కాంగ్రెస్ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీపీసీసీ కోశాధికారి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి చెప్పారు. గూడూరు నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మా ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే తాను ఎమ్మెల్సీ అయ్యేవాడినని గుర్తు చేశారు.
కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కోసమే కేసీఆర్ ఆశపడుతున్నారని, అలాగే నన్ను కూడా రాజకీయ నాయకుడిగా చూడాలని మా తల్లి ఆశపడిందని తెలిపారు. మా అమ్మ ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారని భావోద్వేగంతో అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగడం లేదని విమర్శించారు. ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే పాలన మంచిగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment