నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ నిజస్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియచేస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ
ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేరెళ్ల ఘటనపై అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రభుత్వ నిజస్వరూపాన్ని దేశ ప్రజలకు తెలియచేస్తామని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
పోలీసుల అండతో ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్న తీరును నాయస్థానాల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఘటనకు బాధ్యత వహించి ఇప్పటికే సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి కేటీఆర్ గుట్టుగా పర్యటించి కేసును నీరుగార్చే యత్నం చేయడం దారుణమని నారాయణరెడ్డి మండిపడ్డారు.