియోగాన్ని నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఈ టెక్నాలజీ ఉపయోగించ డం ద్వారా ఖైదీల గుర్తింపు చట్టం, 1920, గో ప్యతా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఈ సాంకేతికత సహాయంతో సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా పోలీసులు ఫొ టోలు తీస్తున్నారని, ప్రజలందరినీ నేరస్తులుగా చూస్తున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు లేదా దోషిగా నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఫొటోలు లేదా వేలిముద్రలు తీసుకోడానికి క్రిమినల్ చ ట్టం అనుమతించదని చెప్పారు. రాష్ట్రంలో ఈ సాంకేతికత వినియోగంపై ఎలాంటి నియమా లు, మార్గదర్శకాలు లేవన్నారు. పోలీసు శాఖలో ఎవరైనా ఈ వ్యవస్థను వినియోగించొచ్చని, దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని గూడూరు అనుమానం వ్యక్తం చేశారు. -
ఊపందుకోనున్న మరో టెక్నాలజీ, స్పందించని అమెజాన్
వాషింగ్టన్ డిసి : 4.5ట్రిలియన్లకంటే ఎక్కువ వ్యాపార వ్యవహారాల్ని నిర్వహించే సుమారు 50మంది పెట్టుబడుల బృందం అమెజాన్, ఫేస్ బుక్ తరహాలో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ తయారు చేయాలని భావిస్తోంది. యుఎస్ ఫైనాన్షియల్ దిగ్గజం న్యూయార్క్ లైఫ్ కు చెందిన అసెట్స్ మేనేజర్ కాండ్రియం నేతృత్వంలోని ఇన్వెస్టర్ గ్రూప్ సభ్యులు.. రాబోయే రోజుల్లో వ్యక్తిగత సమాచారంతో పాటు బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాల్లో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని బిల్డ్ చేయాలని యోచిస్తున్నారు. దీనిపై యూఎస్ హ్యూమన్ రైట్స్ సభ్యులు సైతం స్పందించారు. స్మార్ట్‌ఫోన్ ను అన్‌లాక్ చేయడానికి లేదా బ్యాంక్ అకౌంట్ల హోల్డర్లను గుర్తించడానికి, రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు ప్రభుత్వాలు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసే సంస్థలు లేదా, ఉపయోగించుకునే సంస్థలతో రెండేళ్ల పాటు కలిసి పనిచేస్తామని ఇన్వెస్టర్ గ్రూప్ సభ్యులు తెలిపారు.అమెజాన్, ఫేస్బుక్, ఆసియా టెక్ కంపెనీలైన అలీబాబా, హువావేలతో సహా 34 కంపెనీలు లీడ్ చేస్తాయని వెల్లడించారు. కాగా, ఈ ఫేస్ రికగ్నైజేషన్ పై హువావే ప్రతినిధి మాట్లాడుతూ “సాంకేతిక పరిజ్ఞానం మానవ, సామాజిక మరియు పర్యావరణ శ్రేయస్సును పెంచడానికి మాత్రమే ఉపయోగించాలి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ చుట్టూ నీతి మరియు పరిపాలన ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. స్పందించని అమెజాన్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీపై అమెజాన్ స్పందించలేదు. గతంలో అమెజాన్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని తయారు చేసి ఐఎన్‌సీ వెబ్డెవలపర్స్కు అమ్మింది. ఈ టెక్నాలజీ సాయంతో అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్యూ) నిర్వహించిన పరీక్షలో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సి నిందితుల్లో 28 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారని చూపించింది.దీనిపై వివాదం తలెత్తడంతో ఫేస్ ఐడీ టూల్ సెట్టింగ్స్‌ను పరిశీలిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రస్తుతం న్యూయార్క్ లైఫ్ కు చెందిన ఇన్వెస్టర్స్ బృందం సభ్యుల నిర్ణయంపై అమెజాన్ తో పాటు ఇతర సంస్థలు స్పందించలేదు. చదవండి : ఆర్టిఫిషియల్ ఐ... ప్రమాదాన్ని ముందే చెప్పేస్తుంది! -
ముఖాల గుర్తింపు సాఫ్ట్‌వేర్‌లో లోపాలా!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్’. ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానంగా దీన్ని పేర్కొనవచ్చు. ఆధార్ కార్డు మొదలుకొని, విమానాశ్రయాల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ వరకు అత్యాధునిక అవసరాల కోసం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫేస్బుక్ ఖాతాల వరకు సేఫ్టీ ఫీచర్‌గా కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ సాంకేతిక పరిజ్ఞానం నిక్కచ్చిగా పని చేస్తుందా ? ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా ? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని ‘యూనివర్శిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్’ పరిశోధకులు భావించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన నాలుగు పెద్ద ఐటీ సంస్థలకు ఇన్స్టాగ్రామ్ నుంచి సేకరించిన 2,450 మంది ముఖాల ఫొటోలను పంపించి తమకు కావాల్సిన సమాచారాన్ని కోరారు. వారి లింగాన్ని, అంటే ఆడ, మగలను గుర్తించాల్సిందిగా తెలిపారు. ఇప్పుడు లింగ మార్పిడి చేసుకున్న వారిని మూడో లింగంగా గుర్తిస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో మూడో లింగాన్ని గుర్తించే అంశమే లేదు. అందుకని పరిశోధకులు కొందరు ట్రాన్స్ జెండర్ల ఫొటోలను కూడా పంపించి వారు ఇప్పుడు మగవారా ? ఆడవారా ? అన్న అంశాన్ని సాఫ్ట్వేర్ ద్వారా తేల్చాల్సిందిగా కోరారు. ట్రాన్స్జెండర్ల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం 38 శాతం పొరపాటు పడింది. ఆడవాళ్ల విషయంలో ఎక్కువ కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. ఆడవాళ్లలో 98.3 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించగా, మగ వాళ్ల విషయంలో 97.6 శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించింది. అంటే మహిళల ముఖాలను గుర్తించడంలో రెండు శాతం కన్నా తక్కువ, మగవాళ్ల విషయంలో మూడు శాతం కన్నా తక్కువ పొరపాటు పడింది. ఈ మాత్రం పొరపాటు మనుషులే పడుతున్నప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం పడదా ? అని దాన్ని అభివృద్ధి చేసిన ఐటీ సంస్థలు వాదిస్తున్నాయి. మగవారిలాగా ఆడవారి దుస్తులు మారిన నేటి సమాజంలో మనం కూడా పొరపాటు పడడం సహజమే కదా!. అమెజాన్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, క్లారిఫై సంస్థలు ముఖాలను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి వాటిని వినియోగ సంస్థలకు అందిస్తున్నాయి. పనిచేసే విధానం ఈ సాంకేతిక పరిజ్ఞానం స్మార్ట్ డిజిటల్ వీడియో ద్వారా పనిచేస్తుంది. తన ముందుకు ఓ వ్యక్తి వచ్చినట్లయితే అదే పోలికలు ఉన్న వ్యక్తి లేదా ఆయన ఫొటో ఇంతకుముందు తన ముందుకు వచ్చిందా ? అన్న అంశంపై ఆధారపడి వ్యక్తులను గుర్తిస్తుంది. అంటే పాత ఫొటోతో కొత్త ఫొటోను పోల్చి చూస్తుంది. ఇలా పోల్చడంలో భిన్న వ్యక్తుల మధ్య సూక్ష్మ తేడాలను కూడా స్పష్టంగా గుర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి వ్యక్తికి మధ్య కళ్లు, ముక్కు, బుగ్గలు, నోరు వద్ద దాదాపు 80 రకాల సూక్ష్మ తేడాలు ఉంటాయి. ముక్కు ఎంత వెడల్పుగా ఉందో, కనుగుడ్లు ఎంత లోతుగా ఉన్నాయో, రెండు కళ్ల మధ్య దూరం ఎంతో, రెండు కళ్ల మధ్య ముక్కు ఎంత దూరంలో ఉందో, ముక్కుకు నోటికి మధ్య దూరం, కళ్లకు బుగ్గలు, నోరు మధ్య దూరం, మొత్తంగా ఒకదానికి ఒకటి ఎంతో దూరంలో అవయవాలున్నాయో డిజిటల్ వీడియో కచ్చితమైన లెక్కలు వేసి వ్యక్తులను గుర్తిస్తుంది. ఎంతటి కవల పిల్లలలోనైనా ముఖంలోని ఈ అవయవాలన్నీ ఏకరీతిగా, సమానమైన దూరంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అందుకని వ్యక్తులను గుర్తించడంలో పెద్దగా పొరపాట్లు ఉండవు. కానీ ఓ వ్యక్తి పాత, కొత్త ఫొటోలను పోల్చినప్పుడు అవి ఎంత దూరం నుంచి తీశారో, అంటే మొదటి ఫొటో నాలుగు అడుగుల దూరంలో ఉన్నప్పుడు తీస్తే, ప్రస్తుత ఫొటో రెండడుగుల దూరం నుంచి తీస్తే కొంత పారపాటు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రధాని కెమేరా లేదా వీడియో లెన్స్ పరిధిలోకి ఓ వ్యక్తి ముఖం ఎంత స్పష్టత పరిధిలోకి వచ్చిందనే విషయంపైనే కచ్చితత్వం ఎక్కువ ఆధార పడి ఉంటుందని వారంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఆడ, మగ లింగ భేదాలను గుర్తించడంలో మరింత కచ్చితత్వం కోసం గూగుల్ సంస్థ ప్రయత్నించి విరమించింది. -
ఎఫ్ఆర్ఎస్ అదుర్స్
సాక్షి,సిటీబ్యూరో: నగర పోలీస్ విభాగంలో రెండేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చి, కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ‘ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం’ (ఎఫ్ఆర్ఎస్)తో వచ్చిన అద్భుత ఫలితాలివి. ‘దర్పణ్’గా పిలుస్తున్న ఈ టెక్నాలజీని వినియోగించి నగర పోలీసులు ఇప్పటి వరకు 27 కేసులను కొలిక్కి తెచ్చారు. వీటిలో అత్యధికం మిస్సింగ్ కేసులు కాగా మిగతావి వివిధ నేరాల్లో, ఎన్బీడబ్ల్యూలు జారీ అయినవి ఉన్నాయి. పొరుగు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి నగరానికి వస్తూ ఇక్కడ పంజా విసురుతున్న ఘరానా గ్యాంగ్స్ ఆటకట్టించడానికి కూడా ఇకపై ఈ టెక్నాలజీని వాడనున్నారు. ‘పని’ పూర్తయ్యాకే చిక్కుతున్నారు మహానగరం అనేక రాష్ట్రాలకు చెందిన వలస దొంగలకు విలాస కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వచ్చే అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్స్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్నాచర్లు, మహారాష్ట్ర, ఒడిశాలకు చెందిన దోపిడీ, దొంగతనాల ముఠాలు తరచుగా సిటీకి వచ్చి వెళ్తున్నాయి. వీరంతా సిటీలో అడుగుపెట్టి, వరుసపెట్టి పంజా విసిరిన తర్వాత మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో నిందితులను పట్టుకోవడమూ కష్టంగా మారుతోంది. బవరియా వంటి ముఠాలనైతే వారి స్వస్థలాలకు వెళ్లి తీసుకురావడం అసాధ్యమే. ఇలాంటి అంతరాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే గుర్తించి, కట్టడి చేయగలిగితే నగరవాసికి ఎలాంటి నష్టం లేకుండా చేయవచ్చు. ఇదే ఆలోచనతో ‘ఎఫ్ఆర్ఎస్’ అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు ‘వాంటెడ్’గా ఉన్న వ్యక్తులు, మిస్సింగ్ అయిన వారి వివరాలతో పాటు గుర్తు తెలియని మృతదేహాల ఫొటోలను ‘చెక్’ చేయడానికి ఈ విధానం ఉపకరిస్తోంది. వినియోగిస్తున్న విధానమిలా.. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం సాఫ్ట్‌వేర్‌ను ‘నెక్’ అనే సంస్థ నుంచి నగర పోలీసు విభాగం ఖరీదు చేసింది. దీన్ని ప్రస్తుతం అధికారులు ఆఫ్‌లైన్, ఆన్లైన్ విధానాల్లో వినియోగిస్తున్నారు. నగరంలోని వివిధ ఠాణాల పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే అరెస్టయిన నిందితుల ఫొటోలు, వాంటెడ్‌గా ఉన్న వారు, మిస్సింగ్ అయిన వారి ఫొటోలతో బేటాబేస్ను రూపొందించారు. ఇవి నిక్షిప్తమై ఉన్న సర్వర్‌తో ఈ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించారు. దీంతో నగరంలోని ఏ పోలీస్ స్టేషన్, ప్రత్యేక విభాగానికి చెందిన అధికారులైనా ఓ వ్యక్తి ఫొటోను, గతంలో ఎక్కడైనా అరెస్ట్ అయ్యాడా? మిస్సింగ్ అయిన వ్యక్తా? వాంటెడ్‌గా ఉన్నాడా? అనేది ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా సర్వర్‌లో సెర్చ్ చేసి గుర్తిస్తున్నారు. కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్‌లో చిక్కిన అనుమానితుల ఫొటోలనూ ఈ రకంగానే సరిచూసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. అధికారుల చేతుల్లో ఉండే ట్యాబ్స్‌లో ‘టీఎస్ కాప్’ యాప్ ద్వారా, అధికారిక కంప్యూటర్లలో ఇంట్రానెట్ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను వాడే అవకాశం ఉంది. ‘పొరుగు వారి’ వివరాలూ చేరుస్తూ.. ఈ సిస్టంలో హైదరాబాద్‌లో అరెస్టయిన నేరగాళ్ల ఫొటోలతో పాటు పొరుగు రాష్ట్రాలు, నగరానికి ‘తాడికి’ ఉన్న ప్రాంతాలతో పాటు మెట్రో నగరాల్లో పట్టుబడిన వారి ఫోటోలు, వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు నగరానకి దారితీసే ప్రాంతాల్లోని సర్వైలెన్స్ కెమెరాలను పరిపుష్టం చేస్తారు. దీనికోసం ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఆన్లైన్లో ఉంచి లైవ్ సెర్చ్‌లు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో మరికొన్ని చోట్ల ఆ లైవ్ సెర్చ్ అందుబాటులో ఉంది. నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను సర్వర్ ద్వారా సీసీ కెమెరాలతో అనుసంధానిస్తున్నారు. ఇదే సర్వర్‌లో వాంటెడ్ వ్యక్తులు, పాత నేరగాళ్లు, మిస్సింగ్ కేసులకు సంబంధించి అదృశ్యమైన వారి ఫొటోలను నిక్షిప్తం చేస్తారు. ఫలితంగా నగరంలో ఏ సీసీ కెమెరా ముందు నుంచి అయినా ఆ వ్యక్తి కదలికలు ఉంటే సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించే సర్వర్ తక్షణం కంట్రోల్ రూమ్ సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. ఫలానా వ్యక్తి, ఫలానా ప్రాంతంలో ఉన్న కెమెరా ముందు నుంచి వెళ్లాడనేది పాప్అప్ రూపంలో అక్కడి సిబ్బందికి తెలియజేస్తుంది. వారు క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేయడం ద్వారా తమకు ‘కావాల్సిన’ వారిని పట్టుకుంటారు. సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే ఎఫ్ఆర్ఎస్ ఇంకా ఉపయుక్తంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ♦ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ మతిస్థిమితం లేని మహిళ ఆచూకీని తిరుమలగిరి పోలీసులు గుర్తించారు. ♦ అఫ్జల్‌గంజ్ ఠాణా పరిధిలో స్పృహ తప్పిన స్థితిలో పడివున్న ఓ వ్యక్తి ఖమ్మం ప్రాంతానికి చెందిన వాడని, అక్కడ మిస్సింగ్ కేసు కూడా ఉందని రెండురోజుల్లోనే తేల్చారు. ♦ ఏడాది క్రితం రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ అయి తప్పించుకు తిరుగుతున్న ‘వాంటెడ్’ను గోపాలపురం పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఇలాంటి కేసులన్నీ వేగంగా కొలిక్కి రావడానికి సిటీ పోలీసులు వినియోగిస్తున్న అధునాతన సాఫ్ట్‌వేరే కారణం. -
టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త టెక్నాలజీ
-
టోక్యో ఒలింపిక్స్‌లో కొత్త టెక్నాలజీ
టోక్యో : జపాన్ వేదికగా జరిగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫేషియల్ రికగ్నేషన్( ముఖాలను గుర్తు పట్టే) టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్ల భద్రతా పరిణామాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికను వాడనున్నట్లు స్పష్టం చేశారు. 2020 ఆగస్టు, జూలైలో జరిగే ఈ ఒలింపిక్స్ పోటీల్లో అథ్లెట్స్, ఆయా దేశాల సహాయక సిబ్బంది, మీడియా అధికారులతో కలిపి సుమారు మూడు లక్షల మంది పాల్గొననున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. వీరందరీ ఫేషియల్ ఇమేజేస్‌ను డేటాబెస్‌లో స్టోర్ చేసి ఫేషియల్ రికగ్నైషన్ టెక్నాలజీతో వీరి ముఖాలను సరిపోల్చి ఆయా మ్యాచ్‌లకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీకి కావల్సిన సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఈసీ కార్పోరేషన్ రూపోందిస్తుందని టోక్యో సెక్యూరిటీ ఛీఫ్ మీడియాకు తెలిపారు. దీని సాయంతో అక్రమంగా ప్రవేశించే వారిని అడ్డుకోవచ్చని, నకిలీ ప్రత్రాలను, మోసగాళ్లను గుర్తించడం సులభమవుతుందని ఆయన అభిప్రాపడ్డారు. ఎండలతో ఎఫెక్ట్.. మరి ఎలా ప్రస్తుతం జపాన్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వడగాలుల కారణంగా ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు 138 మంది చనిపోయారు. ఒలింపిక్స్ జరిగే సమయంలో ఎండలు, తేమ శాతం అత్యంత ప్రమాద స్థాయికి చేరే అవకాశం ఉంది. దీంతో నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు మండే ఎండల బారిన పడకుండా చూసేందుకు తమ కాలాన్ని రెండు గంటలు ముందుకు జరపాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తోందని స్థానిక పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒలింపిక్స్ అథ్లెట్లపై వేసవి ఎండల ప్రభావాన్ని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు పేర్కొంది. అయితే కాలాన్ని ముందు జరిపే ప్రతిపాదనను జపాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీనిని అమలు చేస్తే ఉద్యోగులు, కార్మికులు మరింత సమయం పనిచేయాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక నిర్వాకులు మాత్రం ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఎండ వేడి తగలకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికే ఈవెంట్స్ జరిగే ప్రదేశాల్లో చెట్లు పెంచే కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు. -
మిస్సింగ్ కేసుల్లో ఫేషియల్ రికగ్నైజేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అదృశ్యమైన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్(ఎఫ్ఆర్)ను వినియోగించుకోవాలని సీఐడీ భావిస్తోంది. యాదగిరిగుట్ట వ్యభిచార కూపంలోని చిన్నారులను రక్షించిన పోలీసులకు ఇప్పుడు వారిని తమ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత పడింది. ఆ చిన్నారుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది తల్లిదండ్రులు ముందుకొచ్చారు. అయితే ఎవరు ఎవరిబిడ్డో తేల్చలేని పరిస్థితి పోలీసులకు ఏర్ప డింది. దీంతో సీఐడీ దగ్గరున్న మిస్సింగ్ డేటాను ఎఫ్ఆర్ ద్వారా గుర్తించాలని సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్, చైల్డ్ రైట్ వింగ్ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెస్క్యూ అయిన చిన్నారుల తాజా ఫొటోలను తమ వద్ద ఉన్న సమాచారానికి పోలీసులు అనుసంధానిస్తున్నారు. -
ముఖం చూసి పట్టిస్తుంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ మరో టెక్నాలజీ ఆయుధాన్ని అందిపుచ్చుకుంది. మోస్ట్ వాంటెడ్ నేరస్తులు, పాతనేరస్తులు, తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తులు, అదృశ్యమైన చిన్నారులను గుర్తించేందుకు దేశంలోనే తొలిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అధికారులకు ఈ యాప్ ఎంతో ఉపకరించనుందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ముఖ్య కార్యాలయంలో గురువారం ఈ వ్యవస్థను ఆయన ఆవిష్కరించారు. ఈ సర్వీస్‌ను టీఎస్‌కాప్ యాప్‌కు అనుసంధానించినట్లు వెల్లడించారు. 30 సెకన్లలో సర్వర్ నుంచి.. ఈ యాప్‌లో ఇప్పటి వరకు లక్ష మంది పాతనేరస్తుల ఫొటోలు, అదృశ్యమైన వారి ఫొటోలు, దేశవ్యాప్తంగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఫొటోలు అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నిందితుల ఫొటోలను సైతం చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. తనిఖీల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తి తారసపడితే సంబంధిత వ్యక్తి ఫొటోను తీసుకొని యాప్‌లో సర్వర్‌కు కనెక్ట్ చేస్తే 30 సెకన్లలో సంబంధిత వ్యక్తి పాతనేరస్తుడైనా, అదృశ్యమైన వ్యక్తి అయినా తెలిసిపోతుందని డీజీపీ తెలిపారు. ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాల్లోని నేరస్తుల ఫొటోలు, దర్యాప్తు సంస్థల మోస్ట్‌వాంటెడ్, అరెస్ట్‌చేసిన వారి ఫొటోలు అప్డేట్ అవుతాయని, దీంతో ఈ యాప్ టీఎస్‌కాప్‌లోకి అప్డేట్ ఫొటోలను చేరవేస్తుందన్నారు. ఎవిడెన్స్ యాక్ట్ కిందకు రాదు.. ఈ సాంకేతికత ద్వారా గుర్తించిన నిందితుల చార్జిషీట్ దాఖలులో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఆధారాలుగా పేర్కొనలేమని డీజీపీ పేర్కొన్నారు. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం దీన్ని ఆధారం కింద పరిగణించలేమన్నారు. కికీ చాలెంజ్‌పై వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కికీ చాలెంజ్‌పై డీజీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రాణాంతక చాలెం జ్ను ఎవరు స్వీకరించినా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ధోరణి వల్ల ఇతరుల ప్రాణాలకు హాని ఉందని, చేసే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉండటంతో సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు చెప్పారు. -
కార్డు అక్కర్లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు!
బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఒకప్పుడు బ్రాంచికి వెళ్లి, అక్కడ పొడవాటి క్యూలో నిల్చుని తీసుకోవాల్సి వచ్చేది. తర్వాత ఏటీఎంలు వచ్చి బ్యాంకింగ్ రూపురేఖల్నే మార్చేశాయి. అయితే.. ఏటీఎం కార్డును ఎవరైనా దొంగిలిస్తే మాత్రం కాస్త కష్టంగానే ఉంటోంది. ఇప్పుడు ఈ కష్టాలకు కూడా చెక్ పెట్టేస్తున్నారు. కార్డులు జేబులో పెట్టుకోనవసరం లేదని.. అసలు కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయని చెబుతున్నారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి, మన ముఖాన్నే ఏటీఎం కార్డులా వాడుకుని డబ్బులు ఇస్తారట. ఆఫీసులో అటెండెన్సు కోసం వాడే బయోమెట్రిక్ టెక్నాలజీలో ఐరిస్ ఆధారంగా హాజరు పడుతుంది. దాన్నే కొంచెం మార్చి.. ముఖాన్ని గుర్తించి, ఒక పాస్వర్డ్ అడిగి.. దాన్ని బట్టి ఖాతాకు సంబంధించిన కార్యకలాపాలు చేసుకునే సరికొత్త టెక్నాలజీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇలాంటి పది మిషన్లను చైనా మర్చంట్ బ్యాంక్ వివిధ నగరాల్లో ఏర్పాటుచేసింది. ముఖాన్ని స్కాన్ చేయడం తరువాయి.. మీకు ఇష్టం వచ్చిన బ్యాంకు కార్యకలాపాలను ఈ మిషన్ల ద్వారా నిర్వహించుకోవచ్చట. టెలిఫోన్ నంబర్లను కూడా పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేయాలని చెబుతున్నారు. అచ్చం ఒకేలా ఉండే కవల పిల్లలు ఇద్దరు వచ్చినా కూడా వాళ్లలో ఎవరి అకౌంటును వాళ్లకే యాక్టివేట్ చేసేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. కళ్లజోడు పెట్టుకున్నా, మేకప్ వేసుకున్నా కూడా మీ ముఖాన్ని అది ఎంచక్కా గుర్తుపడుతుందట. అయితే మరీ ముఖం మొత్తం మారిపోయేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం మరోసారి బ్యాంకులో గుర్తింపుకార్డులు ఇచ్చి, ముఖాన్ని స్కాన్ చేయించుకోవాలి. ఈ పద్ధతిలో కేవలం 42 సెకన్లలోనే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చని చెబుతున్నారు.