న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సోమవారం జరగనున్న భారత 75వ స్వాతంత్య్రదిన వేడుకలకి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రకోట ప్రవేశ ద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి 7 వేల మంది ఆహుతులు వస్తూ ఉంటే ఎర్ర కోట చుట్టుపక్కల 10 వేల మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు.
సోమవారం జాతీయ జెండాను ఆవిష్కృతం చేసేంతవరకు ఎర్రకోట చుట్టూ అయిదు కిలో మీటర్ల మేర ఎలాంటి పతంగులు ఎగరవేయకూడదని ఆంక్షలు విధించారు. డ్రోన్లతో కూడా నిరంతరం పహారా ఉంటుంది. ఎర్రకోట ప్రాంగణంలోకి లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, రిమోట్ కంట్రోల్డ్ కారు కీస్, సిగరెట్ లైటర్స్, బ్రీఫ్‌కేసెస్, హ్యాండ్‌బ్యాగ్స్, కెమెరాలు, బైనాక్యులర్స్, గొడుగులు తీసుకురావడంపై నిషేధం విధించారు. వీవీఐపీలు వచ్చే మార్గంలో దాదాపుగా వెయ్యి హైస్పెసిఫికేషన్ కెమెరాలను అమర్చారు. 400కి పైగా కైట్ కేచర్స్‌ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment