గూడూరు నారాయణ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ పర్యటన తెలంగాణాను అవమానపరిచే విధంగా ఉందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి వ్యాక్యానించారు. హైదరాబాద్‌లో గూడూరు నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..పిలవని పేరంటానికి కేసీఆర్ వెళ్లారని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పట్ల మమత బెనర్జీ, నవీన్ పట్నాయక్‌లు సుముఖంగా లేరని అన్నారు. అయినా కేసీఆర్ వారి చుట్టూ తిరగడం రాజకీయంగా బీజేపీకి లాభం చేకూర్చేందుకేనని అభిప్రాయపడ్డారు.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మమత బెనర్జీ ఇద్దరూ కూడా కేసీఆర్ కలిసిన తర్వాత మీడియాతో ఎలాంటి ఫ్రంట్ గురించి మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ కేవలం మోదీ ఆదేశాల మేరకే ఈ ఫ్రంట్‌ల పేరుతో తిరుగుతున్నారని ఆరోపించారు. యూపీఏను దెబ్బతీయడానికి ఎన్డీఏతో కలిసి కేసీఆర్ చేస్తున్న కుట్ర అని వ్యాక్యానించారు. కేసీఆర్‌ను దేశంలో ఏ రాజకీయపార్టీ నమ్మదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment