సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆ విషయం మరిచి టీఆర్‌ఎస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆయన చేసిన ప్రసంగం గవర్నర్‌గా రిటైర్మెంట్ అయ్యా క టీఆర్‌ఎస్‌లో చేరేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గవర్నర్ ప్రశంసించవచ్చు, కానీ నరసింహన్ మాత్రం కేసీఆర్, ఆయ న పార్టీని పొగిడేందుకే ఎక్కువ ఉత్సా హం చూపారన్నారు.
గవర్నర్ ప్రసంగం పరమ చెత్తగా ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో గవర్నర్‌గా పదవీ కాలం ముగియనుండటంతో అది పొడిగించుకునేందుకే ఆయన వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందన్నారు. తాను ప్రాతినిథ్యం వహించేది రాజ్‌భవన్‌కు అని, టీఆర్‌ఎస్‌కు కాదని గవర్నర్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment