జపాన్ వేదికగా జరిగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫేషియల్ రికగ్నేషన్( ముఖాలను గుర్తు పట్టే) టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆటగాళ్ల భద్రతా పరిణామాలను మెరుగుపరిచేందుకు ఈ సాంకేతికను వాడనున్నట్లు స్పష్టం చేశారు. 2020 ఆగస్టు, జూలైలో జరిగే ఈ ఒలింపిక్స్ పోటీల్లో అథ్లెట్స్, ఆయా దేశాల సహాయక సిబ్బంది, మీడియా అధికారులతో కలిపి సుమారు మూడు లక్షల మంది పాల్గొననున్నట్లు వారు అంచనా వేస్తున్నారు. వీరందరీ ఫేషియల్ ఇమేజేస్‌ను డేటాబెస్‌లో స్టోర్ చేసి ఫేషియల్ రికగ్నైషన్ టెక్నాలజీతో వీరి ముఖాలను సరిపోల్చి ఆయా మ్యాచ్‌లకు అనుమతిస్తామని పేర్కొన్నారు.