
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకుంటోందని పదేపదే అనడం సరైంది కాదని అన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఓపెన్‌కట్ పంప్‌హౌస్‌ను నిర్మించే అవకాశం ఉన్నా అండర్ గ్రౌండ్ పంప్‌హౌస్ ఎందుకు నిర్మిస్తున్నారో సాగునీటి మంత్రి హరీశ్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి భూమిని సేకరించాలన్నదే తమ డిమాండ్ అని అన్నారు. హరీశ్‌రావు ఉత్తమ్‌కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment