
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆ పార్టీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అన్ని పార్టీలు తిరిగిన గుత్తాకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉండి మిషన్ భగీరథలో జరుగుతున్న అవినీతిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆధారాలు సేకరించి.. ఆ తర్వాత డబ్బులకు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గుత్తా మాదిరి మూడు పార్టీలు మారలేదని తెలిపారు. గుత్తా రాజకీయాలకు పనికిరాడని.. ముఖ్యమంత్రి వద్ద చెంచాగిరి చేసుకోవడానికే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ సీనియర్లపై గుత్తా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment